530 కోట్ల రెమ్యునరేషన్.. ఇండియన్ సినిమాలో హాలీవుడ్ స్టార్‌కు రికార్డు పారితోషికం!
భారతీయ సినిమా రంగం ప్రస్తుతం ఎల్లలు దాటి గ్లోబల్ సినిమాగా అవతరించింది. ఇండియన్ సినిమాల్లో ఇంటర్నేషనల్ స్టార్స్ రావడం కొత్తేమీ కాదు. సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎంతో మంది ఫారిన్ యాక్టర్లు పరిచయమై అభిమానులను సొంతం చేసుకొన్నారు. అయితే తాజాగా మరో హాలీవుడ్‌లో పాపులర్ స్టార్ భారతీయ సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నటించినందుకు గాను ఊహించని మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా ఇచ్చేందుకు సిద్దమయ్యారు అని అంతర్జాతీయ మ్యాగజైన్ సన్ కథనాన్ని ప్రచురించింది. ఆ స్టార్ ఎవరు? ఆమెకు ఎన్ని వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా ఆఫర్ చేశారనే విషయంలోకి వెళితే..
భారతీయ సినిమా రంగంలో మరో ఇంటర్నేషనల్ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమా కథ డిమాండ్ చేయడంతో సిడ్నీ స్వీనీ అనే పాపులర్ స్టార్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమె అంగీకరించడంతో ఈ మూవీకి క్రేజ్ పెరిగింది. దాంతో సిడ్నీ స్వీనీ ఎవరు అనే విషయంపై అందరిలోను ఆసక్తి పెరిగింది.

సిడ్నీ స్వీనీ అసలు పేరు సిడ్నీ బెర్నీస్ స్వీనీ. అమెరికా నటిగా పాపులారిటీని సాధించారు. ఎవరీథింగ్ సక్స్, ది హ్యాండ్ మేడ్స్ టేల్, షార్ప్ ఆబ్జెక్ట్స్ అనే సినిమాల్లో నటించి తన సత్తాను చాటుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. క్వెంటీన్ తారాంటినో రూపొందించిన వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో నటించి మెప్పించారు. ఆమె యుఫోరియా అనే వెబ్ సిరీస్‌లోను నటించాను.
భారతీయ నిర్మాతలు సిడ్నీ స్వీనీని ఓ కథ కోసం సంప్రదించారు. యుక్త వయసులో ఉన్న అమెరికన్ స్టార్ భారతీయ యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆ పాత్ర కోసం ఆమెను సంప్రదించగా అందుకు సుముఖతను వ్యక్తం చేశారు. అయితే ఆమె డిమాండ్ మేరకు సుమారుగా 35 మిలియన్ పౌండ్స్ అంటే భారతీయ కరెన్సీలో 415 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా చెల్లించేందుకు సిద్దపడ్డారు. అలాగే స్పాన్సర్ షిప్స్ పేరిట మరో 10 మిలియన్ పౌండ్లు అంటే. 115 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా 530 కోట్ల రూపాయలు ఆమెకు ఈ సినిమా ద్వారా లభించే అవకాశం ఉంది అని సన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.
భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందించే ఈ సినిమా వివరాలను, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతల పేర్లను సీక్రెట్‌గా ఉంచారు. ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా అమెరికాలొని న్యూయార్క్, ఫ్సాన్స్‌లోని పారిస్, యూకేలోని లండన్, దుబాయ్ దేశాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను 2026 సంవత్సరం ఆరంభంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సిడ్నీ స్వీనీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ది వైట్ లోటస్ చిత్రంలో నటించారు. అలాగే ఆమె నటించిన క్రిస్టీ అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో మహిళా బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో బెన్ ఫోస్టర్, మెరిట్ వేవర్ నటించారు. ఈ చిత్రం నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











