twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని ఏమైనా అంటే చంపేస్తా.. అందుకే అలాంటి రియాక్షన్.. బ్రహ్మాజీ క్లారిటీ

    |

    చిన్న బడ్జెట్ చిత్రాల్లో సూపర్ బజ్‌తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న చిత్రం ఓ పిట్ట కథ. భవ్య క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కానున్నది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలో బ్రహ్మాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఓ పిట్ట కథ సినిమా గురించి, తన కుమారుడి గురించి, అలాగే సినిమాకు సహకారం అందించిన స్టార్ హీరోల గురించి మాట్లాడారు. బ్రహ్మాజీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    అందుకే అలా రియాక్ట్ అయ్యా

    అందుకే అలా రియాక్ట్ అయ్యా

    ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి ముందు ఆయన కలిస్తే చాలా బిజీగా ఉన్నారు. సాధారణంగా ఎవరినైనా ట్వీట్ పెట్టమంటే ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో మా చిన్న సినిమాను ప్రమోట్ చేయడానికి టైం అడ్జస్ట్ చేసుకొని చిరంజీవి గారు రావడం నిజంగా నాకు ఎమోషనల్ విషయం. అర్ధగంట కోసం వచ్చిన ఆయన రెండు గంటలపాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఉన్నారు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను అని బ్రహ్మాజీ అన్నారు.

    చిరంజీవి లివింగ్ లెజెండ్

    చిరంజీవి లివింగ్ లెజెండ్

    చిరంజీవి లివింగ్ లెజెండ్. ఆయన గొప్ప సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తిపై చెడుగా మాట్లాడవద్దు. ఎన్టీఆర్, అక్కినేని తర్వాత ఇండస్ట్రీలో చిరంజీవికి అంత పేరు ఉంది. అలాంటి వ్యక్తిపై ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే చంపేస్తా అనే ఫీలింగ్ కలుగుతుంది. వాడిని చంపేస్తా.. నీ కోసం చచ్చిపోతాను అని అంటాం. కానీ అలాంటి పనులు చేయలేం. ప్రతీ ఒక్కరూ అలా మాట్లాడుతారు కానీ వాస్తవానికి వస్తే ఎవరూ అలా బిహేవ్ చేయరు అని బ్రహ్మాజీ పేర్కొన్నారు.

    ఓ పిట్ట కథ మంచి కథ

    ఓ పిట్ట కథ మంచి కథ

    ఓ పిట్ట కథ మంచి కథ కాబట్టే నా భుజాన ప్రమోట్ చేశాను. ఓ మంచి సినిమా కాబట్టే నేను మహేష్‌బాబు వద్దకు వెళ్లి టీజర్ రిలీజ్ చేయమని అడిగాను. ఒకవేళ మంచి సినిమా కాకపోతే.. ఏంటీ బ్రహ్మాజీ.. నా చేత దరిద్రమైన సినిమా టీజర్‌ను రిలీజ్ చేయించావనే ప్రమాదం ఉంది. నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్, ధైర్యం ఉంది కాబట్టే పెద్ద వారి సహకారం ఉంటుంది. ఓ పిట్ట కథ లాంటి మంచి సినిమా ఆడితే చిరంజీవి కూడా హ్యాపీగా ఫీలవుతారు అని బ్రహ్మాజీ అభిప్రాయపడ్డారు.

    స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్

    స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్

    ఓ పిట్ట కథ సినిమా విషయానికి వస్తే.. మూవీ ఆరంభంలో కథలోకి వెళ్లడానికి 10 నిమిషాలు టైమ్ తీసుకొంటుంది. ఆ తర్వాత కథలోకి వెళ్లాక నాన్‌స్టాప్ ఫ్లో వెళ్తుంది. ఇక సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్. తెలుగులో ఇలాంటి స్క్రీన్ ప్లేతో సినిమా ఇప్పటి వరకు రాలేదని చెప్పగలను అని బ్రహ్మాజీ అన్నారు.

    నేను నిర్మాతను కాను..

    నేను నిర్మాతను కాను..

    నా కుమారుడిని లాంచ్ చేయడానికి నేను ఈ సినిమాకు నిర్మాతను అని వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఏదో ఒక్క సినిమాకు ఫేక్‌గా నిర్మాతనై.. సినిమాను సెలబ్రిటీలతో ప్రమోషన్ చేయించి ఒక్క రాత్రిలో డబ్బులు సంపాదించే ఆశ లేదు. ఓ చిన్న సినిమాను, మంచి కథను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలంటే స్టార్లు అవసరమని భావించాను. ఈ సినిమాకు భవ్య క్రియేషన్స్ మాత్రమే నిర్మాత అని బ్రహ్మాజీ తేల్చేశారు.

    చిన్న సినిమాలు ఆడితే..

    చిన్న సినిమాలు ఆడితే..

    ఓ పిట్ట కథ సినిమాగా రావడానికి ప్రధాన కారణం చంద్రశేఖర్ ఏలేటి. భవ్య క్రియేషన్స్ వద్దకు ఈ స్క్రిప్టు వచ్చినప్పుడు చంద్రశేఖర్ ఏలేటిని చూడమన్నారు. స్క్రిప్టు చూసిన తర్వాత ఆయనకు తెగ నచ్చేసింది. దాంతో ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ చేశారు. ఇలాంటి సినిమాలు ఆడితే చిన్న నిర్మాతలకు ధైర్యం వస్తుంది. భవ్య క్రియేషన్స్ మళ్లీ ఓ సినిమా చేయడానికి ముందుకు రావొచ్చు అని బ్రహ్మాజీ అన్నారు.

    English summary
    Superstar Mahesh, Megastar Chiranjeevi appreciates film units. This movie directed by Chendu Muddu. Produced by V Ananda Prasad. This film set to release on March 6th. In this occassion, Viswant speaks to Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X