Don't Miss!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- News
సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీనేత ఆత్మహత్య.. ఎన్నికల ఓటమి, వారి వేధింపులే కారణం!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy ‘బాలకృష్ణ దేవుడు లాంటి మనిషి.. ఆ విషయం నమ్మలేకపోయాను’
God of Masses నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. ఈ క్రమంలో వీరసింహారెడ్డి చిత్రంలో విలన్ పాత్రలో కనిపించునున్న కన్నడస్టార్ దునియా విజయ్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకొన్నారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
వీరసింహారెడ్డి సినిమాలో నా పాత్ర గురించి దర్శకుడు మలినేని గోపిచంద్ చెప్పగానే థ్రిల్ అయ్యాను. ఇంకా ఈ చిత్రంలో బాలకృష్ణ హీరో అని, ఆయనకు వ్యతిరేకంగా విలన్ పాత్ర అని చెప్పగానే గొప్ప అవకాశంగా ఫీలయ్యాను. ఈ పాత్రకు నేనైతేనే కరెక్ట్ సూట్ అవుతానని గోపిచంద్ చెప్పారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. వీరసింహారెడ్డి సినిమాకు విలన్ పాత్ర మూలస్థంభంగా ఉంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. గోపిచంద్ ఊహించినట్టుగానే నా పాత్ర చాలా అద్బుతంగా వచ్చింది అని దునియా విజయ్ అన్నారు.

బాలకృష్ణతో నటించడం మరిచిపోలేని అనుభూతి. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. బాలకృష్ణను సెట్లో తొలిసారి చూపినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. ఆ అనుభూతిని మాటల్లో వ్యక్త పరచలేను అని దునియా విజయ్ తెలిపారు.
బాలకృష్ణ సినిమాలో సహజంగానే ఫైట్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వీరసింహారెడ్డిలో అంతే పవర్‌ఫుల్‌గా, ఫుల్ ఎనర్జీతో ఫైట్స్ ఉంటాయి. ఆయనతో కలిసి పనిచేయడం జీవితంలో మరిచిపోలేను. నటనపట్ల అంకితభావం గొప్పగా ఉంటుంది. ఆయన నుంచి డిడికెషన్ విషయంలో స్పూర్తి పొందాను. బాలకృష్ణను ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు దేవుడు లాంటి మనిషిని చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలిగింది.
వీరసింహారెడ్డి సినిమా ఒక ఎమోషనల్ జర్నీ. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, యాక్షన్, వినోదం అన్నీ కలబోసి ఉంటాయి. పండుగ సమయంలో చక్కటి అనుభూతిని కలిగించే చిత్రం అని దునియా విజయ్ పేర్కొన్నారు.