twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Fathers day మరో జన్మంటూ ఉంటే ఎంఎస్ రాజు కొడుకుగానే.. సుమంత్ అశ్విన్ ఎమోషనల్ కామెంట్స్

    |

    ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు కుమారుడిగా తెలుగు సినిమా పరిచయమైన సుమంత్ అశ్విన్ జూలై 20వ తేదీకి 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోబోతున్నారు. అలాగే జూన్ 30న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. అలాగే సుమంత్ అశ్విన్ నటించిన లేటేస్ట్ మూవీ 7 Days 6 Nights జూన్ 24న రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో సుమంత్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ..

    టాలీవుడ్‌లో 20 ఏళ్ల జర్నీ చాలా అందంగా ఉంది. నేను నటించిన చిత్రాలు హిట్స్ అయ్యాయి. కొన్ని నిరాశ పరిచాయి. గత పదేళ్లు సమయం తెలియకుండా స్పీడ్‌గా గడిచిపోయాయి. నా కెరీర్ గ్రాఫ్ పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నాను. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా నటించాలని అనుకోవడమే ప్రస్తుతం నేను తీసుకొన్న సరికొత్త నిర్ణయాలు అని సుమంత్ అశ్విన్ తెలిపారు.

    నా కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చి చూస్తే.. 7 డేస్ 6 నైట్స్ చిత్రం విభిన్నమైనది. వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలో నటించాను. కెరీర్ పరంగా బెస్ట్ రోల్ అని చెప్పగలను. డిఫరెంట్ రోల్స్ చేసే హీరోలను ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులకు వరల్డ్ సినిమా దగ్గరైంది. వాళ్ల అంచనాలను చేరుకోవాలంటే.. మనం నెక్ట్స్ లెవెల్ థింగ్స్ చేయాలి అని సుమంత్ అశ్విన్ చెప్పారు.

    7 డేస్ 6 నైట్స్ సినిమాలో ఫిల్మ్ మేకర్ కావాలనుకొనే యువకుడి పాత్రలో కనిపిస్తాను. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ... తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద ఒళ్లు, ఆరోగ్యం గురించి పట్టించుకోడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏడు రోజులు ఆరు రోజుల్లో జరిగిన విషయాలే ఈ సినిమా కథ. నేను ఈ సినిమా చూసినప్పుడు నాతోపాటు మా అమ్మ, సిస్టర్ కూడా ఉన్నారు. మా ఇంట్లో సినిమా అని కాదు... చీప్‌గా ఉంటే వాళ్ళతో కలిసి చూడలేం. ఇబ్బంది పడే సన్నివేశాలు ఉండవు. నాకు బోల్డ్ అనే పదం నచ్చదు. యువత అడల్ట్ కంటెంట్ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడదగిన సినిమా అని సుమంత్ అశ్విన్ చెప్పారు.

    మా నాన్న ఎంఎస్ రాజు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. హీరోలను ఎలివేట్ చేయడం కోసం సినిమాలు తీశారు. నన్ను ఎలివేట్ చేయడం కోసం సినిమాలు తీస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా నేను ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని. ప్లాన్ చేస్తున్నాాను. అయితే 7 డేస్ 6 నైట్స్ సినిమా చూపించి ఆయనే నాకు గిఫ్ట్ ఇచ్చారు. సినిమా చాలా బావుంది. నేను చాలా హ్యాపీ. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటారు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే... మరో జన్మంటూ ఉంటే, దేవుడు వచ్చి ఏం కావాలని అడిగితే మళ్ళీ హైదరాబాద్‌లో ఎంఎస్ రాజు గారి అబ్బాయిలా పుట్టాలి అని కోరుకుంటా. ఆయన ఎలాంటి ఫాదర్ అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే నాన్న అది ఇచ్చారు. నాన్న పర్ఫెక్ట్ ఫాదర్. ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు దంపతుల కడుపున జన్మించాలని కోరుకుంటున్నా అని సుమంత్ అశ్విన్ తెలిపారు.

     Actor Sumanth Ashwin emotional comments about MS Raju, 7 days 6 nights movie

    నాన్నగారు ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్స్, బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వలేదని ఎప్పుడు నాకు అసంతృప్తి లేదు. ఒక్కోసారి టైమ్ అంతే! తూనీగ తూనీగ కోసం మూడు నాలుగు సినిమాలకు పెట్టినంత ఎఫర్ట్ పెట్టాం. ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. కొన్ని సినిమాలు పేపర్ మీద బాగుంటాయి. ఎక్కడో చిన్న తప్పు వల్ల అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే, మనం చేసే హార్డ్ వర్క్ విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదు అని సుమంత్ అశ్విన్ చెప్పారు.

     Actor Sumanth Ashwin emotional comments about MS Raju, 7 days 6 nights movie

    English summary
    7 days 6 nights movie is set to release on June 24th. Here is hero Sumanth ashwin's interview about the movie and Producer and director MS Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X