twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటర్మీడియెట్ పుస్తకాలు అమ్మి.. పూరీ జగన్నాథ్ మూవీ చూశా.. సినిమా అంటే అంత పిచ్చి.. తిరువీర్

    |

    మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, లాంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం మసూద. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయమయ్యారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ హారర్ డ్రామా.. విడుదలైన మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో నటుడు తిరువీర్ మీడియాతో మాట్లాడుతూ...

     మసూద కోసం ట్రయల్ షూట్

    మసూద కోసం ట్రయల్ షూట్


    కొబ్బరిమట్ట డైరెక్టర్‌తో పరేషాన్ అనే సినిమా చేస్తున్న సమయంలో సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి కలిసి.. స్వధర్మ బ్యానర్‌లో మీకు ఆఫర్ ఉంది.. వారి నుంచి కాల్ వచ్చిందా? అని అడిగాడు. దాంతో వారి నుంచి కాల్ వస్తే.. ఎలాంటి షరతులు లేకుండా సినిమా చేయాలని అనుకొన్నాను. ఆ సమయంలో డైరెక్టర్ వచ్చి కలిసి.. యూట్యూబ్‌లో మీ వీడియో చూశాను. మీరు బయట ఎలా ఉంటారో చూడాలని వచ్చాను. మిమ్మల్ని కలిశానని సినిమాపై ఆశ పెట్టుకోకు. నిర్మాతకు నచ్చితే ఆఫర్ ఉంటుందని చెప్పాడు. అలా క్లారిటీతో డైరెక్టర్ చెప్పేసరికి నాకు బాగా నచ్చాడు. సినిమా పరిశ్రమలో కలిసి పనిచేద్దామని చెప్పి.. మళ్లీ కనిపించకుండా పారిపోయేవాళ్లను చూశాను. కానీ ఇలా సినిమాపై ఆశపెట్టుకోకు అనే వాళ్లను చూడటం ఇదే ఫస్ట్ అని నటుడు తిరువీర్ అన్నారు.

    మసూద ఆఫర్ ఎలా వచ్చిందంటే?

    మసూద ఆఫర్ ఎలా వచ్చిందంటే?


    మసూద సినిమాలోని ఇంగ్లీష్‌ డైలాగ్స్ నాతో డెమో షూట్ చేశాడు. నాకు ఇంగ్లీష్ రాకపోవడం, డైలాగ్ గుర్తుకు ఉండగకపోవడంతో రెండు మూడుసార్లు రీటేక్స్ తీసుకొన్నాను. ట్రయల్ షూట్‌లో రీటేక్స్ తీసుకోవడంతో నాకు ఆఫర్ ఇవ్వరని అనుకొన్నాను. డెమో షూట్ తర్వాత నిర్మాతకు నచ్చితేనే సినిమాలో ఆఫర్ ఉంటుందని చెప్పాడు. వారం తర్వాత మసూదలో ఆఫర్ ఇస్తున్నామని చెప్పారు. అలా మసూద రూపంలో ఆఫర్ వచ్చింది అని తిరువీర్ తెలిపారు.

     నాకు హీరో కావాలనే కోరిక..

    నాకు హీరో కావాలనే కోరిక..


    మసూదకు ముందు హీరో, విలన్ పాత్రలు చేశాను. ఒకే తరహా పాత్రల్లో నటించడం, అలాంటి ఆఫర్లే రావడంతో కొంత బాధపడ్డాను. అయితే ఏ నటుడికైనా హీరో కావాలని మనసులో ఉంటుంది. కొందరు చెప్పుకొంటారు.. కొందరు చెప్పుకోరు. నాకు కూడా హీరో కావాలనే కోరిక మనసులో ఉండేది. జార్జిరెడ్డిలో విలన్, టక్ జగదీష్‌లో సైకో లాంటి పాత్రలు చేశాను. అంతకంటే నేను చేయాలేనా అని మదనపడుతున్న సమయంలో మసూద సినిమాలో హీరో ఆఫర్ వచ్చింది. అందుకే నేను కొంత టెన్షన్ పడ్డాను అని తిరువీర్ చెప్పారు.

    పుస్తకాలు అమ్మి.. సినిమా చూశా..

    పుస్తకాలు అమ్మి.. సినిమా చూశా..


    చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే పిచ్చి. సినిమా చూడాలని ఉండేది కానీ.. నేను ఇంట్లో ఎవరినీ డబ్బులు అడగకపోయేది. ఎవరైనా చుట్టాలు వచ్చి.. లేదా మా అక్కలు డబ్బులు ఇస్తే నేను సినిమాకు పోయేవాడిని. ఇంటర్మీడియెట్ చదువుతుండగా.. పుస్తకాలు అమ్మితే 10 రూపాయలు వచ్చాయి.. వాటితో నేను అమ్మ, నాన్న, తమిళ అమ్మాయి సినిమా చూశాను. చిన్నతనంలో నేను పోస్టర్లు చూసి కథ అల్లుకొనే వాడిని. అనుకోకుండా ఒకరోజు సినిమా పోస్టర్ చూసి ఒక కథ అనుకొన్నాను. టీవీలో సినిమా వచ్చి చూసి నేను షాక్ తిన్నాను. ఆ సినిమా పోస్టర్‌పై జగపతిబాబు లేకపోవడం చూశాను. కానీ సినిమాలో ఆయన ఉండటం చూసి నన్ను మోసం చేశారని అనుకొన్నాను అని తిరువీర్ అన్నాడు.

    నేను స్వతహాగా భయస్థుడిని

    నేను స్వతహాగా భయస్థుడిని


    మసూద సినిమాలో గోపీ పాత్ర కోసం నేను ఎక్కువగా కష్టపడలేదు. ఎందుకంటే.. నాకు చిన్నప్పటి నుంచే కొన్ని భయాలు ఉన్నాయి. చీకటి, స్కూల్‌లో టీచర్, అప్పుల వాళ్లు అంటే ఒకరకమైన భయం ఉండేది. నాలో ఉన్న భయాల వల్లే గోపి పాత్ర బాగా పండింది. నా కళ్లు బాగుంటాయని అంటారు. కానీ భయంతోనే నా కళ్లు పలుకుతాయి. గోపి పాత్ర నాకు చాలా ఇష్టం అని తిరువీర్ చెప్పాడు.

    సీనియర్ యాక్టర్లతో నటించడం

    సీనియర్ యాక్టర్లతో నటించడం

    సినిమా పరిశ్రమలో యాక్టర్లను చూడటం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడైనా షూటింగ్ జరిగితే.. అక్కడ సినిమా యాక్టర్లను చూస్తూ ఎంజాయ్ చేసేవాడిని. అలాంటి వాడికి నాకు ఘాజీలో కేకే మీనన్, ఇతర సీనియర్ నటీనటులతో నటించాను. అలాగే చిన్నప్పుడు శివపుత్రుడు, ఖడ్గం సినిమాలో సంగీతను చూసి ఇష్టపడేవాడిని. అలాంటిది సంగీతతో కలిసి మసూద చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది. అలాగే మల్లేశం సినిమాలో ఝాన్సీతో నటించడం కూడా అంతే ఆనందం ఉండేది అని తిరువీర్ చెప్పాడు.

     మసూదతో ప్రేక్షకులకు చేరువయ్యాను..

    మసూదతో ప్రేక్షకులకు చేరువయ్యాను..


    మసూద సినిమా ట్రయల్ షూట్ చేసినప్పుడు కథ తెలియదు. ముస్లిం బ్యాక్ డ్రాప్‌‌తో సినిమా చేసిన తర్వాత నాకు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ మంచి కథ చెబుతున్నారనే అభిప్రాయంతో ఉన్నాను. మల్లేశం, జార్జిరెడ్డి, ఘాజీ లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. దాంతో నేను ఇండస్ట్రీకి మాత్రమే తెలిశాను. ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాను. మసూద సినిమాతో ఆ గ్యాప్ ఫిల్ అయింది. ఇప్పుడు గోపి అంటూ సోషల్ మీడియాలో నా అకౌంట్లకు మెసేజ్ పెడుతున్నారు. మసూదతో నేను జనాల్లోకి వెళ్లడం హ్యాపీగా ఉంది అని తిరువీర్ అన్నారు.

    English summary
    Producer Rahul Yadav Nakka's Masooda is doing good business at Box office. This movie has released on November 18th. In this occassion, Actor Tiruveer speaks about the Masooda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X