కన్నప్ప తర్వాత కనిపించని మోహన్ బాబు.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి

టాలీవుడ్ స్టార్ నటి, ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచిరాలే. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఆమె నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా, ప్రొడ్యూసర్ గా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. స్టార్ కిడ్ అయినప్పటికీ స్వతహాగా కష్టపడి ఎదగాలనే తత్వం కలిగి ఉంది. ప్రస్తుతం మంచు లక్ష్మి దక్ష అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దక్ష : ది డెడ్లీ కాన్‌స్పిరసీ అనే టైటిల్ తో అడ్వెంచర్ సూపర్ నేచురల్ చిత్రాన్ని మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ గా డాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రసన్న, సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాతగా మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రసన్న వ్యవహరించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - దర్శకత్వం వంశీ కృష్ణ మల్ల అందించారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫిగా, మధు రెడ్డి ఎడిటర్ గా బాధ్యతలు చూశారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.

Actress Manchu Lakshmi about her Father Mohan Babu Present Schedule

కాగా, మంచు లక్ష్మి దక్ష సినిమాను ఒక్కరే ప్రమోట్ చేస్తున్నారు. నిర్మాతగా వ్యవహరించిన మంచు మోహన్ బాబు ఎందుకు రావడం లేదనేది సందేహంగా మారింది. ఇదే ప్రశ్న మంచు లక్ష్మి వరకు వెళ్లడం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నాన్న గారు తన పనుల్లో బిజీగా ఉన్నారని, అలాగే తనకు బయటికి వచ్చే సమయం లేదని చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నా తనపై తన సినిమాపై ఎప్పుడు తన తండ్రి ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చింది.

ఇక మంచు లక్ష్మి తన ఇద్దరు తమ్ముళ్ల గురించి కూడా స్పందించింది. మంచు విష్ణు కూడా తన కెరీర్ లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారని చెబుతున్నారని చెప్పింది. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా ఆలోచిస్తారని, 1000 శాతం విజువలైజ్ చేస్తాడని, స్పష్టంగా ఉంటాడని చెప్పింది. ఇక మనోజ్ కు అన్ని విషయాలు కలిసి వస్తుంటాయి. అది సంతోషకరం అని చెప్పింది. మిరాయ్ తో మనోజ్ కు మంచి హిట్ అందడం దేవుడి ఆశీస్సులుగా భావించింది.

ఇక తన కుటుంబ ఎప్పుడూ కలిసి ఉండాని కోరుకుంటానని చెప్పారు. అందుకోసం ఏదైనా చేస్తానని మంచు లక్ష్మి చెప్పింది. ఇక తనను కెరీర్ పరంగా, తన కూతురు చదువు కోసమని ముంబైలో ఉంటున్నాని చెప్పుకొచ్చారు. వర్క్ ఉన్నప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా పరిశ్రమల్లో కనిపిస్తూ ఉంటానని చెప్పారు. ప్రస్తుతం దక్ష చిత్రంపైనే తన ఫోకస్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఇక మోహన్ బాబు నేచురల్ స్టార్ నాని రాబోయే చిత్రం ప్యారడైజ్ లో కీలకపాత్రలో నటిస్తున్నారని రీసెంట్ గా లీక్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X