For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ దెబ్బకు మెడ ఎముక విరిగింది, ఆ ఇద్దరి మధ్య నలిగిపోయా: అదితికి అంతరిక్షం కష్టాలు!

  |

  మణిరత్నం చెలియా సినిమాతో ఆకట్టుకొన్న అదితిరావు హైదరీ తాజాగా సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. నవాబు సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. ప్రస్తుతం అంతరిక్షం సినిమాలో స్పేస్ సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కీలక పాత్రలను పోషించారు. ఘాజీ సినిమా డైరెక్టర్ సంకల్స్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో అదితిరావు హైదరీ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. అదితి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  నేను ఆ పాత్రలో నటించాలా?

  నేను ఆ పాత్రలో నటించాలా?

  డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి స్క్రిప్ట్ గురించి బేసిక్ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఆయన తీసిన ఘాజీ చూశాను. అది అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఓ పాత్ర నేను చేయాల్సిన అవసరం ఏముంది. నన్ను చిన్న పాత్ర కోసం తీసుకొంటే నన్ను ముంబై నుంచి తీసుకురావడానికి మళ్లీ పంపించడానికి చాలా ఖర్చు అవుతుంది. నేను ప్రొడక్షన్‌కు భారం కాకూడదని అనుకొన్నాను. అలా అని నా పాత్రను పెంచడానికి కథను ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని సూచించాను.

  కథను మార్చకుండా పక్కాగా

  కథను మార్చకుండా పక్కాగా

  నేను సమ్మోహనం సినిమా చేస్తుండగా సంకల్ప్‌రెడ్డి మళ్లీ కాల్ చేశాడు. స్క్రిప్టు పూర్తి చేశాను. నీ పాత్ర గురించి ఓ సారి వినండని చెప్పాడు. దాంతో నేను పూర్తి స్క్రిప్టు నేరేషన్ విన్నాను. ఆ తర్వాత నా పాత్రను డిజైన్ చేసిన తీరు ఇంకా నచ్చింది. సంకల్ప్ రెడ్డి ఓపెన్ మైండ్ డైరెక్టర్. అందుకే కథను మార్చకుండా పక్కాగా స్క్రిప్టును రూపొందించారు.

  23 ఏళ్ల తర్వాత అదే.. అల్లు అర్జున్‌ కామెంట్స్.. షారుక్ ఖాన్ దిమ్మతిరిగే రియాక్షన్!

  ఆ ఇద్దరు కూడా మహిళలే

  ఆ ఇద్దరు కూడా మహిళలే

  అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు మహిళా సైంటిస్టులు ( కల్పనా చావ్లా, పాండ్యా) మనదేశానికి చెందిన వారే. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని పాత్రను రాసినందున రియా పాత్రను చేయకుండా ఉండలేకపోయాను. ఆ రోజే మహిళా శాస్త్రవేత్త పాత్రను అద్బుతంగా పోషించాలని నిర్ణయించుకొన్నాను. సినిమాలో బలమైన, మానసికంగా ధృ‌డమైన యువతిగా కనిపించడానికి ప్రయత్నించాను.

  బల్లేరియా బృందం శిక్షణ

  బల్లేరియా బృందం శిక్షణ

  ఈ సినిమాలోని పాత్రల కోసం చాలా శిక్షణ పొందాం. రోప్ టెక్నాలజీ, స్పేస్‌కు సంబంధించిన పరికరాల సహాయంతో ప్రాక్టిస్ చేశాం. బల్గేరియా నుంచి చాలా మంది స్పేస్ సైంటిస్టులు వచ్చారు. వారి సహకారంతో మేము అంతరిక్ష యాత్రకు సంబంధించిన శిక్షణ పొందాం. గాలిలో ఈత కొట్టినట్టు నటించాం. చాలా రకాలుగా కష్టపడ్డాం. షూటింగ్ చాలా దుర్భరంగా ఉండేది.

   ఏ మాత్రం విసుగు అనిపించలేదు

  ఏ మాత్రం విసుగు అనిపించలేదు

  అంతరిక్షం షూట్ సమయంలో నేను మణిరత్నం సినిమాతో బిజీగా ఉన్నాను. ఉదయం అంతరిక్షం షూటింగ్, రాత్రి నవాబ్ షూటింగ్ చేశాను. ఉదయం హైదరాబాద్‌లో, రాత్రి చెన్నైలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడూ విసుగు అనిపించలేదు. రెండు పాత్రలు ఛాలెంజింగ్‌గా అనిపించాయి.

  రాకేశ్ శర్మ చెప్పిన విషయాలతో

  రాకేశ్ శర్మ చెప్పిన విషయాలతో

  సినిమా షూటింగ్‌కు ముందు స్పేస్ సైంటిస్టులను కలువలేదు. కలిసే అవకాశం రాలేదు. కానీ నేను స్కూల్‌లో ఉన్నప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రాకేశ్ శర్మను కలిసే అవకాశం వచ్చింది. మా స్కూల్‌కు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. అంతరిక్షం ఎలా ఉంటుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాలు చెప్పినప్పుడు పాఠశాల విద్యార్థిగా నా మనసులో నిలిచిపోయాయి. ఈ సినిమా చేస్తుండగా ఆ విషయాలను గుర్తు తెచ్చుకొన్నాను. ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా.. ఎన్ని పుస్తకాలు చదివినా కెమెరా ముందుకు వస్తే అవన్నీ గుర్తుకు రావు. ఉపయోగపడవు.

   జీరో గ్రావిటీతో మెడలో ఎముక విరిగింది

  జీరో గ్రావిటీతో మెడలో ఎముక విరిగింది

  జీరో గ్రావిటి పరిస్థితుల్లో నటించడం చాలా కష్టమైనది. తాళ్లు కట్టుకొని నటించడం అత్యంత కష్టమైనది. కొన్నిసార్లు కాళ్లలో రక్త ప్రసరణ ఆగిపోయేది. ఆ సమయంలో షకీరా అంటూ అరవగానే తాళ్లు (రోప్స్) విప్పేది. ఓ సారి తీవ్రంగా గాయపడ్డాను. భారీగా బరువు ఉన్న హెల్మెట్ ధరించాను. దాదాపు ఎనిమిది రోజులు ఆ బాధను భరించాను. ఆ తర్వాత రోజు నా మెడలో ఎముక ఫట్ మని విరిగిన శబ్దం వచ్చింది. ఆస్పత్రికి వెళితే ఎనిమిది రోజులు బెడ్ రెస్ట్ కావాలని అన్నారు.

  రెండు రోజులే విశ్రాంతితో

  రెండు రోజులే విశ్రాంతితో

  వైద్యులు తప్పనిసరిగా వారం రోజులు విశ్రాంతి అవసరమని చెబితే నేను రెండు రోజుల్లో షూట్‌కు వచ్చాను. రోజుకు నాలుగు పెయిన్ కిల్లర్స్ వేసుకొంటూ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఎందుకంటే షూటింగ్ చాలా ఖర్చుతో కూడుకొన్నది. నా కోసం ఏది వేస్ట్ కావొద్దని భావించాను. అందుకే నొప్పిని పక్కన పెట్టి నేను షూటింగ్‌లో పాల్గొన్నాను.

  English summary
  Antariksham 9000 KMPH is a science fiction space thriller film written and directed by Sankalp Reddy. The film stars Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi. The first look of the film was released on India's Independence Day, 15 August 2018. The teaser was released on 17 October 2018. The trailer was released on 9 December 2018. The film is set to release on December 21, 2018. In this occassion, Heroine Aditi Rao Hydari speaks to Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X