రమ్యకృష్ణ, టబు.. వాళ్ల పేరెత్తగానే భగ్గుమన్న నాగార్జున

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్, అక్కినేని నాగార్జున ఇప్పటికీ తన ఫ్యాన్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో అలరిస్తున్నారు. ఆరు పదుల వయస్సు దాటినా యంగ్ అండ్ అట్రాక్టివ్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకున్నారు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత ఛాలెజింగ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. సక్సెస్ అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల అక్కినేని నాగార్జున తరుచుగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకు కూడా తాజాగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

సీనియర్ హీరో, స్టార్ నటుడు జగపతి బాబు టాక్ షోకు హాజరైన సందర్భంగా అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత విషయాలపై స్పందించారు. ఇదే సమయంలో జగపతి బాబు తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తో తనకు ఇష్టమైన హీరోయిన్ల గురించి అడిగారు. మీరు చాలా మంది హీరోయిన్లతో కలిసి పనిచేశారు. అయితే మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటూ నాగార్జునను ప్రశ్నించారు. ఆ ప్రశ్న అడగగానే నాగార్జున ఎనర్జీ లెవల్స్ అన్నీ పడిపోయి డల్ అయ్యారు.

Akkineni Nagarjuna denied to answer the question who is his favourite Actress Ramya Krishnan and Tabu

'అలాంటి ప్రశ్నకు నేను స్పందించకూడదు. కొన్ని చెప్పకూడదు. నేను చెప్పను' అని స్పష్టం చేశారు. ఇక ఆ వెంటనే జగపతి బాబును తిరిగి ప్రశ్నించారు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు రమ్యకృష్ణనా? సౌందర్యనా? అని నాగార్జున అడిగారు. దాంతో జగపతి బాబు కూడా సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే కొన్నాళ్లుగా అక్కినేని నాగార్జున - టబుకు మధ్య రిలేషన్ ఉందంటూ కొందరు లేనిపోని రూమర్లను పుట్టించారు. వాటిలో ఎంత నిజముందో తెలియదు కానీ పలు సందర్భాల్లో వైరల్ అవుతూనే వస్తున్నాయి.

ఇక మరోవైపు జగపతి బాబు - సౌందర్య మధ్య కూడా లవ్ స్టోరీ నడిచిందంటూ పలువురు రూమర్లు పుట్టించారు. ఈ రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వస్తున్నాయి. ఇక ఆగస్టు 17న జీ తెలుగు ఛానెల్ లో సాయంత్రం 9 గంటలకు ప్రసారం కాబోతున్న జయమ్ము నిశ్చయమ్ము రా టాక్ షో ప్రోమోలో జగపతి బాబు, అక్కినేని నాగార్జున ఇలా పరస్పరం తమతో కలిసి నటించిన హీరోయిన్ల గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఫుల్ ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

మొన్నటి వరకు నాగార్జున కూలి ప్రమోషన్స్ లో బిజీ బిజీ ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ధనుష్ కుబేరా చిత్రం ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు జగపతి బాబు టాక్ షోకు గెస్ట్ గా రావడం విశేషం. నాగార్జున తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్ లోని కూలి చిత్రంలో విలన్ గా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. మరోవైపు జగపతి బాబు హీరో నుంచి విలన్ గా మారారు. మరోవైపు సాలిడ్ పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X