»   » సూర్యకు బిగ్ ఫ్యాన్‌ను.. బన్నీ సలహాలు తీసుకొంటా.. అల్లు శిరీష్

సూర్యకు బిగ్ ఫ్యాన్‌ను.. బన్నీ సలహాలు తీసుకొంటా.. అల్లు శిరీష్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. తొలి చిత్రం గౌరవంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతోపాటు, పరభాష చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. మే 30 ఆయన జన్మదినం. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడారు. అల్లు శిరీష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  Allu Arjun's Son Allu Ayaan Horse Riding Pic Goes Viral
  ఈ ఏడాది రెండు చిత్రాల్లో

  ఈ ఏడాది రెండు చిత్రాల్లో

  ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. మలయాళంలో రూపొందిన ఏబీసీడీ (అమెరికా బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ). అందులో దుల్కర్ సల్మాన్ నటించారు. తెలుగులో మధుర శ్రీధర్ రూపొందిస్తున్నారు. అలాగేతమిళంలో సూర్యతో రూపొందించే చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాను. ఈ సినిమా సూర్యకు 37వ చిత్రం. తొలిసారి 100 కోట్ల ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. నేను సూర్యకు పెద్ద ఫ్యాన్‌ను. ఆయనతో నటించడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా జూలైలో లండన్‌లో ప్రారంభమవుతున్నది.

  తొలిసారి రీమేక్ చిత్రంలో

  తొలిసారి రీమేక్ చిత్రంలో

  తొలిసారి ఏబీసీడీ అనే ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాను. కొత్తగా కథలు రావడం లేదనే వాదనను ఒప్పుకోను. రెడీగా కథ ఉండటం వల్ల రీమేక్ చేయాల్సి వచ్చింది. తెలుగు కథలను ఇతర భాషల్లో రూపొందిస్తున్నారు. ఏబీసీడీ చిత్రం నన్ను ఆకట్టుకొన్నది. రెండేళ్లుగా అదే కథ తిరుగుతున్నది. అందుకే ఏబీసీడీ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాను.

  సూర్యతో మంచి అవకాశం

  సూర్యతో మంచి అవకాశం

  తెలుగులో కంటే ఇతర భాషల్లో నటిస్తున్నారనడం సరికాదు. అలా అవకాశాలు వచ్చాయి. మలయాళ, తమిళ భాషల్లో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సూర్యతో మంచి అవకాశం రావడంతో తమిళంలో చేశాను. నా తొలి చిత్రం గౌరవం కూడాతమిళంలో రూపొందడం యాదృచ్చికం మాత్రమే.

   బన్నీ, నాన్న సలహాలు తీసుకొంటా

  బన్నీ, నాన్న సలహాలు తీసుకొంటా

  నా కథల ఎంపికలో నాన్న అరవింద్, అన్నయ్య బన్నీ పాత్ర ఉంటుంది. నాన్నకు కథ ముందే చెబుతాను. బన్నీకి షూటింగ్‌కు వెళ్లే ముందు సినిమా గురించి క్లియర్‌గా చెబుతాను. ఆయన సలహాలు, సూచనలు తీసుకొంటాను.

  టాలీవుడ్‌లో వైవిధ్యమైన

  టాలీవుడ్‌లో వైవిధ్యమైన

  టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అద్భుతమైన కథాచిత్రాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, బాహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను లాంటి చిత్రాలు వచ్చాయి. టాలీవుడ్‌లో వచ్చిన సక్సెస్‌లు మరింత బాధ్యతను పెంచాయి.

  100 కోట్లు చాలా సాధారణంగా

  100 కోట్లు చాలా సాధారణంగా

  గత రెండేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమలో వస్తున్న చిత్రాలు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్‌కు మంచి రేంజ్ ఉందనే అభిప్రాయం కలిగింది. 100 కోట్లు కొల్లగొట్టడమనేది చాలా సాధారణంగా మారింది. వంద కోట్లంటే లెక్కలేకుండా పోయింది. టాలీవుడ్‌లో సినిమా తీస్తే మంచి రేంజ్‌లో లాభాలను సాధించవచ్చు అనే క్రేజ్ పెరిగింది.

  English summary
  Allu Shirish is doing good roles in south film industry. He is doing two movies this year. One movie is remake of Malayalam movie ABCD. one more with Suriya37 project. Allu shirish celebrating his birthday on May 30th. In this occassion, he speaks to Telugu filmibeat exclusively.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more