For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లాం లేచి పోయిన పాత్ర అంటే హీరోలు పరార్.. అందుకే చిట్టిలంక సుందర్‌గా నేను.. ఆనంద్ దేవరకొండ

  |

  దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా పుష్పక విమానం మొదటి నుంచీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ ,విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్లలో విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆనంద్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ..

  కథ విన్న హీరోలందరూ వెనుకంజ..

  కథ విన్న హీరోలందరూ వెనుకంజ..


  మా అన్నయ్య విజయ్ దేవరకొండకు దర్శకుడు దామోదర మంచి స్నేహితుడు. ఆయన చెప్పిన పుష్పక విమానం కథ బాగా మా అందరికీ నచ్చింది. వేరే హీరోలను ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నించాం. కానీ కుదరలేదు. పెళ్లాం లేచిపోయిన వ్యక్తి పాత్ర కావడంతో చాలా మంది హీరోలు వెనుకాడారు. మొదట్లో నాకు కూడా ఈ క్యారెక్టర్ చేయగలనా లేదా అనే డౌట్ వచ్చింది. టెస్ట్ షూట్ చేసిన తర్వాత నమ్మకం కుదిరడంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను అని ఆనంద్ దేవరకొండ చెప్పారు.

  పెళ్లి మీద గంపెడు ఆశలతో

  పెళ్లి మీద గంపెడు ఆశలతో

  పెళ్లి మీద గంపెడు ఆశలు పెట్టుకొన్ని చిట్టిలంక సుందర్ అనే టీచర్ పాత్రలో కనిపిస్తాను. అయితే ఎంతో ఆశపడి పెళ్లి చేసుకొన్నాక అతడి ఆశలన్నీ తలకిందులు అవుతాయి. పెళ్లైన కొద్ది రోజులకే భార్య లేచిపోతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో హీరోకు కోపం, ఫ్రస్టేషన్ వస్తుంటాయి. విపత్కర పరిస్థితుల్లో హీరో మీద జాలి కలుగుతుంది అని తన పాత్ర గురించి ఆనంద్ వివరించారు.

  వినోదం, ఎమోషన్స్ రెండూ

  వినోదం, ఎమోషన్స్ రెండూ

  పుష్పక విమానం ట్రైలర్‌లో వినోదం మాత్రమే చూశారు. కానీ సినిమాలో వినోదంతోపాటు ఎమోషన్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ చాలా పద్దతిగా, సైలెంట్‌గా ఉంటే హీరోయిన్ శాన్వి క్యారెక్టర్ చాలా చలాకీగా, హుషారుగా ఉంటుంది. సునీల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయనది ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ, తన గురించి మాత్రమే ఆలోచించుకునే స్వభావం. ఈ క్యారెక్టర్ లో సునీల్ అన్న సూపర్బ్‌గా నటించడమే కాకుండా చక్కగా నవ్విస్తారు, భయపెడతారు అని ఆనంద్ దేవరకొండ తెలిపారు.

  పెళ్లి విషయంలో మంచి మెసేజ్

  పెళ్లి విషయంలో మంచి మెసేజ్

  మన సమాజంలో పెళ్లి అనేది ఒక సంప్రదాయం. పెళ్లి వల్ల జీవితంలో ఓ ధృడమైన బంధం, ఓ అవగాహన, రిలేషన్స్ ఎర్పడుతాయి. పెళ్లి అనే విషయానికి నేను పూర్తి అనుకూలం. పుష్పక విమానం సినిమాలో పెళ్లి గురించి హృదయానికి హత్తుకొనే విధంగా ఓ మంచి విషయాన్ని చెప్పబోతున్నాం.

  Recommended Video

  Devarakonda Brothers About Pushpaka Vimanam Movie | Part 2
  అల్లు అర్జున్‌కు థ్యాంక్స్..

  అల్లు అర్జున్‌కు థ్యాంక్స్..

  పుష్పక విమానం చిత్రాన్ని దర్శకుడు దామోదర చాలా క్లారిటీగా, వినోదాత్మకంగా తెరకెక్కించాడు. నేను సినిమా పూర్తయ్యాక కొన్ని పనుల్లో జోక్యం చేసుకొన్నాను. కానీ సినిమా మేకింగ్ టైమ్‌లో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. అన్నయ్య విజయ్‌కు పుష్పక విమానం సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని ముందుకొచ్చాడు. తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నా, పుష్పక విమానం ప్రమోషన్ కు వీలైనంత టైమ్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు అల్లు అర్జున్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అందుకు థ్యాక్స్ చెబుతున్నాను అంటూ ఆనంద్ దేవరకొండ అన్నారు.

  English summary
  After Dorasani, Middle Class melodies, Anand Deverakonda coming with Pushpaka Vimanama movie. This movie coming on November 12th. In this occassion, Anand Deverakonda speaks about his role Chittilanka Sunder and Pushpaka Vimanam movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X