twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానాతో సినిమా చేస్తా.. ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్ నిర్మాతే.. నిర్మాత బెక్కం వేణుగోపాల్

    By Rajababu
    |

    తెలుగు సినీ పరిశ్రమలో చక్కటి అభిరుచి ఉన్న నిర్మాతల్లో బెక్కం వేణుగోపాల్ ఒకరు. ఇండస్ట్రీలో అసిస్టెంట్ కెమెరామెన్‌గా, ప్రోడక్షన్ మేనేజర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన సక్సెస్‌‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. బెక్కం వేణుగోపాల్ జన్మదిన ఏప్రిల్ 27. ఈ సందర్బంగా ఆయన ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. తాను రూపొందిస్తున్న హుషారు చిత్రం గురించి, తన తదుపరి ప్రాజెక్టుల గురించి వివరంగా మాట్లాడారు. బెక్కం వేణుగోపాల్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

    నా పుట్టిన రోజును పురస్కరించుకొని, నా కొత్త సినిమా గురించి చెప్పడానికి మీడియాతో మాట్లాడాలని అనుకొన్నాను. ప్రస్తుతం హుషారు అనే సినిమా ముగింపు దశలో ఉంది. పేరున్న యాక్టర్లతో తీసే అవకాశం ఉన్నప్పటికీ.. కొత్త దర్శకుడి సూచన మేరకు అంతా కొత్తవారితోనే హుషారు సినిమాను రూపొందించాం. ఆ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా మారుతుంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది.

    నూతన నటీనటులు, దర్శకులతో

    నూతన నటీనటులు, దర్శకులతో

    హర్ష పొనుగంటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. హుషారు సినిమా సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అనే పెట్టాం. కథలో ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్, వ్యాల్యూస్ ఉంటాయి. పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నాం. జూన్ మూడో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.

    హుషారు చిత్రం గురించి

    హుషారు చిత్రం గురించి

    హుషారు చిత్రానికి అర్జున్‌రెడ్డి, అందాల రాక్షసి సినిమాకు సంగీతం అందించిన రాధన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి మాదిరిగానే హుషారు సంగీతం ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది. సినిమాటోగ్రఫర్‌గా అర్జున్ రెడ్డి ఫేం తోట రాజు, ఎడిటర్‌గా విజయ్‌ అనే వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ఓ ప్రత్యేకమైన పాత్రలో అర్జున్‌రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

    దిల్ రాజుతో కలిసి సినిమా

    దిల్ రాజుతో కలిసి సినిమా

    హుషారు చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నేను లోకల్ తర్వాత దిల్ రాజుతో కలిసి చేస్తున్న చిత్రమది. కొత్త హీరో, దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. గత నాలుగు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే సంవత్సరం త్రినాథ్, వీఐ ఆనంద్‌తో సినిమాలు రూపొందించే ప్లాన్‌లో ఉన్నాం. ప్రస్తుతం చర్చల దశలో సినిమాలు ఉన్నాయి.

     12 ఏళ్లలో 10 చిత్రాలు

    12 ఏళ్లలో 10 చిత్రాలు

    గత 12 ఏళ్ల కెరీర్‌లో 10 సినిమాలు చేశాను. 2006లో టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాతో నిర్మాతగా మారాను. అసిస్టెంట్ కెమెరామెన్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారాను. ప్రస్తుతం నా కెరీర్ మూడు పూలు, ఆరు కాయలుగా ఉంది. హెబ్బా పటేల్‌తో రూపొందించిన నేనే నా బాయ్‌ఫ్రెండ్ అనే చిత్రం యావరేజ్ ఆడింది. సరిగా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.

     టాలెంట్‌తోనే సక్సెస్

    టాలెంట్‌తోనే సక్సెస్

    సినీ పరిశ్రమలో కులం, మతానికి సంబంధం లేదు. టాలెంట్ ఉంటే సక్సెస్ సాధించవచ్చు. సురేష్ బాబు, దిల్ రాజు లాంటి బడా నిర్మాతలతో పనిచేస్తున్నాను. ఏ రంగంలోనైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. సినీ రంగంలో చిన్న, మధ్య తరగతి వాళ్లకే కాదు.. బడా నిర్మాతలకు సమస్యలు వస్తాయి. వాటిని సానుకూలంగా పరిష్కరించుకొని వెళ్లాలి. నేను చచ్చేంత వరకు నిర్మాతగా ఉండాలని అనుకొంటున్నాను. అలానే ఉంటాను కూడా. వ్యవసాయం చేసేవాళ్లు ఓ సంవత్సరం పంట పండకపోతే భూమిని వదిలేయ్యరుగా.. అలానే ఓ సినిమా ఆడకపోతే నా విషయంలో వ్యవసాయం మాదిరిగా సినీ నిర్మాణం ఆగిపోదు.

     ఫెయిల్యూర్‌కు నాదే బాధ్యత

    ఫెయిల్యూర్‌కు నాదే బాధ్యత

    నేను చేసే ప్రాజెక్ట్ విజయం సాధించినా, ఫెయిల్ అయినా నాదే బాధ్యత. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. ఆ విషయంలో ఎలాంటి మార్పులేదు. నిర్మాణంలో ప్రతీ విషయాన్ని పట్టించుకొంటాను. క్యూబ్ చార్జీలు తగ్గించడం నిర్మాతకు మేలు కలిగించే అంశం. నిర్మాతలకు, ఎగ్జిబ్యూటర్లకు ఖర్చు తగ్గి కొంత ఊరట లభిస్తుంది.

     రానాతో సినిమా చేస్తా

    రానాతో సినిమా చేస్తా

    ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందించే ఆలోచన చేస్తున్నాను. స్టోరి లైన్‌ను సురేష్‌బాబుకు చెప్పాను. వీలైతే రానాతో సినిమా చేయాలని అనుకొంటాను. ఒకవేళ అది సాధ్యపడితే అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది.

    బెస్ట్ యాక్టర్ నిర్మాతే

    బెస్ట్ యాక్టర్ నిర్మాతే

    యాక్టింగ్‌పై నాకు ఆసక్తి లేదు. నిర్మాత కంటే పెద్ద నటుడు ఎవరూ ఉండరు. ఎందుకంటే చాలా విభాగాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఒక్కొక్కరితో ఒక్కో రకంగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ నటన ముందు తెర మీద యాక్టింగ్ చాలా ఈజీ. సినీ నిర్మాణంలో ఒకరిని కన్విన్స్ చేయడం అంటే చాలా కష్టం. సినీ పరిశ్రమలో బెస్ట్ యాక్టర్ నిర్మాతే అని వేణు బెక్కం వెల్లడించారు.

    English summary
    Bekkam Venugopal is a producer in Telugu cinema. He ventured into film production under his production company, Lucky Media. He started his career with film Tata Birla Madhyalo Laila in 2006 as a producer and made other films like Satyabhama, Maa Ayana Chanti Pilladu, Brahmalokam To Yamalokam via Bhulokam, Mem Vayasuku Vacham and Prema Ishq Kaadhal. And his recent movie Cinema Choopistha Mava was a super-hit which is both commercial and critical hit. On his birth day, He speaks to filmibeat about his new project Husharu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X