'ఆ హీరోలు అందులో మునిగి చస్తారు..ప్రభాస్, పవన్ కళ్యాణ్ మాత్రం..'

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకుంటుంది. టాలీవుడ్ లోని దర్శకులు, స్టార్ హీరోలు తమ హార్డ్ వర్క్ కు సరైన గుర్తింపును పొందుతున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచే కాకుండా ఇతర భాషల్లో, బాలీవుడ్ లో, హాలీవుడ్ లోని ప్రముఖులు మన నటీనటులను ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.

బాలీవుడ్ ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ కుమార్ సాను రీసెంట్ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నార్త్ ఫిలిం ఇండస్ట్రీలోని తేడాలను చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 'నేను ఒకసారి ఫ్లైట్లో ప్రభాస్ గారిని కలిసాను. ఆయన ఎంతో వినయంగా మాట్లాడడం ఆనందంగా అనిపించింది. పైగా తనే నాకు పెద్ద అభిమాని అని చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది. ఇక నేనే నీకు ఫ్యాన్ అని ప్రభాస్ తో చెప్పాను. ఆయన మాటలతో వారు ఎంత డౌన్ టు ఎర్త్ అనే విషయం అర్థం అవుతుంది. ప్రభాస్ అంత వినయంగా మాట్లాడటం ఆనందాన్ని ఇచ్చింది.

Bollywood Singer Kumar Sanu Praised Pawan kalyan and Prabhas

అలాగే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారు. ఎంతో ఆకర్షణీయమై వ్యక్తి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన సింప్లిసిటీ అంటే ఇంకా ఇష్టం. ముఖ్యంగా సౌత్ లో రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవడంలో ముందుంటుంది. ఇక్కడ ఇగోలు ఉంటే అస్సలు నడవదు. ఎలాంటి ఈర్ష్యలకు వెళ్లరు. వీళ్లంతా ఎక్కువగా పనిపైనే శ్రద్ధ వహిస్తారు. మిగిలిన విషయాల్లో ఆసక్తి చూపించరు. స్టార్స్ కు ఇగోలు అసలు ఉండవు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈగోల్లో మునిగి చచ్చిపోతారు. బాలీవుడ్ లో అక్కడక్కడ ఇది కనిపిస్తూ ఉంటుంది.'

కుమార్ సాను సౌత్ హీరోలకు, చిత్ర పరిశ్రమను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. తెలుగు హీరోలు పనిలో ముందుంటారని చెప్పడం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఇక ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రం తర్వాత బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

బాలీవుడ్ లో 1989 నుంచి కుమార్ సాను యాక్టివ్ గా ఉంటున్నారు. హిందీ ఆల్బమ్ సాంగ్స్, ఫిల్మ్స్ సాంగ్స్ కు తన గాత్రం అందించి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో ఆయన సాంగ్స్ పాడటం విశేషం. హిందీలో ఎక్కువ పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో ఆయకు 35 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం. ఇక తెలుగులోనూ ఒక్కసారి చెప్పలేవా, దేవుడు వరమందిస్తే, పిల్లో పిసినారి పిల్లో, మెరిసేటి జాబిలి నువ్వే, నీ నవ్వులే వెన్నలని, ఇదేమిటమ్మ మామ.. వంటి సాంగ్స్ కు తన గాత్రం అందించారు.

More from Filmibeat

Read more about: prabhas pawan kalyan kumar sanu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X