For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‌ ఆ డిజాస్టర్‌తో నేను, రాంచరణ్ భారీగా నష్టపోయాం.. వారిని కాపాడటమే మా ధర్మం.. చిరంజీవి (ఇంటర్వ్యూ)

  |

  మలయాళంలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రం గాడ్‌ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లొ రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని అనుభూతులను పంచుకొన్నారు. ఈ సినిమా గురించి పలు అంశాలను వెల్లడిస్తూ..

  సమిష్టి విజయం ఇది

  సమిష్టి విజయం ఇది

  గాడ్‌ఫాదర్ విజయం సమిష్టి క‌ృషి, ఏప్రిల్ లో వచ్చిన నా చిత్రం నా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. ప్రతీ సినిమా విజయం సాధించాలనే శ్రమిస్తాం. ప్రతీ పాత్ర, సినిమాకు న్యాయం, ధర్మం చేయాలని ప్రయత్నిస్తాం. జయపజయాలు మన చేతిలో ఉండదు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నేను, చరణ్ పెద్ద మొత్తం వదులుకొన్నాం. బయ్యర్లను కాపాడాలనే రాంచరణ్ నేను నర్ణయం తీసుకొన్నాం. ఫ్లాఫ్ వస్తే కుంగిపోయేది లేదు నా జీవితంలో చాలా విజయాలు, అపజయాలు చేశాను అని చిరంజీవి అన్నారు.

  సుకుమార్ చేత కథలో మార్పులు

  సుకుమార్ చేత కథలో మార్పులు


  గాడ్ ఫాదర్ విజయం కేవలం నాదీ అని అనుకోను. ఈ సక్సెస్ సమిష్టి కృషి. లూసిఫర్ మూవీని చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసిఆమోదం పొందితే మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేసే ఛాన్స్ దొరకుతుందని అనుకొన్నాను. అదే సమయంలో చరణ్ బాబు లూసిఫర్ సినిమా చేస్తే బాగుంటుందని ప్రస్తావన తెచ్చారు. దర్శకుడు సుకుమార్ చిన్న మార్పులు చేస్తే లూసిఫర్ సెట్ అవుతుందని చెప్పారు. సుకుమార్ కొన్ని ఐడియాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత అందుబాటులో ఉండలేదు. ఆ తర్వాత కొందరు దర్శకులతో చర్చలు జరిపాం. కానీ నేను సంత‌‌ృప్తి చెందలేదు అని చిరంజీవి చెప్పారు.

  రాంచరణ్ కోరిక మేరకు

  రాంచరణ్ కోరిక మేరకు


  లూసిఫర్ సినిమా రీమేక్ గురించి చర్చలు జరుగుతుండగానే ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు సూచించారు. తమిళంలో తని వరువన్ సినిమాను అద్భుతంగా తీసిన ఆయన పేరు వినగానే.. కొంత పాజిటివ్ అనిపించిం‌ది ఆ సినిమాకు తగిన న్యాయం చేస్తారని అనిపించింది. మోహన్ రాజా కూడా తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పడంతో ఒక ప్రయత్నం మొదలైంది. సత్యానంద్, ఇతర టీమ్ కలిసి మార్పులు చేర్పులు చేయడమే కాకుండా గాడ్‌ఫాదర్ చిత్రాన్ని అద్బుతంగా ప్రేక్షకుల ముందుకు పెట్టాం అని చిరంజీవి వెల్లడించారు.

  నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు

  నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు


  గాడ్‌ఫాదర్ సినిమా కథ చాలా పవర్‌ఫుల్. నా సినిమా అంటే సాంగ్స్, డ్యాన్స్‌లు ఆశిస్తారు. కానీ అలాంటివి లేకున్నా నా ఫ్యాన్స్ నుంచి ఎక్కడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. అందుకు కారణం తమన్ అందించిన మ్యూజిక్. యాక్షన్ ఎపిసోడ్‌కి మంచి రెస్పాన్స్ రావడానికి కారణం తమన్ మ్యూజిక్. గాడ్‌ఫాదర్ సినిమా టైటిల్ పెట్టమని చెప్పింది కూడా తమనే అని చిరంజీవి అన్నారు.

   భావోద్వేగాలను పండించాం

  భావోద్వేగాలను పండించాం


  గాడ్‌ఫాదర్ సినిమా పొలిటికల్ డ్రామా. ఈ కథ వెనుక బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. బ్రదర్, సిస్టర్ మధ్య ఎమోషన్స్ బలంగా ఉన్నాయి. మలయాళంలో సొంత కొడుకా కాదా అనే అనుమానం ఉంటుంది. గాడ్‌ఫాదర్ సినిమాలో సొంత కొడుకు అని క్లియర్ గా చెప్పాం. అన్నయ్యను చెల్లెలు ఎందుకు ద్వేషిస్తుందో తెలియదు. ఇలాంటి అంశాల్లో ఎలాంటి సందేహాలు లేకుండా స్పష్టమైన స్క్రిప్టును రూపొందించాం. రీమేక్ చేయడం ఒక ఛాలెంజ్. ఒరిజినల్ సినిమాను మరిచిపోయేలా గాడ్‌ఫాదర్ సినిమాను తీశాం అని చిరంజీవి అన్నారు.

  English summary
  Megastar Chiranjeevi's Godfather movie is released on October 5th Worldwide. This movie is getting good report from box office. In this occassion, Chiranjeevi Speaks to Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X