twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghani movie నిర్మాతగా వరుణ్ తేజ్.. గని తర్వాత మరో సినిమా చేస్తున్నాం.. కిరణ్ కొర్రపాటి (ఇంటర్వ్యూ)

    |

    గని ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో భారీగా జరిగింది. మా యూనిట్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నది. అయితే ఈ సినిమా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రిలీజ్‌కు సిద్దమైంది. దాదాపు 7 సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే సరైన సమయంలోనే వస్తుందనే నమ్మకంతో యూనిట్ అంతా సంతోషంగా ఉంది. వాయిదా పడిన ప్రతీసారి కంటెంట్‌ను ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఏర్పడింది అని దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పారు. కిరణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    తెర మీద గొప్ప అనుభూతితో

    తెర మీద గొప్ప అనుభూతితో

    జీవితంలో గెలువాలనుకొనే వారికి గని సినిమా ఓ స్పూర్తిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించాం. ఓ క్రీడాకారుడు తన జీవితంలో ఎదురైన సమస్యలను ఎదురించి విజయాన్ని చేజిక్కించుకొన్నారనేది మూల కథ. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. చాలా కోణాల్లో ఈ సినిమా రన్ అవుతుంది. తెర మీద చూసిన తర్వాత మీరే అనుభూతిని చెప్పగలరు అని కిరణ్ కొర్రపాటి అన్నారు.

    నేను పనిచేసిన దర్శకులు వీరే..

    నేను పనిచేసిన దర్శకులు వీరే..

    వినాయక్, జయంత్, హరీష్ శంకర్, లారెన్స్ మాస్టర్, శ్రీనువైట్ల, వెంకీ అట్లూరి దర్శకుల వద్ద పనిచేశాను. రవితేజ సినిమాలకు ఎక్కువగా పనిచేశాను. చెన్నైలో చాలా సంవత్సరాలు పనిచేశాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత దర్శకుడిని కావాలని అనుకొన్నాను. జర్నలిస్టుల నుంచి స్పూర్తి పొంది దర్శకుడిని కావాలని అనుకొన్నాను. నేను జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న జర్నలిస్టు అని కిరణ్ కొర్రపాటి తెలిపారు.

    కరోనావైరస్ కారణంగా

    కరోనావైరస్ కారణంగా

    దర్శకుడిగా మారడానికి చాలా సమయమే పట్టింది. కొన్ని ప్రాజెక్టులు ఫైనల్ అవుతున్నాయనే సమయంలో వాయిదా పడ్డాయి. రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత గని సినిమా ప్రారంభించిన తర్వాత మూడేళ్లు కరోనావైరస్ వల్ల లేటైంది. చివరకు గని సినిమాతో దర్శకుడిగా మారాను అని కిరణ్ తెలిపారు.

    బాక్సర్ల జీవితం స్టడీ చేశా

    బాక్సర్ల జీవితం స్టడీ చేశా

    గని సినిమాలో చాలా మంది బాక్సర్ల జీవితాన్ని అధ్యయనం చేశాను. బాక్సర్లు ఎదుర్కొన్న సమస్యలను స్టడీ చేసి ఇన్స్‌పిరేషన్‌గా ఉండేలా తెరకెక్కించాను. కమర్షియల్ అంశఆలు కూడా జొప్పించాను. సాయి మంజ్రేకర్ రోల్ బాగుంటుంది.

    వరుణ్‌తో ఫీల్ గుడ్ లవ్ ట్రాక్ ఉంటుంది. వైజాగ్ బ్యాక్ ‌డ్రాప్‌గా కథ కొనసాగుతుంది. అయితే లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ రిలీజ్ చేద్దామని నిర్మాతలకు చెప్పాను. కానీ వాళ్లే ఒప్పుకోలేదు. ఈ సినిమాను థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టారు. దాంతో గని సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది అని కిరణ్ తెలిపారు.

    ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రల గురించి

    ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రల గురించి

    గని సినిమాలో ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర పాత్రలు బలంగా ఉంటాయి. కథతో మిలితమై ఈ పాత్రలు ఉంటాయి కాబట్టి నేను ట్రైలర్‌లో ఎక్కువగా చూపించలేదు అని కిరణ్ తెలిపారు. చెరుకూరి సుధాకర్ నుంచి అడ్వాన్సు తీసుకొన్నాను. అలాగే వరుణ్ తేజ నిర్మాతగా ఓ సినిమా చేయాలని కమిట్ అయ్యాను. ఆయన మొదట నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆయనకు ఓ సినిమా చేసి పెడుతాను అని కిరణ్ కొర్రపాటి తెలిపారు.

    English summary
    Director Kiran Korrapati's Ghani movie set to release on Feb 8th. In this occassion, Kiran Reveals interesting incidents of Ghani making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X