‘హరిహర వీరమల్లు నుంచి అందుకే పక్కకి వచ్చా.. అసలు ఇష్యూ ఇది’.. డైరెక్టర్ క్రిష్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఘాటితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించింది. ఫీమేల్ సెంట్రిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సినీ రిపోర్టర్లతో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు క్రిష్ ఆసక్తికరమైన అంశాలపై స్పందించారు. ఇదే సమయంలో హరి హర వీరమల్లు చిత్రం గురించి స్పందించారు. ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో తొలిసారిగా బయట పెట్టారు.
క్రిష్ జాగర్లముడి మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఒక జర్నీ. హరి హర వీరమల్లు సినిమాను డైరెక్టర్ గా కొంత భాగం చిత్రీకరించాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం, ప్రేమ. ఇక నిర్మాత ఏఎం రత్నం గారంటే నాకు అమితమైన గౌరవం. చిన్నప్పుడే సూర్య మూవీస్ లో ఆయన పోస్టర్ చూసి ఎప్పటికైనా కలిసి పనిచేయాలని అనుకున్నాను. అలా ఆయన ద్వారా నేను స్ఫూర్తిని పొందాను. కొన్ని షెడ్యూలింగ్ కారణంగా వల్ల కావచ్చు, మేము షూటింగ్ ప్రారంభించిన తర్వాత కోవిడ్ కారణంగానూ, అనేక కారణాల వల్ల నేను సినిమా నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. నాకూ ఉన్న పర్సనల్ ఇష్యూస్ వల్ల పక్కకు వచ్చాను.

దాంతో హరి హర వీరమల్లు జర్నీ అనేది అలా పూర్తైంది. నా పరంగా పూర్తైంది. ఇక ఆ జర్నీనీ ఇంకొక దర్శకులు ఏఎం జ్యోతికృష్ణ గారు కొనసాగించారు. ఇది అయ్యాక ఇక నేను పూర్తిగా ఘాటి చిత్రంలోనే మునిగిపోయాను. ఈ సినిమాకు ఎంత ఫోకస్డ్ గా ఉండాలో అంత ఫోకస్డ్ గా ఉన్నాను. నేను గమ్యం నుంచి ఘాటి దాకా, ప్రతి సినిమాను ప్రతి రోజులో ఫోకస్ట్ గా ఉంటాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి రోజు నేను చాలా ఫోకస్డ్ గా ఉంటాను. ఇక ఇప్పుడైతే కేవలం ఘాటి గురించి ఆలోచిస్తున్నాను. ఈ సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నందుకు చాలా చాలా ఆతృతగా ఉన్నాను. సెప్టెంబర్ 5న మీరు సినిమాను చూసి సంతోషిస్తారు.
చెన్నై నుంచి జూలై 31 నుంచి తిరిగి వచ్చాను. రాగానే ఘాటి చిత్రం ఫస్ట్ కాపీని చూశాను. ఒక పేలడానికి సిద్ధంగా ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మరిన్ని రోజుల్లో అగ్నిపర్వతంలా పేలబోతోంది. ఈ విషయంలో నేను సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను.' అని క్రిష్ జాగర్లముడి తన వెర్షన్ ను తెలియజేశారు.
ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించారు. 2020లో ప్రారంభమైన ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు సినిమా బడ్జెట్ రూ.250 కోట్లకు చేరుకుంది. క్రిష్ జాగర్లముడి తర్వాత ఈ చిత్రాన్ని ఏఎం జ్యోతిరత్నం దర్శకత్వం వహించారు. జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.106 కోట్ల గ్రాస్ ను మాత్రమే వసూల్ చేసింది.


Click it and Unblock the Notifications











