twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lakshya movie ఎమోషనల్ డ్రామా.. ఊహించని పాత్రలో జగపతి బాబు... డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి

    |

    సుబ్రమణ్యపురం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి తన రెండో చిత్రంగా లక్ష్య మూవీతో వస్తున్నారు. నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు సంతోష్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..

    ప్రశ్న: లక్ష్య సినిమా కథ ఏమిటి? విలువిద్య ప్రాముఖ్యత ఏమిటి?
    లక్ష్య సినిమా గురించి చెప్పాలంటే.. పాతాళంలోకి జారుకొన్న ఓ క్రీడాకారుడు అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి ఎలాంటి పరిస్థితులు పురిగొల్పాయి అనే విషయాన్ని లక్ష్య మూవీలో చెప్పబోతున్నాను. ఒక క్రీడాకారుడి జీవితంలో గెలుపు ఓటములు అనేది సహజం. అలాంటి విషయాలను చెబుతూనే కొన్ని ఎమోషనల్ పాయింట్స్‌తో సినిమాను తెరకెక్కించాం. తెర మీద ఆర్చరీ (విలువిద్య) అనేది ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. ప్రతీ ఎమోషన్ ప్రేక్షకుడి హృదయాన్ని తడుతుంది అని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పారు.

    ప్రశ్న: నాగశౌర్యను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటి?
    నాగశౌర్యను ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా చూపించారు. కానీ లక్ష్య సినిమాలో ఒక కొత్త నాగశౌర్యను చూస్తారు. ఎనిమిది పలకలా దేహం (Eight Pack body), డిఫరెంట్ హెయిర్ స్టైల్, అతడి బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. చూడటానికి యువ మునిలా తెర మీద మూర్తీభవించి కనిపిస్తాడు. పార్థు అనే పాత్రలో నాగశౌర్య కనిపిస్తాడు. ఓ గోల్డ్ మెడల్ కోసం పోరాడే ఆటగాడు కాదు. మరో బలమైన పాయింట్ ఉంటుంది అని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి వెల్లడించారు.

    Director Santhossh Jagarlapudi Interview about Lakshya movie and Naga Shourya characterf

    జగపతి బాబు పాత్ర ఎలా ఉండబోతుందంటే?
    లక్ష సబ్జెక్ట్ కోసం చాలా రీసెర్చ్ చేశాం. పలువరు స్పోర్ట్స్ పర్సన్ కలిశాం. ఈ క్రీడా తెరమీద కొత్తగా కనిపిస్తుంది. సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. ఈ సినిమా రివేంజ్ డ్రామా కాదు. లక్ష్య ఓ క్రీడాకారుడి ఎమోషనల్ జర్నీ ఇది. ఎవరూ ఊహించని విధంగా జగపతి బాబు పాత్ర ఉంటుంది. ఒక అంధుడైన జగపతి బాబు.. నాగశౌర్యను టాప్ విలువిద్య క్రీడాకారుడిగా ఎలా మలిచాడు. నాగశౌర్యనే ఎందుకు జగపతి బాబు ఎంచుకొన్నాడనే విషయాలు సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. జగపతి బాబు పాత్ర పేరు పార్థసారథి. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని పాత్రలో జగపతిబాబు కనిపిస్తాడు. సినిమాకు వెన్నముకగా జగపతి బాబు పాత్ర ఉంటుంది అని తెలిపారు.

    Director Santhossh Jagarlapudi Interview about Lakshya movie and Naga Shourya characterf

    సచిన్ ఖేడేకర్ రోల్ గురించి..
    లక్ష్య సినిమాలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. తాతయ్య సెంటిమెంట్‌తో అంతర్లీనంగా కథ సాగుతుంది. సచిన్ ఖేడేకర్ పాత్ర సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చుతుంది. భరత్ రెడ్డి, సురేష్ పాత్రలు సినిమాలో కీలకంగా ఉంటాయి.

    కేతిక శర్మ ఎలా మెప్పించబోతుందంటే?
    హీరోయిన్‌గా కేతిక శర్మ. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్. గ్లామర్ హీరోయిన్ కాకుండా కొత్త రకమైన ఎమోషనల్ పాత్రలో నటించారు. తప్పకుండా అందర్నీ నటనపరంగా ఆకట్టుకొంటుంది అని సంతోష్ జాగర్లపూడి అన్నారు.

    Director Santhossh Jagarlapudi Interview about Lakshya movie and Naga Shourya characterf

    రిచ్ వ్యాల్యూస్‌తో టెక్నికల్ అంశాలు
    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రామిరెడ్డి సినిమాటోగ్రఫి. సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతీ సన్నివేశాన్ని అందంగా చూపించడానికి డీఐ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. కాలభైరవ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. జునైద్ ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది అని సంతోష్ చెప్పారు.

    English summary
    Lakshya is sports drama film written and directed by Dheerendra Santhossh Jagarlapudi. It is produced by Sri Venkateswara Cinemas and Northstar Entertainment. The film stars Naga Shaurya, Jagapathi Babu, Ketika Sharma and Sachin Khedekar. The film set to release on 10 December 2021. In this occassion, Santhosh speaks to Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X