పవన్ కళ్యాణ్ కంటే ముందే.. చిరు, చరణ్ తో సుజీత్ సినిమా.. ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ట్రీట్ ను అందించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాలిడ్ గ్యాంగ్ స్టర్ మూవీని తెరకెక్కించి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన OG చిత్రం అభిమానుల నుంచే కాకుండా నార్మల్ ఆడియెన్స్ నుంచి కూడా విశేష ఆదరణను పొందుతోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుండటం విశేషం.

అయితే, సుజీత్ తన కెరీర్ లో ఇప్పటి వరకు OG Movieతో కలిసి 3 సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ శర్వానంద్ తో రన్ రాజా రన్ చిత్రాన్ని తెరకెక్కించి మొదటి హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కించి నేషన్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అతి చిన్న వయస్సులోనే భారీ బడ్జెట్ తో సాహో చిత్రాన్ని సుజీత్ డీల్ చేసిన విధానాన్ని టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు షాక్ అయ్యారు.

Director Sujeeth have to direct Chiranjeevi and Ram charan

ఇక సాహో చిత్రం తర్వాత సుజీత్ రెండు మూడు సినిమాలు చేయాల్సి ఉండి బ్యాక్ స్టెప్ అయ్యారు. అందులో మొదటిగా మెగాస్టార్ చిరంజీవితో సుజీత్ ఒక సినిమాను తెరకెక్కించాల్సి ఉంది. అయితే చిరంజీవి గారిని కలిసిన సమయంలో లూసీఫర్ రీమేక్ చేద్దామని అడిగారంట. అయితే సాహో టీజర్ రిలీజ్ అయ్యేప్పటికీ ఇంకా లుసీఫర్ అనే చిత్రం షూటింగ్ కూడా మొదలవ్వలేదని సుజీత్ చిరుకు వివరించారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరోవైపు లూసీఫర్ చిత్రంలోని కొన్ని సీన్లను సాహో నుంచి ఇన్ స్ఫైర్ అయినట్టుగా మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారని సుజీత్ అన్నారు. దాంతో బాస్ సినిమా చేయడం కుదరలేదన్నారు. ఇక అంతకు ముందే రామ్ చరణ్ తో సినిమా అనుకున్నామని, భారీ స్కేల్లో ఆ మూవీ ఉండేలా షూటింగ్ కు కూడా ప్రిపేర్ అయ్యామని సుజీత్ అన్నారు. కానీ షూట్ మొత్తం యూకే బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో అప్పుడే కరోనా ఆంక్షలు ఉండటంతో సాహో తర్వాత సినిమాకు గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అలా మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరితో సినిమా చేసే అవకాశం తప్పిందని వివరించారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG సినిమా కంటే ముందు కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోతో ఒక సినిమాను చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంట. కానీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు పరిచయం చేయడంతో ఇక OG మూవీ మొదలైందని చెప్పుకొచ్చారు. ఓజీ మూవీ డే1నే రూ.154 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను కలెక్ట్ చేయడం విశేషంగా మారింది. ఇక మున్ముందు ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: sujeeth chiranjeevi og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X