twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara రాముడు అంటే స్వర్గీయ ఎన్టీఆర్.. బింబిసార అంటే కల్యాణ్ రామ్.. డైరెక్టర్ వశిష్ట్ (Interview)

    |

    ప్రేమలేఖలు రాశా అనే సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన వశిష్ట బింబిసార సినిమాతో దర్శకుడిగా మారారు. కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, క్యాథరీన్ త్రెసా నటించిన ఈ చిత్రాన్ని హీరో కల్యాణ్ రామ్ నటించడమే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. ఆగస్టు 5న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు వశిష్ట మీడియాతో మాట్లాడుతూ..

    టైమ్ ట్రావెల్ కథా నేపథ్యంతో

    టైమ్ ట్రావెల్ కథా నేపథ్యంతో


    2018లో బింబిసార కథ మొదలుపెట్టాను. టైమ్ ట్రావెల్ కథతో సినిమా చేయాలని ప్రారంభించాను. పురాణాల నుంచి ప్రస్తుత కాలం వరకు ఓ వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కథ మొదలు పెట్టాను. ఆ తర్వాత కల్యాణ్ రామ్‌ను కలిసి కథ చెప్పగానే ఆయనకు, హరికి నచ్చింది. దాంతో ఈ సినిమా ప్రీ పొడక్షన్ మొదలైంది. కొత్తవాడినైనా నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. టీమ్ చాలా సపోర్ట్‌గా ఉన్నారు. ప్రతీ ఫేజ్‌లో కల్యాణ్ రామ్ నాకు అండగా నిలిచారు అని దర్శకుడు వశిష్ట తెలిపారు.

    బింబిసార టైటిల్ ఎందుకు పెట్టామంటే?

    బింబిసార టైటిల్ ఎందుకు పెట్టామంటే?


    బింబిసార 500 సంవత్సరాల క్రితం కథ. టైమ్ ట్రావెల్‌తో కూడిన కొత్త కథ. బింబిసార సినిమాకు మరో సినిమా నుంచి రెఫరెన్స్ తీసుకోలేదు. కొత్తగా కథను, సెటప్‌ను క్రియేట్ చేశారు. నేను పరిశోధన చేస్తున్న సమయంలో బింబిసార మహారాజు పేరు చాలా వైబ్రెంట్‌గా అనిపించారు. చరిత్రలో బింబిసారకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు. చరిత్రలో బింబిసార గురించిన సమాచారంపై అనేక అనుమానాలు ఉన్నాయి అని దర్శకుడు వశిష్ట చెప్పారు.

     ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకంటే?

    ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకంటే?


    బింబిసార సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం వెనుక ప్రత్యేకమైన కారణాలు లేవు. మేము ఈ సినిమా అనుకొన్నప్పుడు కీరవాణి గారు RRR మూవీ విషయంలో బిజీగా ఉన్నారు. అయితే ఆయనను అప్రోచ్ కూడా కాలేదు. అయితే ఈ కథకు చిరంతన్ భట్ కరెక్ట్ అనుకొన్నాం. ఎందుకంటే అప్పటికే చారిత్రక నేపథ్యం ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె సినిమాలు చేశారని ఆయన సెలెక్ట్ చేసుకొన్నాం. ఆయనకు కథ చెప్పగానే.. కర్మ సాంగ్‌తో మరోపాటు ఇచ్చారు. ఆ తర్వాత వరికుప్పల యాదగిరితో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ తర్వాత RRR కంప్లీట్ అయిన తర్వాత ఆయన సంప్రదిస్తే.. సినిమా చూసి రీరికార్డింగ్ చేస్తానన్నారు. అలా ఈ సినిమాకు కీరవాణి బీజీఎం వెన్నముకగా నిలిచింది అని దర్శకుడు వశిష్ట అన్నారు.

     బింబిసారగా కల్యాణ్ రామ్ లుక్ గురించి

    బింబిసారగా కల్యాణ్ రామ్ లుక్ గురించి


    అయితే బింబిసారగా ఓ రాజు పాత్ర కల్యాణ్ రామ్‌ చేయాలని అనుకొన్నప్పుడు.. అప్పటికే బాహుబలితో ప్రభాస్, మగధీరతో రాంచరణ్ ఓ ఇమేజ్ క్రియేట్ చేశారు. దాంతో కొంత పరిశోధన చేసి ఆయన కోసం కొత్త లుక్‌ను క్రియేట్ చేశాం. పాత్రను బట్టి కొన్ని మేనరిజం యాడ్ చేశాం. బింబిసారగా ఆయన చూపు భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా కోసం ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడటం వల్ల సినిమా కాస్త లేట్ అయింది అని వశిష్ట పేర్కొన్నారు.

    బింబిసార రెండు భాగాలుగా

    బింబిసార రెండు భాగాలుగా


    బింబిసార కథ రాసేటప్పుడే రెండు భాగాలుగా తీయాలని అనుకొన్నాం. ఈ కథను మూడు గంటల్లో చెబితే ప్రయోజనం ఉండదు. ఈ సినిమాలోని పాత్రకు సంబంధించి ఉప కథలు ఉంటాయి. ఈ కథలో ప్రతీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని అనుకొన్నాం. అయితే ఈ సినిమాను తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి సమయం లేదు. డబ్బింగ్ చేసి ప్రమోషన్స్ చేయడానికి చాలా టైమ్ అవసరం అందుకే.. ఇతర భాషల్లో రిలీజ్ చేయడం లేదు అని వశిష్ట తెలిపారు.

    చరిత్రను వక్రీకరించలేదు..

    చరిత్రను వక్రీకరించలేదు..


    బింబిసార చరిత్రను వక్రీకరించలేదు. ఈ సినిమా పూర్తిగా ఫిక్షన్. చరిత్రలోనే అంశాలను ఎక్కడా తీసుకోలేదు. మా కథలో బింబిసారను గొప్ప రాజుగా చూపించాం. ఈ సినిమాను 130 రోజులు చూపించాం. ఈ సినిమాను బాహుబలితో పోల్చకూడదు. ఒకవేళ పోల్చితే అంతకంటే నాకు గౌరవం ఏముంటుంది. బాహుబలి జానపదం, ఈ సినిమా పూర్తిగా సోషియో ఫాంటసీ సినిమా. ఈ ట్రైలర్‌ చూస్తే మగధీర గుర్తుకువస్తుంది. అయితే కథ విషయంలో మగధీర, బింబిసారకు పోలికే లేదు అని వశిష్ట చెప్పారు.

     బింబిసార 2 మూవీ ఎప్పుడంటే?

    బింబిసార 2 మూవీ ఎప్పుడంటే?


    బింబిసార మూవీని ఎన్టీఆర్ చూశారు. అందుకే బింబిసార 2 గురించి చాలా ఎమోషనల్‌గా ఆయన చెప్పారు. అయితే బింబిసార టీజర్ అని చెప్పారంటే.. బింబిసార 2 మరో లెవెల్‌లో ఉంటుంది. బింబిసారను ఫ్రాంచైజీగా చేయాలని నిర్ణయించాం. బింబిసారకు పరిమితులు లేవు. ఎలాంటి బౌండరీలు లేని కథతో బింబిసార ఫ్రాంచైజీలు కొనసాగుతాయి. రాముడు, కృష్ణుడు అంటే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు. బింబిసార అంటే కల్యాణ్ రామ్ గుర్తుకొస్తారు. త్వరలోనే బింబిసార 2 షూటింగ్ ప్రారంభిస్తాం అని వశిష్ట్ తెలిపారు.

    English summary
    Nandamoori Kalyan Ram's Bimbisara is a socio, Fantacy movie which is releasing on August 5th. As part of the promotion, Director Vashist speaks to Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X