twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ Tillu మా నాన్న పారిపోయి సూపర్ స్టార్ కృష్ణ ఇంటిలో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన దర్శకుడు విమల్ కృష్ణ

    |

    టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు, యూత్‌లో మంచి క్రేజ్ పెంచిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ నేపథ్యంలో తొలి చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ..

    వైజాగ్‌లోనే నేను పుట్టి పెరిగాను. నేను ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలో నా పేరెంట్స్ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. నా ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. అయితే నేను ఎక్కడ జాబ్ చేయకుండా నేరుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే నా పేరెంట్స్ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. అయితే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం వెనుక ఆసక్తికరమైన అంశం ఉంది అని దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు.

    Director Vimal Krishna about his father and DJ Tillu movie

    మా ఫాదర్ శ్రవణ్ కుమార్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు అంటే 10 ఏళ్ల వయసులో యాక్టర్ కావాలని ఇంటి నుంచి పారిపోయారు. వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్లి సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లిపోయారు. అయితే అక్కడికి వచ్చిన మా నాన్నను చూసి ఎవరు మీరు అని అడిగితే.. నాకు ఎవరు లేరు? అని చెప్పారు. అలా కృష్ణ ఇంటిలోనే ఉంటూ ఆయనతో సినిమా షూటింగులకు వెళ్తూ ఉండేవారు. మోసగాళ్లకు మోసగాడు షూటింగ్ సమయంలో అక్కడే ఉన్నారు. ఇంకా కొద్ది నెలలు ఉంటే మా నాన్న యాక్టర్ అయి ఉండే వారేమో. ఆ తర్వాత మా నాన్నను వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే మా నాన్నకు యాక్టర్ కావాలనే కోరిక ఉంది కాబట్టి.. నేను సినిమా పరిశ్రమకు వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు అని దర్శకుడు విమల్ కృష్ణ వెల్లడించారు.

    డిజె టిల్లు ద్వారా కొత్త టేకింగ్, ఫ్రెష్ మేకింగ్ చూపించాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సఫలం అయ్యామని అనుకుంటున్నాము. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ట్రైలర్ చూశాక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని ఫోన్ చేశారు. సినిమా కుదిరాక వివరాలు వెల్లడిస్తాను అని విమల్ కృష్ణ తెలిపారు.

    డీజే టిల్లులో నటీనటులు, సాంకేతిక నిపుణులు
    నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి తదితరులు
    రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
    మాటలు: సిద్దు జొన్నలగడ్డ
    సంగీతం: శ్రీచరణ్ పాకాల
    సినిమాటోగ్రఫి: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
    పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్
    సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
    నిర్మాత: సూర్యదేవర నాగవంశి
    దర్శకత్వం: విమల్ కృష్ణ

    English summary
    Director Vimal Krishna after a short streak of acting in films such as Jersey and Bommala Ramaram wielded the megaphone for his directorial debut, DJ Tillu. The movie has a lineup of wonderful actors including Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, among others, and is slated for a Pre-Valentine’s Day release on February 12.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X