twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్యాన్ ఇండియా హీరో అంటే అలాంటి టెన్షన్.. లవ్ స్టోరీలంటే అసహ్యం.. నిఖిల్ సిద్దార్థ్ (ఇంటర్వ్యూ)

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 18 పేజేస్. కార్తీకేయతో ప్యాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా గురించి హీరో నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ..

    18 పేజేస్ సినిమా కోసం

    18 పేజేస్ సినిమా కోసం


    ప్యాన్ ఇండియా హీరో అంటే ప్రతీసారి ఒక టెన్షన్ ఉంటుంది. సినిమా సక్సెస్ అనేది ఎప్పుడూ ఒక ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. సక్సెస్ తర్వాత పార్టీలు చేసుకొంటారని అందరూ అనుకొంటారు. కానీ నెక్ట్స్ సినిమా ప్లానింగ్ అనేది ఎప్పుడూ ఒక టెన్షన్ ఉంటుంది. 18 పేజేస్ సినిమా కోసం కొంచెం టైమ్ తీసుకొన్నాం. కార్తీకేయ 2 సినిమా బాధ్యత పెంచింది. అయితే కార్తీకేయ సినిమా హిట్ తర్వాత ప్రొడక్ట్‌ను ఇంప్రూవ్ చేయడానికి కొన్ని సీన్లు రీ షూట్ చేశాం. కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. బెటర్‌మెంట్ కోసం చిన్న చిన్న మార్పులు చేశాం. 2019లో ఒప్పుకొన్న సినిమా 18 పేజేస్. దానిని మార్పులు చేయడం నాకు ఇష్టం లేదు అని నిఖిల్ అన్నారు.

    హిందీలో రిలీజ్ ఎప్పుడంటే?

    హిందీలో రిలీజ్ ఎప్పుడంటే?

    18 పేజేస్ సినిమా ఒక ఎమోషనల్ లవ్ స్టోరి. అయితే కార్తీకేయ 2 హిట్ తర్వాత ఈ సినిమాను హిందీలో డబ్ చేయాలని అనుకొన్నాం. కానీ సమయం సరిపోలేదు. అందుకే కొంత గ్యాప్ తీసుకొని సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నాం. సీతారామం సినిమా విషయానికి వస్తే.. ఇక్కడ రిలీజ్ తర్వాత 45 రోజుల అనంతరం హిందీలో రిలీజ్ చేశారు. అయితే ప్రాపర్‌గా డబ్బింగ్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. అందుకే టైమ్ తీసుకొని సినిమాను హిందీలో రిలీజ్ చేస్తాం అని నిఖిల్ సిద్దార్థ తెలిపారు.

    సుకుమార్ మార్క్ మాత్రమే కనిపిస్తాడు..

    సుకుమార్ మార్క్ మాత్రమే కనిపిస్తాడు..

    లవ్ స్టోరీలతో వచ్చే మూవీల విషయంలో సుకుమార్‌కు ఒక మార్క్ ఉంటుంది. కానీ 18 పేజేస్ సినిమాలో సుకుమార్ మార్కే కనిపిస్తుంది. సుక్కు మార్క్‌కు 18 పేజేస్ ఒక ఉదహారణ. పుష్ప సినిమా ముందు వరకు సుకుమార్ ఈ సినిమాతో ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత పుష్ప రిలీజ్ అనంతరం మళ్లీ కథలో భాగమయ్యారు. కథ మొత్తం తెలియదు. ఒక్కో సీన్ చేసుకొంటూ వెళ్లాం. కానీ సినిమా చూసిన తర్వాత నాకు కథలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాను.ఈ సినిమా తర్వాత నా పెర్ఫార్మెన్స్ గురించి తప్పుకుండా మాట్లాడుకొంటారు అని నిఖిల్ సిద్దార్థ్ అన్నారు.

    లవ్ స్టోరిలంటే నాకు హేట్

    లవ్ స్టోరిలంటే నాకు హేట్

    నాకు లవ్ స్టోరీలు అంటే హేట్ చేస్తాను. నా కెరీర్‌లో ఎప్పుడూ లవ్ స్టోరీ సినిమాలు చేయలేదు. సూర్య అండ్ సూర్య సినిమా లవ్ స్టోరి అయినా అందులో హీరోకు ఉండే లోపాలపైనే కథ నడుస్తుంది. 18 పేజేస్ సినిమా ప్రాపర్, డిఫరెంట్, క్రేజీ లవ్ స్టోరి. ఈ సినిమా లవ్, బ్రేకప్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్యాచప్‌ అనే విషయం ఉంటుందా లేదా అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఈ తరం అబ్బాయి, అమ్మాయిల మధ్య ఉంటే సమస్యలకు కొన్ని పరిష్కారాలు ఉంటాయి. లవ్ లేని చోట ఫెయిల్యూర్ ఉండదు అని నిఖిల్ తెలిపారు.

    కార్తీకేయ 2 సినిమాకే ఎక్కువ రెస్సాన్స్

    కార్తీకేయ 2 సినిమాకే ఎక్కువ రెస్సాన్స్

    18 పేజేస్ సినిమా కోసం 18 ప్రదేశాల్లో పర్యటించి ప్రమోట్ చేశాం. ఈ సినిమా కంటే కార్తీకేయ 2 సినిమాకే ఎక్కువ రెస్సాన్స్ కనిపించింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌ను కార్తీకేయ 2 థ్యాంక్యూ టూర్‌గా, 18 పేజేస్‌ సినిమా ప్రమోషన్స్ చేశాం. ఇప్పటి వరకు 14 ప్రదేశాలు తిరిగాం. ఇంకా తెలంగాణలో 4 ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంది. 18 పేజేస్ సినిమాను ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారనే విషయం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని నిఖిల్ చెప్పారు.

    English summary
    Hero Nikhil Siddarth's latest movie is 18 pages. Anupama Parameswaran is pairting second time with Nikhil. This movie is set to release on 23rd December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X