Don't Miss!
- News
Student: టీచర్ కొట్టిన దెబ్బలకు ఐసీయూలో చేరిన విద్యార్థి, మాస్టర్ కు బీపీ వచ్చిందేమో ? !
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Sports
IND vs ENG: చెలరేగిన బెన్ స్టోక్స్.. కుప్పకూలిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 378
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
కొండా మురళిపై 47 బుల్లెట్స్ ఫైర్.. ఆ పరిస్థితులను తలుచుకొంటే.. హీరో త్రిగుణ్ షాకింగ్ విషయాలు వెల్లడి
కొండా లాంటి సినిమాకు క్యారెక్టర్‌లా కనిపిస్తే చాలు. ఈ సినిమా కోసం ఆరేడు కేజీల బరువు పెరిగా. రెండు మూడు ఫోటోషూట్స్ చేసేసరికి మీసం, గడ్డం... లుక్ అంతా వచ్చేసింది. క్యారెక్టర్ ఆత్మను పట్టుకోమని వర్మ గారు చెప్పారు. ఆ రోజుల్లో ఒకరిని చంపినా, రేప్ చేసిన అడగడానికి దిక్కు లేదు. జమీందార్లు, కుల వ్యవస్థ కారణంగా స్టూడెంట్స్ ఉద్యమంలోకి వచ్చారు. ఈ సంగతులు వర్మ గారు చెప్పుతూ క్యారెక్టర్ ప్రాధాన్యతను వివరించారు. ఇంకా జూన్ 24న రిలీజ్ అవుతున్న కొండా మూవీ గురించి హీరో త్రిగుణ్ మాట్లాడుతూ..
కొండా మూవీలో ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఈ చిత్రంలో వర్మ 40, 50 ఇన్సిడెంట్స్ రాశారు. ఇవన్నీ తీస్తే వెబ్ సిరీస్ అవుతుందని, పీక్ మూమెంట్స్ కొన్ని తీసుకున్నారు. ఒక సన్నివేశంలో కొండా మురళిపై 47 బుల్లెట్స్ ఫైర్ అవుతాయి. అయితే షూటింగులో అలాంటి సీన్లలో నటించడం చాలా కష్టంగా అనిపించింది. నిజ జీవితంలో కొండా ఆ పరిస్థితిని ఎలా తట్టుకొన్నారనేది ఆలోచిస్తే.. ఎమోషనల్‌గా అనిపించింది. ఇలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. అయితే కొండా ఎలా ఆడుతుందో నాకు తెలియదు. కానీ, క్రాఫ్ట్స్ పరంగా ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో కొండా బెస్ట్ అని వర్మ గారు చెప్పారు అని త్రిగుణ్ అన్నాడు.

కొండా మూవీలో మురళి, సురేఖ ఇద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయి. అందుకే కొండా' అని టైటిల్ పెట్టారు. మురళి, సురేఖమ్మ... కొండా కింద ఇద్దరి పేర్లు రాసుకోవచ్చు. కొండా మురళి ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్న వారంతా చనిపోయారు. మురళి వెనుక సురేఖ లాంటి మహిళ ఉండటంతో ఆయన బతికారని వర్మ గారు చెప్పారు. చాలా నిర్ణయాలను మార్చిన ఘనత సురేఖమ్మది. మదర్ రోల్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తులసి గారు తల్లిగా, ఎల్బీ శ్రీరామ్ గారు తండ్రిగా నటించారు. సురేఖమ్మ పాత్రలో ఇరా మోర్ చక్కగా నటించింది. కొండా ఫ్యామిలీకి పెట్ డాగ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు కుక్కలు అంటే ఇష్టం. అందుకని, వర్మ గారు సినిమాలో ఒక పెట్ డాగ్ రోల్ పెట్టారు అని త్రిగుణ్ తెలిపాడు.
ప్రేమ దేశం' విడుదల అవుతుంది. అందులో నేను, మేఘా ఆకాష్ జంటగా నటించాం. ఆ చిత్రానికి మణిశర్మ గారు సంగీతం అందించారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్' అని మరో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. దేవ కట్టా గారి శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. మిస్కిన్ గారి దర్శకత్వంలో మరో సినిమా ఉంది. దానికి ఆయనే సంగీతం అందిస్తున్నారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు పర్పుల్ రాక్ అని బ్యానర్ పెట్టారు. అందులో 'లైన్‌మేన్' అని సినిమా చేస్తున్నా. 'కిరాయి' అని ఇంకో సినిమా ఉంది.