Don't Miss!
- Sports
PBKS vs CSK: ఐపీఎల్ 2021 సీజన్ ముగిసేలోపు అతడికి పంజాబీ నేర్పిస్తాం: షమీ
- News
అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు
- Finance
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు: టాప్ లూజర్స్, గెయినర్స్
- Automobiles
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లికి ముందే శృంగారం.. హీరోయిన్ అంజలి దిమ్మతిరిగే సమాధానం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ అంజలి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాలో ఉండే మూడు అద్బుతమైన, భావోద్వేగమైన పాత్రల్లో ఒకదానిని అంజలి పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంజలి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..
Gallery: Srilanka Actress Piumi Hansamali Photos goes viral on internet

వకీల్ సాబ్ డైరెక్టర్‌కు థ్యాంక్స్
సాధారణంగా పెద్ద హీరో సినిమాలో ఇతర క్యారెక్టర్లు గాలికి కొట్టుకుపోతాయి. కానీ వకీల్ సాబ్‌లో ఎన్ని మార్పులు చేసినప్పటికీ మా పాత్రలు చాలా భద్రంగా, ఎమోషనల్‌గా ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమా చేయడానికి ముందు ఏదైతే దర్శకుడు వేణు శ్రీరాం చెప్పారో అది తెరపైన కనిపించింది. అందుకు డైరెక్టర్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంజలి అన్నారు.
Photos: Indian celebs Holi Celebration 2021

సినిమా కథ ఆత్మ అలాగే ఉంది...
వకీల్ సాబ్ సినిమాను డబ్బింగ్ చెప్పే సమయంలోను, మరోసారి సినిమా చూశాను. మార్పులు చాలా ఉన్నాయి కానీ, కథలోని ఆత్మ అలాగే ఉంది. తెలుగు సినిమా తగినట్టుగా, ప్రేక్షకుల టేస్ట్‌కు తగినట్టుగా సినిమాను మార్చారు. అంతేగానీ కథలోగానీ, క్లైమాక్స్‌లో గానీ పెద్దగా మార్పులేమి ఉండవు అని అంజలి తెలిపారు.
Photos: Zaara Yesmin Latest Hot Photo Shoot

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులపై
పింక్ సినిమాలోనే కాదు.. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు నిత్యం జరిగేవే. ప్రతీ రోజు పేపర్లో వస్తూనే ఉంటాయి. రోజూ ప్రతీ పేజీలో ఇలాంటి వార్తలు కనిపించడం వల్ల మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ అలాంటి సంఘటన ఒకరి జీవితంలో జరిగితే ఎంత దారుణంగా ఉంటుందో అనే విషయం మాటల్లో చెప్పలేం. జీవితం తారుమారైపోతుంది. ఈ సినిమాలో నటించేటప్పుడు చాలా సార్లు ఫీలయ్యాను అని అంజలి తెలిపారు.
Photos: Indian Celebs And Their Favourite Holiday Spots

ఏ అమ్మాయికైనా జరగకూడదు
మహిళలపై అఘాయిత్యాలు, ఇలాంటి అంశాలపై పెద్దగా మాట్లాడటానికి అవకాశం లభించలేదు. సాధారణంగా సెలబ్రిటీ అనే విషయాన్ని పక్కన పెడితే అమ్మాయి ఎలాంటి ప్రొఫెషన్‌లో ఉన్నా ఆమె అమ్మాయే. ఓ అమ్మాయికి ఏదైనా జరిగినప్పుడు అది అమ్మాయికి జరగకూడదనేది నా అభిప్రాయం అని అంజలి పేర్కొన్నారు.

అమ్మాయి నో చెబితే.. అది...
ఒక అమ్మాయి ఏదైనా ప్రపోజల్‌కు ‘నో' చెప్పితే అది ‘నో' గానే ఉండాలి అంతేగానీ బలవంతంగా రుద్ద కూడదు. ఆడ పిల్ల నిర్ణయానికి, అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి. ఆడపిల్ల ఒప్పుకోకపోవడం ఆమె హక్కు. ఆ హక్కును కాల రాయకూడదు అని అంజలి అన్నారు.

పెళ్లికి ముందు సెక్స్ గురించి
పెళ్లికి ముందు సెక్స్ అనేది సమాజంలో ఊహించలేనిది. అది వ్యక్తిగతమైన ఇష్టం. పర్సనల్ ఛాయిస్‌గానే పరిగణించాలి. దానిని ఒక్కరి అభిప్రాయంగా మాత్రమే పరిగణించాలి. ఒకరు ఆలోచించే విధానం వేరు.. నేను ఆలోచించ విధానం వేరు. అందరూ క్రిమినల్‌గా ఆలోచిస్తే అన్నీ క్రైమ్స్ జరుగుతుంటాయి. అందరూ మంచిగా ఆలోచిస్తే క్రైమ్స్ జరగవు అని అంజలి వెల్లడించారు.