For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాన్న ముందే అలా.. హాట్ సీన్లలో నటించడం కష్టమైంది.. యంగ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  |
  Wife,I Movie Actress Gunnjan Bold Interview

  టాలీవుడ్‌లో యూత్‌ను ఆకట్టుకొనేలా బోల్డ్ సినిమాలు ఎక్కువ మోతాదులోనే వస్తున్నాయి. RX 100, ఏడు చేపల కథ లాంటి సినిమాల తర్వాత మళ్లీ మరో అడల్డ్ కంటెంట్ మూవీగా వైఫ్, I అనే చిత్రం జనవరి 3న రిలీజైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఈ చిత్రంలో హట్ జంటగా అభిషేక్ రెడ్డి, గుంజన్ నటించారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరోయిన్ గుంజన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటింది. గుంజన్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  నెగిటివ్ షేడ్స్‌లో

  నెగిటివ్ షేడ్స్‌లో

  వైఫ్, I మూవీలో నేను విలన్ టచ్, షేడ్ క్యారెక్టర్‌లో నటించాను. చాలా బోల్డ్‌గా నటించాలి. అంతేకాకుండా కథలో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కూడా ఆకట్టుకొన్నాయి. నా గ్లామర్‌గా కనిపిస్తాను. నేను ముందు నుంచే బోల్డ్‌ నేచర్. నేను ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మరికొంత బోల్డ్‌గా కనిపించాలని ఈ పాత్రను ఒప్పుకొన్నాను. అంతేకాకుండా నా పాత్ర చాలా స్ట్రాంగ్. అందుకే ఈ సినిమాలో నటించాను అని గుంజన్ తెలిపింది.

  గుంజన్ వస్తుందంటే ఇంకెంత బోల్డ్‌గా అని

  గుంజన్ వస్తుందంటే ఇంకెంత బోల్డ్‌గా అని

  ‘వైఫ్' మూవీ చూశాక రెండు రోజులకే క్యారెక్టర్ మర్చిపోయేలా ఉండకూడదు. నేను ప్రేక్షకుల మనసుల్లో ఉండాలని అనుకోవడం లేదు. వారి బ్రెయిన్‌లో చోటు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనసులో ఎప్పుడూ ఒకరికే చోటు ఉంటుందంటే నేను నమ్మను. ఈ రోజు ఒకరు, రేపు ఒకరు అని ప్రేక్షకులు మార్చేస్తుంటారు. కానీ ఒక్కసారి గుర్తుండిపోయామంటే చివరి దాకా మన ముద్ర అలాగే ఉండిపోతుంది. గుంజన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే.. బాబోయ్ ఇంకెంత బోల్డ్‌గా ఉంటుందో అని ప్రేక్షకులు అనుకోవాలి అని గుంజన్ వెల్లడించింది.

  ముందు భయపడ్డాను

  ముందు భయపడ్డాను

  దర్శకుడు కల్యాణ్ నాకు కథ చెప్పినప్పుడు కాస్త భయపడ్డాను. అందుకు కారణం భాష. తెలుగు భాష నాకు రాదనే భయం వెంటాడింది. కానీ టాలీవుడ్ నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకు నేను హీరో. నా పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. తొలి సినిమాలోనే నాకు మంచి అవకాశం రావడంతో వదలుకోదలచుకోలేదు అని గుంజన్ చెప్పింది.

  నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్‌గా

  సినిమా పరిశ్రమలోకి రావాలనుకొన్నప్పుడు నాకు నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్‌గా ఉంది. నాకు వెన్నుముకగా నిలిచారు. 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను బికినీ మోడల్‌గా మారాను. ఆ సమయంలో మా ఫాదర్ పక్కనే ఉండి ప్రోత్సహించారు. దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్టివ్‌గా ఉంటారో మీకు అర్ధమవుతుందనుకొంటాను అని గుంజన్ పేర్కొన్నది.

  నా పేరేంట్స్ హ్యాపీగా

  నా పేరేంట్స్ హ్యాపీగా

  వైఫ్, I ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానిని నా పేరేంట్స్‌కు పంపించాను. వారు ఆ ట్రైలర్ చూసి బాగా మెచ్చుకొన్నారు. అలాగే నీ పాత్రకు పూర్తిగా న్యాయం చేశావని అన్నారు. దాంతో నాపై నాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. దాంతో మంచి పాత్రలు చేయాలనే కోరిక మరింత బలపడింది.

   ప్రియాంక చోప్రా ఆదర్శంగా

  ప్రియాంక చోప్రా ఆదర్శంగా

  వైఫ్, I సినిమాలో నేను నెగిటివ్ పాత్ర చేస్తున్నాననే విషయం తెలియగానే.. నాకు ప్రియాంక చోప్రాను గుర్తొచ్చింది. ఆ సినిమాలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకొన్నాను. నెగిటివ్ రోల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆమె మెప్పించింది. అందుకే ఈ పాత్ర విషయంలో ప్రియాంకను నేను రిఫెరెన్స్‌గా తీసుకొన్నాను. అలాగే ఈ పాత్ర కోసం ఎలాంటి రిహార్సల్, లేదా హోంవర్క్ చేయలేదు అని గుంజన్ పేర్కొన్నది.

  English summary
  Heroine Gunnjan revealed about bold character in Wife,i movie. She said, before wife, I.. I entered in model industry. I was shot in bikini at age of 17 years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X