For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లిప్‌లాక్స్, స్మోకింగ్ సినిమా కోసమే... మా ఇంట్లో తెలుసు: ప్రియా వడ్లమాని

  |

  బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా ప్రియా వడ్లమాని మీడియాతో ముచ్చటించారు.

  మీడియా ప్రశ్నలకు ప్రియా వడ్లమాని స్పందిస్తూ... సక్సెస్ ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కావడం లేదు. నేను చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియడం లేదు. సినిమాను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నాం అన్నారు.

  మంచి గుర్తింపు వచ్చింది

  మంచి గుర్తింపు వచ్చింది

  ‘హుషారు' రిలీజ్ తర్వాత చాలా సందేశాలు వచ్చాయి. అవన్నీ చదవలేదు. ఫైనల్‌గా ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇటీవల ఓ చోటుకు వెళ్లినపుడు డైరెక్టర్‌తో మాట్లాడుతుంటే చాలా మంది నన్ను హుషారు యాక్టర్ అని గుర్తుపట్టారు.

  కాస్త టెన్షన్, భయం ఉండేది

  కాస్త టెన్షన్, భయం ఉండేది

  2 సంవత్సరాల నుంచి మూడు సినిమాలకు పని చేస్తున్నాను. చాలా నర్వస్ ఉండేది. చిన్న సినిమాలు జనాల వద్దకు వెళ్లడం కష్టం. మొదటి రెండు సినిమాలు రీచ్ కాలేదు. హుషారుపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితేనే నాకు కెరీర్ ఉంటుంది లేకుంటే లేదు అనే భయం ఉండేది. ఫైనల్ గా సినిమా హిట్టయింది.

  కొరటాల శివ, రాజమౌళి అలా ఉండమన్నారు.. 2020 వరకు భరించాల్సిందే: రాహుల్ రామక‌ృష్ణ

  అసిస్టెంటుగా కెరీర్ మొదలు పెట్టా

  అసిస్టెంటుగా కెరీర్ మొదలు పెట్టా

  నేను వంశీపైడిపల్లి సర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాను. ‘మహిర్షి' చిత్రం ప్రీ ప్రొడక్షన్లో పని చేశాను. ఆ సమయంలోనే శుభలేఖలు, హుషారు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతానికి యాక్టింగ్ మీదే దృష్టిపెట్టాను. ఫ్యూచర్లో డైరెక్షన్ మీద ఫోకస్ పెడతాను.

  హైదరాబాద్, బెంగులూరులో చదివా

  హైదరాబాద్, బెంగులూరులో చదివా

  నా స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. ఇంటర్మీడియట్ విల్లామేరీలో చదివాను. గ్రాజ్యువేషన్ బెంగుళూరులో పూర్తి చేశాను. క్రైస్ట్ యూనివర్శిటీలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, థియేటర్, సైకాలజీ, లిటరేచర్ చదివాను. 12 సంవత్సరాలు కూచిపూడి నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకోలేదు. క్రైస్ట్‌లో కూడా డైరెక్షన్ డిపార్టులో ఉన్నాను.

   సైన్ చేశాకే యాక్టింగ్ మొదలు పెట్టా

  సైన్ చేశాకే యాక్టింగ్ మొదలు పెట్టా

  హుషారు సినిమాకు సైన్ చేసిన తర్వాత తాజుద్దీన్ సర్ బేసిక్స్ నేర్పించారు. కెమెరా ముందు ఎలా పెర్ఫార్మ్ చేయాలో చెప్పారు. మా నాన్న బిజినెస్‌మేన్, రియల్ ఎస్టేట్‌లో కూడా ఉన్నారు. మా మమ్మీ, పెద్దమ్మ కలిసి హాస్టల్స్ రన్ చేస్తారు.

   లక్కీగా అవకాశం వచ్చింది

  లక్కీగా అవకాశం వచ్చింది

  కొన్ని స్టోరీలు వినగానే క్లిక్ అవుతాయి అనిపిస్తుంది. ‘హుషారు' సినిమా కథ విన్నపుడు అలానే అనిపించింది, దీన్ని ఎలాగైనా వదులుకోకూడదు అనుకున్నాను. లక్కీగా రియా క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది.

   ఆ సినిమాకు ఎలక్షన్ దెబ్బపడింది

  ఆ సినిమాకు ఎలక్షన్ దెబ్బపడింది

  హుషారు ఫుల్ యూత్ మూవీ, శుభలేఖలు ఫ్యామిలీ మూవీ. కెరీర్ బిగినింగులో కంప్లీట్ డిఫరెంట్ జోనర్స్ చేస్తే యాక్టర్‌గా నిరూపించుకోవచ్చు అనుకున్నాను. శుభలేఖలు సినిమాకు కూడా చాలా ప్రమోషన్స్ చేశాం. ఎలక్షన్ వల్ల ఎఫెక్ట్ పడింది. దాంతో పాటు కొన్ని పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. దాంతో ఆ సినిమాకు మౌత్ పబ్లిసిటీ రాలేదు. అయితే హుషారుకు మొదటి రోజు మౌత్ పబ్లిసిటీ వచ్చింది. దీంతో చాలా బెనిఫిట్ అయింది.

   తెలుగు అమ్మాయి కావడం వల్ల...

  తెలుగు అమ్మాయి కావడం వల్ల...

  తెలుగమ్మాయిలైనా, బాంబే అయినా టాలెంట్ మీదే కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది. మన సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది పెద్ద హీరోయిన్లు బాలీవుడ్ వెళ్లారు. తెలుగు అమ్మాయి కావడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దీంతో కొందరు నన్ను ముంబై నుంచి వచ్చామని చెప్పమన్నారు. ఇంకొందరు సర్‌నేమ్‌ మార్చుకోమని కూడా సలహా ఇచ్చారు. అదేమీ చేయకపోయినా ‘హుషారు', ‘శుభలేఖలు', ‘ప్రేమకు రెయిన్ చెక్‌' వంటి అవకాశాలు వచ్చాయి. ‘హుషారు' డైరక్టర్‌ శ్రీహర్ష లాంటి వారు వెతికి వెతికి తెలుగు అమ్మాయిలకే అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఉండటం నా అదృష్టం.

  లిప్ కిస్సులపై

  లిప్ కిస్సులపై

  నేను లిప్ కిస్సులు పెట్టినా, సిగరెట్ తాగినా సినిమాలో క్యారక్టర్‌ కోసమే. నేను స్మోక్ చేయలేదు, నా క్యారెక్టర్ స్మోక్ చేసింది. కావాలని అలాంటి పనులు నేను చేయను. వల్గర్ ఉంటే ఒప్పుకోను. మా ఫ్యామిలీ బ్రాడ్ మైండెడ్. వాళ్లు చాలా సెన్సబుల్. మా నాన్నగారు ఒకటే చెప్పారు. ఈ దేశంలో అందరూ మెచ్చేలా మనం ఉండలేం. నా ఫ్రెండ్స్‌కి, నా ఫ్యామిలీకి నేనేంటో తెలుసు. అందుకే ఇలాంటివి చేయడంలో నాకు ఇబ్బంది లేదు.

   రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం లేదు

  రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం లేదు

  తమిళ్‌లో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. తెలుగులో టాక్స్‌ జరుగుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అయినా క్యారక్టర్ బేస్డ్ కోసం చూస్తున్నాను. దొరికితే అదృష్టం. ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టాను. రెమ్యూనరేషన్ గురించి ఆలోచించడం లేదు. ఫోకస్ అంతా వర్క్ మీదే ఉంది.

  English summary
  Husharu actress Priya Vadlamani interview. - Hushaaru starring Tejus Kancherla and Priya Vadlamani in the lead role. Husharu story of four friends from middle-class families who believe in carving a niche for themselves by not following a trodden path set by others. However, their liberal attitude is condemned by the conservative society.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X