For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yashoda సిలికాన్ బేబీ బంప్‌తో అలాంటి కష్టాలు.. సమంతకు మాత్రమే సాధ్యం.. కల్పిక, దివ్య శ్రీపాద, ప్రియాంక

  |

  దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. దర్శక ద్వయం హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించి యువ తారలు కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ మీడియాతో మాట్లాడుతూ..

  సరోగసి ఫెర్టిలిటి సెంటర్లో

  సరోగసి ఫెర్టిలిటి సెంటర్లో


  సమంతతో పాటు మిగతా పాత్రలకుప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకాశర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కల్పిక, దివ్య శ్రీపాద, ప్రియాంక చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నదని అన్నారు.

  ఎంగేజింగ్‌గా యశోద

  ఎంగేజింగ్‌గా యశోద


  కల్పికా గణేష్ మాట్లాడుతూ ''మనం కూర్చుని ఫిలాసఫీ చెబితే ఎవరూ వినరు. దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పాలి. 'యశోద' పర్ఫెక్ట్ ప్యాకేజ్అని చెప్పాలి.ఎంటర్‌టైన్‌మెంట్, క్యూట్ రొమాన్స్, ఎమోషన్స్... ప్రతిదీఉంది. పాటలు మాత్రమే మిస్సింగ్. ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలి. అందుకే, కొన్ని ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ... ఈ సినిమలో ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేయడానికి అంగీకరించాం. మహిళలకుమాత్రమే కాదు, మగవాళ్ళకు, పిల్లలకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి. క్యారెక్టర్ చిన్నదా? పెద్దదా? అని ఆలోచించలేదు. కథ కోసమే సినిమా చేశా అని అన్నారు.

   చిన్న పాత్రలే సినిమాకు బలంగా

  చిన్న పాత్రలే సినిమాకు బలంగా


  యశోద చిత్రంలో చిన్న చిన్న పాత్రలు కథను ముందుకు తీసుకు వెళ్లాయి. సమంత సినిమా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వస్తున్న స్పందన సంతోషాన్ని ఇచ్చింది. మీరు 'ప్రయాణం' చూశారు కదా! దానికి ఈ క్యారెక్టర్ మరో వెర్షన్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ చేశాక... తెలుగు డబ్బింగ్ చెప్పాను. తమిళ్ డబ్బింగ్ కూడా చెబుతాననిఫైట్ చేశా. వాయిస్ టెస్ట్ చేశారు. కానీ కుదరలేదు'' అని కల్పిక అన్నారు.

  లీలకు క‌‌‌‌ృష్ఱ ప్రేమ ఎంతంటే

  లీలకు క‌‌‌‌ృష్ఱ ప్రేమ ఎంతంటే


  దివ్య శ్రీపాద మాట్లాడుతూ ''సమంత 'నేను బాగా చేశాను' అని చెప్పారు. నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా చూస్తే... క్యారెక్టర్లపేర్లు అన్నిటికీ కృష్ణుడికనెక్ట్ ఉంటుంది. సరోగసీ కాన్సెప్ట్ కొత్తది కాదని చెప్పడానికి పేర్లు ఆ విధంగా పెట్టారేమో!? షూటింగ్ విషయానికి వస్తే... సిలికాన్ బెల్లీతో చేయడం కష్టం అండి. ఇటువంటి కథతోసినిమా తీస్తున్నారనేదిఎగ్జైటింగ్ పార్ట్. క్యారెక్టర్ కోసం చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. లీలకు కృష్ణ అంటే ఎంత ప్రేమ అనేది చాలా వివరించారు. లీల ఎంత ఇన్నోసెంట్ అనేది నేను ఫీల్ అయ్యానో... అలా ప్రేక్షకుడు కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పారు.

  ఫీమేల్ ఆర్టిస్టులకు ఇలాంటి ఛాన్సులు

  ఫీమేల్ ఆర్టిస్టులకు ఇలాంటి ఛాన్సులు


  సమంత ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఎమోషనల్ పాత్రలు చేయగలరు. సమంత మాత్రమే కాదు, ఈ సినిమా చూశాక మిగతా ఫిమేల్ ఆర్టిస్టులకు ఇటువంటి సినిమా చేసే ఛాన్సులు వస్తాయని, ఇటువంటి కథలు రాస్తారని ఆశిస్తున్నాను. 'యశోద' కథకు వస్తే... సినిమా ఎండ్ కార్డ్స్‌లో న్యూస్ క్లిప్పింగ్స్ చూపిస్తారు. సినిమాకు అదేమూలం అని దివ్య శ్రీపాద అన్నారు.

  న్యాయం చేస్తానా? అనే భయం

  న్యాయం చేస్తానా? అనే భయం


  ప్రియాంకా శర్మ మాట్లాడుతూ ''సినిణమా షూటింగ్ చేసేటప్పుడు గర్భవతులుగా కనిపించడం కోసం మేమంతా సిలికాన్ బెల్లీ ఉపయోగించాం. దాంతో షూటింగ్ చేయడం కష్టమే. కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడూచేయలేదు. అందుకని, ఎలా చేయగలను? న్యాయం చేస్తానా? లేదా? అని కొంత ఆలోచించాను. రెండు రోజులు ఆలోచించినతర్వాత ఓకే చేశా. ఈ కథను నా దగ్గరకు పుష్ప గారు తీసుకొచ్చారు. 'సినిమా విడుదలైన తర్వాత ఇటువంటి కథ చేయలేదు' అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదన్నారు. నాకు ఆ మాట నచ్చింది. ఓకే చేసేశా. ఇటువంటి కథలు అరుదు. 'యశోద' లాంటి కథల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. సమంత విషయానికి వస్తే... బాడీ డబుల్ (డూప్) ఉపయోగించే అవకాశం ఉన్నా స్వయంగా చేశారు. ఆమె డెడికేషన్‌కి హ్యాట్సాఫ్'' అని అన్నారు.

  English summary
  Yashoda movie has released on November 11th. This movie is going good at box offices. In this occassion, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma speaks to Telugu filmibeat. ‌
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X