twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయేంద్ర ప్రసాద్ వద్ద పనిచేశా.. అల్లు అర్జున్‌కు కథ చెప్పా.. నేనే హీరోగా ఎందుకంటే!

    |

    Recommended Video

    U Movie Hero Kovera Exclusive Interview

    మాఫియా వ్యవహారాల వెనుక కీలకంగా మారే అంశాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద పనిచేసిన కొవెరా ఈ చిత్రానికి దర్శకుడు. స్వయంగా ఈ చిత్రంలో హీరోగా చేయడం మరో విశేషం. పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్ కలిసి ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు కొవెరా తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు మీ కోసం...

    మాఫియా, బ్లాక్‌మనీ కథా నేపథ్యంగా

    మాఫియా, బ్లాక్‌మనీ కథా నేపథ్యంగా

    యు.. కథే హీరో అనే చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రానికి నేను రచన, దర్శకత్వంతోపాటు హీరోగా కూడా నటించాను. నా పేరు కొవేరా. నాతో పాటు హిమాంశి కాట్రగడ్డ హీరోయిన్‌గా నటించింది. మాఫియా, బ్లాక్ మనీ కథాంశంగా యు సినిమాను తెరకెక్కించాను. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది.

     పలువురు హీరోలకు వినిపించాను

    పలువురు హీరోలకు వినిపించాను

    గతంలో ఈ స్క్రిప్టును పలువురు హీరోలకు వినిపించాను. కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. దాంతో నేనే హీరోగా నటించాల్సి వచ్చింది. అంతకు ముందు నేను నాలుగేళ్లు సినీ రచయిత, బాహుబలి ఫేం విజయేంద్రప్రసాద్ వద్ద పనిచేశాను. ఆయన వద్ద పనిచేసిన అనుభవం నాకు బాగా పనిచేసింది.

    విజయేంద్ర ప్రసాద్‌కు చెప్పాను

    విజయేంద్ర ప్రసాద్‌కు చెప్పాను

    యు సినిమా కథను విజయేంద్ర ప్రసాద్‌కు వినిపించాను. ఆయన చెప్పిన రెండు, మూడు సలహాలను నేను తీసుకొని కథలో కొన్ని మార్పులు చేశాను. ఆయన వద్ద పనిచేయడం వల్ల ఎమోషన్స్ ఎలా పట్టుకోవాలి. కథలో భావోద్వేగాలను ఎలా పండించాలనే విషయాన్ని నేను నేర్చుకొన్నాను.

    అల్లు అర్జున్‌కు కథ చెప్పాను

    అల్లు అర్జున్‌కు కథ చెప్పాను

    విజయేంద్ర ప్రసాద్ వద్ద పనిచేస్తున్న సమయంలో అల్లు అర్జున్‌, ఇతర పెద్ద హీరోలకు నేను కథలు చెప్పాను. ఏదో కొన్ని కారణాల వల్ల అవి సెట్స్ మీదకు రాలేకపోయాయి. ఈ క్రమంలో నేనే హీరోగా ఓ సినిమా చేయాలని అనుకొని నేను యు సినిమాను చేశాను.

    పోలీస్ ఆఫీసర్‌గా నటించా

    పోలీస్ ఆఫీసర్‌గా నటించా

    మాఫియా వ్యవహారాలకు డబ్బు ఎలా సమకూరుతుంది. దేశ విచ్చిన్న కార్యక్రమాలకు నల్లడబ్బు ఎలా ఉపయోగిపడుతుందనే అంశాలపై కథను రూపొందించాను. ఈ చిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. సినిమా బిజినెస్ కూడా సానుకూలంగా జరిగింది. నేను పెట్టిన బడ్జెట్ దాదాపు నాకు తిరిగి వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను.

    ప్రేక్షకులకు నచ్చేలా సరికొత్త జోనర్

    ప్రేక్షకులకు నచ్చేలా సరికొత్త జోనర్

    యు సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కొత్త జోనర్‌. యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషన్స్ బాగా ఉంటాయి. సినిమా చూసి నా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను. యు తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ డిసెంబర్ 28 తర్వాత వాటి గురించి ఆలోచించాలని అనుకొన్నాను. అందుకే ఆఫర్లను అంగీకరించలేదు.

    English summary
    Black Money and Mafia affairs are the main theme for U Movie. Director Kovera him self acted as hero. Himansee Katragadda is the heroine. This movie is set to release on December 28th. In this occassion, Kovera speaks to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X