twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరసింహా అలా రాశాను.. ఆ సమయంలో చేయకూడనివి నేర్చుకున్నాను.. కేఎస్ రవికుమార్ కామెంట్స్

    |

    తమిళనాట రజినీ, కమల్ లాంటి వారెందరికో స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చిన దర్శకుడు కేఎస్ రవికుమార్. కమర్షియల్ సినిమాల స్టామినా ఏంటో నిరూపించిన తిరుగులేని దర్శకుడు. రజనీ కెరీర్‌లో నిలిచిపోయే నరసింహా లాంటి చిత్రాన్ని అందించిన కేఎస్ రవికుమార్.. తమిళ నాట స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. అలాంటి దర్శకుడు నందమూరి బాలకృష్ణను జై సింహాగా చూపించి కలెక్షన్ల వర్షం కురిపించాడు.మరోసారి బాలయ్యను గర్జించేలా చేసి బాక్సాఫీస్ రూలర్‌గా నిలబెట్టేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్స్‌తో అంచనాలు పెంచేసిన రూలర్ చిత్రయూనిట్... ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో దర్శకుడు కేఎస్ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

    అనుకున్న పని కాకుంటే..

    అనుకున్న పని కాకుంటే..

    సెట్‌లో అనుకున్న షెడ్యూల్‌కు అనుకున్న పని కాకపోతే కోపం వస్తుందని, ఆ సమయంలో దానికి కారణమైన వారిపై అరుస్తానని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగతంగా తనకు ఎలాంటి పగ, ద్వేషం లాంటివి ఉండవని తెలిపాడు. బాలయ్య కూడా అంతేనంటూ.. పని చేయకపోతే టెంపర్ లేచిపోతుందని పేర్కొన్నాడు.

    ఎవరి దగ్గరకు వెళ్లి అడగను..

    ఎవరి దగ్గరకు వెళ్లి అడగను..

    చాన్స్ ఇవ్వండని ఎవరి దగ్గరకు వెళ్లి అడగనని తెలిపాడు. మొదట్నుంచీ తనకు అదే అలవాటని, ఎంత పెద్దవారైనా సరే తాను మాత్రం అడగనని, ఇప్పటి వరకు అలాంటి సందర్భం రాలేదని, అలా గడిచిపోతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఒకసారి కమిట్ అయితే మాత్రం.. అది పూర్తయ్యే వరకు ఇంకో ప్రాజెక్ట్ ఓకే చేయనని అన్నాడు.

    నరసింహా అలా రాశాను..

    నరసింహా అలా రాశాను..

    శరత్ కుమార్‌తో అక్కడ చేసిన నట్పుక్కాగ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో ‘స్నేహం కోసం'గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని కంటే ముందుగా నరసింహా చేయాల్సి ఉండగా.. రజినీని అడిగి 45రోజుల్లోనే స్నేహం కోసం పూర్తి చేశానని తెలిపాడు. ఉదయం పూట షూటింగ్ చేసి వచ్చి రాత్రంతా నరసింహా డైలాగ్‌లు రాసుకునే వాడినని చెప్పుకొచ్చాడు.

    చేయకూడనివి నేర్చుకున్నాను..

    చేయకూడనివి నేర్చుకున్నాను..

    ఎంత పెద్ద సినిమా అయినా అంత తక్కువ సమయంలో తీయడం వెనుక రహస్యాన్ని ఆయన బయట పెట్టాడు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సినిమాను ఎలా తీయకూడదో నేర్చుకున్నానని, ఎక్కడ పొరపాటు చేయకూడదో తెలుసుకున్నానని అన్నాడు. అందుకే ప్లానింగ్ సరిగా చేసుకుంటానని, అది ఒక్కటి ఉంటే ఎంత పెద్ద సినిమానైనా త్వరగా పూర్తి చేయవచ్చని అన్నాడు.

    రూలర్ చిత్రంపై..

    రూలర్ చిత్రంపై..

    ఈ చిత్రంలో బాలయ్య డ్యూయర్ రోలా? త్రిబుల్ రోలా? అని అడుగుతున్నారు.. సినిమాను చూసి మీరే చెప్పండని అన్నాడు. రైతుల గురించా? ఇంకా ఏదైనా కోణం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు వీటన్నింటికి సమాధానమే రూలర్ అని పేర్కొన్నాడు. ఈ టైటిల్ బాలయ్యకే కరెక్ట్ ఉంటుందని, ఎప్పుడో రిజిష్టర్ చేసి పెట్టారని, ఈ చిత్రాని అది సరిపోతుందని పెట్టామని తెలిపాడు.

    English summary
    KS Ravikumar Interview About Nandamuri Balakrishna Ruler Movie. This Movie Is Directed By KS Ravikumar And Produced By C Kalyan. Bhumika, Prakash Raj, Sonal Chauhan Are Playing Important Character.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X