Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: హర్షా భోగ్లే బెస్ట్ టీమిండియా టీ20 ఎలెవన్.. కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
YS Jagan బిహేవియర్‌పై మహేష్ బాబు ప్రశంసల జల్లు.. ఎవరూ ఊహించని విధంగా అలా..
ఏపీ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య కొద్ది నెలల క్రితం వరకు ఒకరకమైన అనిశ్చితి, గ్యాప్ ఉన్నట్టు కనిపించింది. సినిమా టికెట్ రేట్లు, అదనపు షో ప్రదర్శన విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కొంచెం కఠినంగా వ్యవహరించడంతో సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి గ్యాప్ ఉందనే భావన కనిపించింది. అయితే ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడం తెలిసిందే. ఈ చర్చల కోసం ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, రాజమౌళి తదితరులు ఏపీ రాజధానికి వెళ్లి సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. అయితే సీఎం జగన్‌తో భేటి గురించిన విషయాలపై మహేష్ బాబు స్పందిస్తూ..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇంతకు ముందు ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. కానీ ఎప్పుడూ కలువలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు అనిపించింది. ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో మంచి సంభాషణ జరిగింది అని మహేష్ బాబు అన్నారు.

ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకొన్నారు. బయట ఏం జరుగుతున్నది? పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అడిగారు. అయితే ఇలాంటి మీటింగ్ ఇక ముందు జరిగితే బాగుంటుందని నేను సలహా ఇచ్చాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమల్ని రిసీవ్ చేసుకొన్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది అని మహేష్ బాబు తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్‌లో సర్కారు వారీ పాట మూవీ మే 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్ర ప్రమోషన్ సందర్భంగా మహేష్ బాబు మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.