Don't Miss!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ మాట ఎత్తితే చెప్పుతో కొడుతా.. మేజర్ నిర్మాతలకు సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి వార్నింగ్
ముంబై మహానగరంలోని తాజ్ హోటల్‌పై పాకిస్థాన్ ముష్కరులు జరిపిన 26/11 దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం మేజర్. జూన్ 3వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను సొంతం చేసుకొంటున్నది. ఈ చిత్రం గత 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 కోట్ల షేర్, 43 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం భారీ విజయం దిశగా వెళ్తున్న నేపథ్యంలో నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ..

నమ్రతకు కథ చెబితే..
గూఢచారి
సినిమా
రిలీజ్
సమయంలో
మేజర్
మూవీకి
బీజం
పడింది.
ఆ
సినిమా
రిలీజ్
తర్వాత
మేము
అడివి
శేష్‌ను
కలిశాం.
అయితే
తర్వాత
సినిమా
ఏమిటంటే..
మేజర్
సినిమా
గురించి
చెప్పాడు.
అయితే
ఆ
సినిమాను
ప్యాన్
ఇండియా
మూవీగా
తీయాలని
ఉందని
చెప్పాడు.
అదే
సమయంలో
ఫిలిం
మార్కెటింగ్
కోసం
నమ్రతా
మహేష్
బాబును
కలిసినప్పుడు
ఆమె
ఏదైనా
మంచి
సినిమా
స్క్రిప్టు
ఉంటే
జీఎంబీ
బ్యానర్‌లో
చేయాలనుకొంటున్నామని
చెబితే..
మేజర్
కథను
ఆమెకు
చెప్పాం.
అలా
మేజర్
సినిమా
మొదలైంది
అని
అనురాగ్
రెడ్డి,
శరత్
చెప్పారు.

సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల కోరికతో
మేజర్
సినిమాను
తొలుత
హిందీ,
తెలుగులోనే
తీయాలని
అనుకొన్నాం.
కానీ
సందీప్
ఉన్నికృష్ణన్
తల్లిదండ్రులు
మాకు,
మా
ఫ్యామిలీ
మలయాళంలో
సినిమా
చూడాలని
ఉందని
చెబితే..
మేము
ఆ
సినిమాను
డబ్బింగ్
చేశాం.
అయితే
దేశంలోని
అందరూ
ఈ
సినిమాను
చేయాలని
అనుకొన్నాం.
కానీ
డబ్బు
సంపాదించాలని
మాత్రం
కాదు
అని
అనురాగ్
చెప్పారు.

ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉంది
మేజర్
సినిమా
రిలీజ్
తర్వాత
వస్తున్న
ఫీడ్‌బ్యాక్
చూసి
మాకు
చాలా
సంతోషంగా
ఉంది.
దేశవ్యాప్తంగా
అక్షయ్
కుమార్,
కమల్
హాసన్
సినిమా
పక్కన
అడివి
శేష్‌ను
పెడుతున్నారు.
ప్రతీ
ఒక్కరు
ఆ
సినిమాలతోపాటు
మా
సినిమా
గురించి
ప్రత్యేకంగా
సోషల్
మీడియాలో
ప్రస్తావిస్తున్నారు.
మేజర్
సినిమా
మాకు
చాలా
ఎమోషనల్‌గా
మారింది
అని
అనురాగ్,
శరత్
అన్నారు.

ఆర్మీలో చేరుతామని మెసేజ్
ామేజర్
సినిమా
చూసిన
తర్వాత
యువత
నుంచి
మంచి
స్పందన
వస్తున్నది.
చాలా
మంది
మేము
కూడా
ఆర్మీలో
చేరుతామని
మెసేజ్
చేస్తున్నారు.
ఈ
సినిమా
అందర్ని
కదలిస్తున్నది.
దేశం
కోసం
పనిచేయాలనే
స్పూర్తిని
ఈ
సినిమా
కలగజేసింది.
అలాంటి
సినిమాను
మేము
నిర్మించడం
ఇంకా
హ్యాపీగా
ఉంది
అని
అనురాగ్,
శరత్
చెప్పారు.

మా పిల్లలు కోరితే ఆర్మీలోకి
మేజర్
లాంటి
సినిమాను
నిర్మించిన
తర్వాత
మాకు
బాధ్యత
మరింత
పెరిగింది.
ఒకవేళ
మా
పిల్లలు
ఆర్మీలో
చేరుతామంటే
సంతోషంగా
ఎంకరేజ్
చేస్తాం.
మా
పిల్లల
ఇష్టాలకు
వ్యతిరేకంగా
వ్యవహరించం.
మా
అబ్బాయి
చూసిన
సినిమా
మేజర్.
మా
అబ్బాయి
పెరిగిన
తర్వాత
మేజర్
సినిమాను
మా
నాన్న
తీశాడని
గర్వంగా
పడేంతగా
వర్క్
చేశాం
అని
అనురాగ్
రెడ్డి
అన్నారు.

రాయల్టీ ఇస్తామని చెబితే..
మేజర్
సినిమా
తీయాలని
అనుకొన్నప్పుడు
సందీప్
ఉన్నికృష్ణన్
తల్లిదండ్రులను
కలిశాం.
సినిమా
గురించి
చెబుతూ
మా
సినిమా
బిజినెస్‌లో
ఎంతో
కొంత
రాయల్టీగా
ఇస్తాం
అని
ప్రపోజల్
పెట్టాం.
ఆ
మాట
వినగానే..
గెట్
అవుట్
అంటూ
గట్టిగా
అరిచారు.
మేజర్
సందీప్
ఉన్నికృష్ణన్
జీవిత
కథకు
సంబంధించిన
రైట్స్
ఇచ్చారు.
మేము
ఎంతో
కొంత
ఇస్తాం
అని
అంటే..
ఫౌండేషన్
కోసం
ఫండ్
ఇస్తామని
అంటే..
ఇంకోసారి
అలాంటి
ప్రపోజల్
మా
ముందు
పెడితే..
చెప్పుతో
కొడుతా
అని
సందీప్
ఉన్నికృష్ణన్
తండ్రి
అన్నారు,

మేజర్ తల్లిదండ్రులు ఎంత గొప్పవారంటే?
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం తర్వాత ఆయన పేరు మీద వచ్చిన ఎల్ఐసీ డబ్బులు కూడా తీసుకోలేదు. వారి ఫ్యామిలీ మెంబర్స్‌కు పంచిపెట్టారు. అలాంటి గొప్ప భావాలు, ఉన్నత సంస్కారం ఉన్న తల్లిదండ్రులు వారు. అందుకే మేము ఓ నిర్ణయం తీసుకొన్నాం. ఆర్మీలో చేరాలనుకొనే వారికి ఆర్థిక సహాయం అందించాలని అనుకొంటున్నాం. దాని గురించి శేష్‌తో కలిసి ఓ ప్లాన్ చేస్తున్నాం అని శరత్ చెప్పారు.