మిరాయ్‌తో మనోజ్‌కు భారీ హిట్.. మోహన్ బాబు రియాక్షన్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు మంచు మనోజ్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు మంచు ఫ్యామిలీలో తండ్రి తగ్గ తనయుడు అని కూడా అనిపించుకున్నారు. ఇక మనోజ్ తండ్రి బాటలోనే పయనిస్తూ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
కానీ మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా తండ్రి మంచు మోహన్ బాబుకు మంచు మనోజ్ కాస్తా దూరమయ్యారు. ఇక ఈ కుటుంబం మళ్లీ ఎప్పుడు కలుస్తుందా? అని మంచు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, కుటుంబ కలహాల తర్వాత మనోజ్ ప్రస్తుతం ఫుల్ గా తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టారు. భైరవంతో తిరిగి కంబ్యాక్ ఇచ్చారు. తన మాస్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక తాజాగా సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ మిరాయ్ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు.

తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన మిరాయ్ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా అలరించారు. ఆయన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. మంచు మనోజ్ ను ఇలానే చూడాలని అనుకుంటున్నట్టు అభిమానులు చెప్పుకొచ్చారు. కాగా మిరాయ్ సక్సెస్ తర్వాత మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు. అక్కడ మంచు లక్ష్మి చిత్రం రక్ష సినిమా ప్రమోషన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిరాయ్ చిత్రంపై మోహన్ బాబు ఎలా స్పందించారనే దానిపై మాట్లాడారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ మిరాయ్ చిత్రం సక్సెస్ తర్వాత అమ్మ గారి ఆశీస్సులు తీసుకున్నాను. మా నాన్న గారి ఆశీస్సులు కూడా అందాయి. 100 శాతం ఆయన ఆశీస్సులతోనే ఈ సక్సెస్ అందుకున్నాను. ఇక నెక్ట్స్ నా నుంచి హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. డేవిడ్ రెడ్డి, రక్షక్ అనే చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించేందుకు ప్రయత్నిస్తాను.. అని మనోజ్ చెప్పుకొచ్చారు.
ఇక మిరాయ్ చిత్రం సక్సెస్ సందర్బంగా మంచు విష్ణు కూడా టీమ్ తోపాటు మనోజ్ ను కూడా ప్రశంసించడం ఆనందకరంగా మారింది. ఇదే సమయంలో కుటుంబం మొత్తం కూడా కలిసిపోతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు అక్క మంచు లక్ష్మి మిరాయ్ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించింది. నా తమ్ముడు నటించిన పాత్ర మహావీర్ లామాను ఎదుర్కోవడానికి ఏకంగా రాముడే రావడం ఆ సన్నివేశం నాకు ఎంతో బాగా అనిపించింది.. అంటూ చెప్పుకొచ్చింది. మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసిన సూపర్ హిట్ టాక్ ను కంటిన్యూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











