అలా మాటలు చెప్పి.. రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతలు.. బయటపెట్టిన మీనా
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నటి మీనా దక్షిణాది సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగు, తమిళం, మలయాళం, ఇతర భాషల్లో అగ్ర హీరోల సరసన నటించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకొని నటనకు బ్రేక్ ఇచ్చింది. అయితే తన భర్త చనిపోవడానికి ముందు నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా హీరో జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు హాజరైన ఆమె తన అనుభవాలను ఆసక్తికరంగా వెల్లడించారు. ఆమె చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాల్లోకి వెళితే..
నేను బాలనటిగా కృష్ణ, రజనీకాంత్ లాంటి హీరోలతో నటించాను. అయితే బాలనటిగా ఉన్నప్పుడే దర్శకుడు క్రాంతి కుమార్ నాలోని టాలెంట్‌ను గుర్తించి.. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. లెజెండరీ డైరెక్టర్ విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణకు కూతురుగా నటించాను. అదే హీరోతో హీరోయిన్‌గా చేయమని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కృష్ణ గారి పక్కన హీరోగా అనే సరికి కొంత తటపటాయించాను. అలాగే రజనీకాంత్ కూతురిగా నటించిన తానే.. ఆయన పక్కన హీరోయిన్‌గా కూడా చేశాను అని మీనా చెప్పారు.

మీనాతో జగపతి బాబు మాట్లాడుతూ.. జగన్నాటకం సినిమాకు ముందు నాకు హిట్ సినిమాలు లేవు. మీతో కలిసి నటించిన తర్వాత నాకు తొలి హిట్ వచ్చింది. చాలా మంది హీరోలకు హిట్ లేని సమయంలో మీతో కలిసి నటించి హిట్లు కొట్టారు. ఆ విషయాన్ని మీరు గ్రహించారా? అని అడిగితే.. అవును.. నేను హీరోయిన్‌గా నటించిన పలువురు స్టార్ హీరోల సినిమాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. చాలా మందికి నేను లక్కీ హీరోయిన్ అని చెప్పుకొంటారు అని మీనా అన్నారు.
స్టార్ హీరోల ఫ్లాప్ కండిషన్ గురించి చెబుతూ.. చాలా మంది నిర్మాతల నా వద్దకు వచ్చి.. ఫలానా హీరోకు హిట్స్ లేవు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీస్తున్నాం. రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గించుకోవాలని చెప్పారు. నాతో సినిమాలు చేసిన హీరోలు హిట్స్ కొట్టిన తర్వాత నా గురించి పట్టించుకొన్న వాళ్లే లేరు. కానీ మీరు మాత్రం నా గురించి బాగా ఆలోచించే వారు అని జగపతిబాబుపై మీనా ప్రశంసల వర్షం కురిపించారు.
సినిమా సెట్‌కు వస్తే.. ఎవరినీ పట్టించుకొనే దానిని కాదు. నా డైలాగ్స్, మేకప్, నా క్యారెక్టర్ గురించి ఆలోచించే దానిని. ఒకే రోజు చాలా స్టూడియోలలో పనిచేసే దానిని. ఒక స్టూడియోలో హాఫ్ డే, మరో స్టూడియోలో రెండు గుంటలు పనిచేసే దానిని. అలా రోజంతా రకరకాల షిప్టులతో పనిచేసే దానిని. అయితే తాను బిజీగా ఉంటే.. నా తల్లి అన్నీ చక్కగా చూసుకొనేది. ఆమె చాలా స్ట్రిక్టుగా ఉండేది అని చెప్పారు.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే.... పెళ్లి చేసుకొన్నాను. మ్యారేజ్ తర్వాత కెరీర్ ఆగిపోతుందని అనుకొన్నాను. కానీ దృశ్యం సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నా కూతురుకు రెండేళ్లు. ఆ సినిమా వద్దని అనుకొన్నాను. కానీ మీ కోసమే క్యారెక్టర్ రాశామని చెబితే కన్విన్స్ అయ్యాను. అలా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను అని మీనా తెలిపారు.


Click it and Unblock the Notifications











