For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Madhubala Biopicలో నటించాలని ఉంది.. మారుతి డిజైన్ చేసిన పాత్ర సూపర్.. మంచి రోజులు వచ్చాయంటూ మెహ్రీన్

  |

  టాలీవుడ్‌లో అందం, అభినయంతో మెప్పించే హీరోయిన్లలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు. తన తొలి చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమకథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో గ్లామర్ తారగానే కాకుండా నటిగా కూడా రుజువు చేసుకొనే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో కరోనాబారిన పడటంతో కాస్త కెరీర్ జోష్ తగ్గినట్టు కనిపించినా.. దానిని సవరించుకొని.. ప్రస్తుతం మంచి రోజులు వచ్చాయి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫిల్మీబీట్‌తో మెహ్రీన్ మాట్లాడుతూ..

  మారుతి ఫోన్ చేస్తే రెండు రోజుల్లోనే షూటింగుకు..

  మారుతి ఫోన్ చేస్తే రెండు రోజుల్లోనే షూటింగుకు..

  మంచి రోజులు వచ్చాయి మంచి స్క్రిప్ట్. ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన సబ్జెక్ట్. నాకు కరోనావైరస్ వచ్చి తగ్గి కోలుకొంటున్న సమయంలో దర్శకుడు మారుతి గారు కాల్ చేశారు. జూన్ 3వ తేదీన కాల్ చేశారు. జూన్ 5వ తేదీన నేను సెట్‌కు వచ్చాను. మారుతి, యూవీ క్రియేషన్స్‌‌పై నమ్మకం ఉండటంతో కథ వినకుండానే సెట్స్‌పైకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు పద్దూ (పద్మ). మారుతి చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చింది. తండ్రి, కూతురు మధ్య రిలేషన్. బాయ్‌ఫ్రెండ్‌తో ఉండే రిలేషన్ లాంటి అంశాలు సినిమాకు బలంగా ఉంటాయ. నా కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. మారుతి స్టైల్‌లో మంచి వినోదం ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులకు వ్యాక్సిన్ లాంటిది అని మెహ్రీన్ అన్నారు.

  కామెడీ అంటే నాకు చాలా ఇష్టం

  కామెడీ అంటే నాకు చాలా ఇష్టం

  ఇది కేవలం ఓ తండ్రి, కూతురు, బాయ్‌ఫ్రెండ్‌కు సంబంధించిన కథ కాదు. కరోనావైరస్ సమయంలో ప్రతీ ఇంటిలో జరిగిన కొన్ని అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకుడు తప్పకుండా మంచిగా ఫీల్ అవుతాడు. ఎఫ్3 సినిమా తర్వాత నాకు కామెడీ, హ్యుమర్ పరంగా మంచి పాత్ర. ఈ సినిమాలో హెల్తీ కామెడీ ఉంటుంది. బేసిగ్గా నేను కామెడీ పర్సన్ కావడంతో నా పాత్ర పరిధి మేరకు నేను మంచి కామెడీ పండించాను. నాకు కామెడీ చేయడం అంత కష్టం కాదు. కేవలం 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం అని మెహ్రీన్ చెప్పారు.

  హీరో శోభన్‌తో నా కెమిస్ట్రీ ఎలా అంటే..

  హీరో శోభన్‌తో నా కెమిస్ట్రీ ఎలా అంటే..

  హీరో శోభన్ టాలెంటెడ్ యాక్టర్. ఇద్దరికి మంచి జోడి కుదిరింది. షూటింగు సమయంలో మంచి కెమిస్ట్రీ మా మధ్య కనిపించింది. అదే తెర మీద అద్బుతంగా పండింది. శోభన్ ప్రతీ రోజు ఏదో ఒకటి నేర్చుకొనే నిత్య విద్యార్థి. మారుతి డిజైన్ చేసిన క్యారెక్టర్ల ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొంటాయి. నా కెరీర్‌లో అదృష్టంగా భావించాల్సిన విషయం ఏమిటంటే.. కేవలం డ్యాన్సులు, పాటలకు పరిమతయ్యే పాత్రలు లభించలేదు. కృష్ణగాడి ప్రేమకథ, రాజా ది గ్రేట్, ఎఫ్‌2 చిత్రాల్లో ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు లభించాయి అని మెహ్రీన్ పేర్కొన్నారు.

  బరువు ఎందుకు తగ్గానంటే..

  బరువు ఎందుకు తగ్గానంటే..

  నేను అనుకోకుండా బరువు తగ్గాను. లాక్‌డౌన్‌లో చేసిన వర్కవుట్ కారణంగా వెయిట్ తగ్గించుకొన్నాను. మంచి రోజులు వచ్చాయి చిత్రం కోసం ప్రత్యేకంగా బరువు తగ్గించుకోలేదు. లాక్‌డౌన్‌లో ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదు. సాధారణంగా నేను చాలా ఎక్కువగా తింటాను. కానీ లాక్‌డౌన్‌లో తక్కువగా తిని.. కొన్ని వర్కవుట్లు చేశాను. దాంతో గణనీయంగా బరువు తగ్గింది అని మెహ్రీన్ అన్నారు.

  నేను మంచి క్రిటిక్‌ను అంటూ

  నేను మంచి క్రిటిక్‌ను అంటూ

  జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ ఒక భాగం. నాలోని లోపాలను సరిదిద్దుకొనే విధంగా నాకు నేను మంచి క్రిటిక్‌ను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొంటున్నాను. నెగిటివిటి అనేది ఎదుటి వ్యక్తులు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించాలి అని మెహ్రీన్ చెప్పారు.

  Recommended Video

  Comedian Sudarshan About Manchi Rojulochaie | Santosh Shobhan | Part 03
  మధుబాల బయోపిక్‌లో నటించాలని ఉంది

  మధుబాల బయోపిక్‌లో నటించాలని ఉంది

  నాకు బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు ఏదైనా అవకాశం వస్తే బాలీవుడ్ లెజెండ్ మధుబాల బయోపిక్‌లో నటించాలని ఉంది. మధుబాల మాదిరిగా నేను కనిపిస్తానని చాలా మంది అంటుంటారు. నేను కూడా నా ఫోన్‌లో మధుబాల కవర్ పిక్ పెట్టుకొంటాను. సమంత, కీర్తి సురేష్ మాదిరిగా నాకు బయోపిక్స్‌లో నటించాలని ఉంది అని మెహ్రీన్ ఫిర్జాదా చెప్పారు.

  English summary
  Manchi Rojulochaie is a romantic entertainer movie directed by Maruthi and jointly produced by V Celluloid banner and SKN. The movie casts Santosh Shobhan and Mehreen Pirzada in the main lead role while Anup Rubens scored music for this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X