Like Share & Subscribe చిరంజీవి రూపంలో అలాంటి అద్బుతం.. మేర్లపాక గాంధీ (ఇంటర్వ్యూ)
యువ హీరో సంతోష్ శోభన్, వినోదం, ఎమోషన్స్‌తో సినిమాల అందిస్తున్న దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం Like Share & Share. శ్యామ్ సింగరాయ్ లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించిన నిర్మాత వెంకట్ బోయనపల్లి తన సొంత బ్యానర్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, ఆముక్త క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ మీడియాతో మాట్లాడుతూ..

లాక్‌డౌన్ సమయంలో తట్టిన ఐడియా
Like Share Subscribe సినిమా కథ ఐడియా లాక్‌డౌన్ సమయంలో వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో మొబైల్ యూజర్లు ఎక్కువగా యూట్యూబ్ కంటెంట్‌కు అలవాటు పడ్డారు. అందరి మాదిరిగానే నాకు చాలా సమయం ఉండటంతో నేను కూడా యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. దేశంలోని పలు ప్రదేశాలు, వాటి చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాంతో యూట్యూబర్ లైఫ్ కోణంలో కథ చెప్పాలని అనుకొన్నాను అని మేర్లపాక గాంధీ తెలిపారు.

సినిమా లాఫింగ్ రైడ్‌లా
Like Share Subscribe సినిమా కామన్ ఆడియెన్స్‌కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా స్టోరి హిలేరియస్‌గా ఉంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేయడం అంత సులభం కాదు. చాలా ప్రమాదకరమైన జాబ్. ఈ సినిమా తొలి ఫ్రేమ్ నుంచి చివరి ప్రేమ్ వరకు ఒక లాఫింగ్ రైడ్‌లా ఉంటుంది. సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా ఉంటుంది అని మేర్లపాక గాంధీ తెలిపారు.

ఫరియా, శోభన్ కెమిస్ట్రీ సూపర్‌గా
సంతోష్ శోభన్‌తో ఏక్ మినీ కథ చేశాను. అతడి ఫెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అందుకే Like Share Subscribe కథను సంతోష్ శోభన్‌కు కథ చెప్పాను. యూట్యూబర్‌కు కావాల్సిన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూబ్ కచ్చితంగా సూట్ అయింది. జాతిరత్నాలు సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా మా సినిమాీలో నటించింది. ఫరియా నేచురల్ యాక్టింగ్ అందర్నీ ఆకట్టుకొంటుంది. ఫరియా, శోభన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది అని మేర్లపాక గాంధీ అన్నారు.

బ్రహ్మాజీ, సుదర్శన్ కామెడీ గురించి
Like Share Subscribe చిత్రంలో సుదర్శన్, బ్రహ్మజీ క్యారెక్టర్లు ఫన్నీగా ఉంటాయి. ఈ చిత్రంలో పీపీఎఫ్ గ్యాంగ్ ఉంటుంది. సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డీవోపీగా పనిచేస్తుంటాడు. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ అద్బుతంగా చేసిన క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మాజీ, సుదర్శన్ రోల్స్ సినిమా మొత్తం ఉంటాయి. సరదా సాగిపోయే హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు అని మేర్లపాక గాంధీ అన్నారు.

చిరంజీవితో అద్భుతం జరిగింది..
వాల్తేరు వీరయ్య సినిమా టీజర్‌లో చిరంజీవి చెప్పిన లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ డైలాగ్ మా సినిమాకు బాగా ప్రమోషన్ అయింది. టీజర్‌లో చిరంజీవి డైలాగ్ చెప్పగానే మాకు ట్యాగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఏదో అద్బుతం జరగాలని చూస్తున్న సమయంలో చిరంజీవి రూపంలో మాకు అద్బుతం కలిసి వచ్చింది అని మేర్లపాక గాంధీ అన్నారు.


Click it and Unblock the Notifications











