For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పవన్‌తో విబేధాలు లేవు.. ఆయనతో గ్యారంటీగా సినిమా చేస్తాం.. ఆ వార్తల్లో నిజం లేదు’

  |

  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పేరు గుర్తొస్తే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తోస్తాయి. కథ, కథనాలు, క్వాలిటీ విషయంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి రాజీ పడని మసస్తత్వమని చెప్పుకొంటారు. వారి తీసిన సినిమాలు కూడా అదే తెరపైన చెప్పాయి. టాలీవుడ్‌కు మూడు భారీ హిట్లు ఇచ్చిన నిర్మాత త్రయం ప్రస్తుతం సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకొన్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి చెప్పిన విషయాలు వారి మాటల్లోనే..

  పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫాన్స్ కోరిక మేరకు!

  మాది 30 ఏళ్ల అనుబంధం

  మాది 30 ఏళ్ల అనుబంధం

  సుమారు 30 ఏళ్ల నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఒకే బ్యాచ్. విజయవాడ‌కు చెందిన వాళ్లం. మాకు సినిమాలు చూడటమే ఎంటర్‌టైన్‌మెంట్. సినీ నిర్మాణంలోకి రావడానికి ముందు మాకు సినిమా చూసిన అనుభవమే ఉంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌కు మా మైత్రిబంధం బలమైన పునాది. కథలు వినడం ముగ్గురం వింటాం. ముగ్గురం క్లారిటీగా చర్చించుకొన్న తర్వాతే అంగీకారానికి వస్తాం.

  ఒకే నెలలో రెండు చిత్రాలు

  ఒకే నెలలో రెండు చిత్రాలు

  మైత్రీ మూవీస్ బ్యానర్‌ నుంచి నవంబర్‌లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీపావళీ పండుగ ఓ కారణం ఒకటి కాగా, నవంబర్, డిసెంబర్‌లో చాలా సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. అందుచేత నవంబర్‌లోనే రెండు సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం.

  సవ్యసాచి ఎలా మొదలైందంటే

  సవ్యసాచి ఎలా మొదలైందంటే

  గత సెప్టెంబర్లో దర్శకుడు చందు మొండేటి కథ చెప్పారు. కథ వినగానే మరో మాట లేకుండా సినిమాను చేయాలని అనుకొన్నాం. నవంబర్‌లో సినిమా ప్రారంభించాం. ఈ కథపై నాగచైతన్య, చందు అంతకుముందు నుంచే ట్రావెల్ అవుతున్నారు. దర్శకుడు మొదటి నుంచి మాధవన్‌ను తీసుకుందామని అనుకొన్నారు. మాధవన్‌ను అడిగిన వెంటనే ఒప్పుకోన్నారు. దాంతో మాకు ఈ సినిమా రూపొందించడం సులభమైంది.

  క్వాలిటీ విషయంలో రాజీ లేదు

  క్వాలిటీ విషయంలో రాజీ లేదు

  సవ్యసాచి సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. అయితే బడ్జెట్ పరిమితి కూడా మించిపోకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం. మార్కెట్ పరిధిలోనే బిజినెస్ ప్లాన్ చేశాం. నాగచైతన్య మార్కెట్‌కు లోబడి మాత్రమే ఈ సినిమా చేశాం. అంచనా కంటే బడ్జెట్ పెరిగిందనే వార్తలో వాస్తవం లేదు.

  మా విజయంలో దేవీ శ్రీ ప్రసాద్

  మా విజయంలో దేవీ శ్రీ ప్రసాద్

  సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోని, డియర్ కామ్రేడ్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం లేదు. గతంలో మా సినిమాలన్నింటికీ ఆయనే మ్యూజిక్ అందించే వారు. మా విజయాలకు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఓ కారణం. వచ్చే ఏడాది మా బ్యానర్‌లో వచ్చే నాలుగైదు సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్.

  ప్రస్తుతం 14 సినిమాలు కమిట్..

  ప్రస్తుతం 14 సినిమాలు కమిట్..

  ప్రస్తుతం వరుసగా 14 సినిమాలు రూపొందించే విధంగా ప్లాన్ చేశాం. వచ్చే ఏడాది 5 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్‌తో సినిమాలు చేస్తాం. ఎలాగైనా పవన్ కల్యాణ్‌తో సినిమా ఉంటుంది. అది ఎన్నికల తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

  పవన్ కల్యాణ్ విషయంలో

  పవన్ కల్యాణ్ విషయంలో

  పవన్ కల్యాణ్ నుంచి అడ్వాన్సు వాపసు తీసుకొన్నామనే వార్తల్లో వాస్తవం లేదు. ఆయనతో ఎలాగైనా సినిమా ఉంటుంది. తమిళంలో విజయం సాధించిన తెరీ సినిమా అనుకొన్నాం. కానీ కుదర్లేదు. కథ గురించి మరోసారి వర్క్ చేస్తాం. అయితే రవితేజ‌తో తీసే సినిమా కోసం తెరీలోని కీలకమైన పాయింట్‌ను వాడుకొంటున్నాం.

  English summary
  Mythri Movie Makers Pvt. Ltd is an film production company established by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM) which mainly produces and distributes Telugu films. They have produced blockbusters like Srimantudu, Janata Garage, Rangasthalm. Now they coming with Savyasachi and Amar Akbar Anthony. In this connection, They spoke to Telugu filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X