For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవ్ స్టోరి క్లైమాక్స్‌పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య.. సినిమా చూసి నాగార్జున ఏమన్నారంటే?

  |

  లవ్ స్టోరి సినిమాకు సంబంధించి నాకు ఎలాంటి డౌట్ లేదు. తప్పకుండా హిట్ అవుతుంది. అయితే థియేటర్లలో ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు. థియేటర్లనకు ప్రేక్షకులు వస్తారా అనే విషయం కాస్త టెన్షన్‌గా ఉంది. అయితే మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బాగా రెస్పాండ్ అవుతున్నారనే విషయం ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇప్పటి వరకు మూడు రోజులు వరకు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. సోమవారం తర్వాత ఎలా ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటందో వేచి చూడాల్సి ఉంటుంది అని నాగ చైతన్య అన్నారు.

  రెండు ఎమోషనల్ పాయింట్స్

  రెండు ఎమోషనల్ పాయింట్స్

  లవ్ స్టోరి సినిమాలో శేఖర్ కమ్ముల రెండు కీలక, సెన్సిటివ్ విషయాలను చెప్పబోతున్నారు. కులం, లింగ భేదం అనే రెండు పాయింట్లు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ రెండు పాయింట్లు ఓపెన్‌గా మాట్లాడలంటే కష్టం. కానీ సినిమా ద్వారా మాట్లాడాలి..డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో లవ్ స్టోరిని శేఖర్ కమ్ముల తీశారు. చాలా రియలిస్టిక్ కథ. సినిమాటిక్‌గా ఎక్కడ కనిపించదు. రేవంత్, మౌనిక క్యారెక్టర్లు చాలా రియల్‌గా ఉంటాయి అని నాగచైతన్య అన్నారు.

  సాయి ధరమ్ తేజ్ కోసం కదిలిన చిరంజీవి: అతడు ఆస్పత్రిలో ఉండగా వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఇలా!

  సినిమా పరిశ్రమకు లవ్ స్టోరి అండగా

  సినిమా పరిశ్రమకు లవ్ స్టోరి అండగా

  లవ్ స్టోరి హిట్ అయితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. లాక్‌డౌన్ తర్వాత సినిమా పరిశ్రమ ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ పరిస్థితుల్లో లవ్ స్టోరి హిట్ కావాలని నేను కావాలని కోరుకొంటున్నాను. లవ్ స్టోరి అందర్నీ ఆకట్టుకొంటుంది. శేఖర్ కమ్ముల కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్ అయ్యాను.

  ఇలాంటి స్కూల్‌లో రూపొందించే సినిమాలంటే నాకు ఇష్టం. నాకు లవ్ స్టోరి, మజిలీ చిత్రాలతో కొత్త అనుభూతిని పొందాను. సాయి పల్లవికి సంబంధించిన ఓ సోషల్ ఇష్యూ గురించి శేఖర్ కమ్ముల చెప్పబోతున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి, అమ్మాయి గురించి హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఉంటాయి అని నాగచైతన్య తెలిపారు.

  తెలంగాణ యాస, భాష గురించి

  తెలంగాణ యాస, భాష గురించి

  తెలంగాణ యాస, భాషను నేర్చుకొనే విషయంలో శేఖర్ కమ్ముల, ఆయన టీమ్ నాకు సహకారం అందించారు. ఆర్మూర్, తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయడం వల్ల తెలంగాణ భాషను మాట్లాడే విషయాన్ని చూసి పట్టుకొన్నాను. సినిమా రిలీజ్ వాయిదాపడటంతో డబ్బింగ్‌కు చాలా సమయం లభించింది. దాంతో డబ్బింగ్ పరంగా క్వాలిటీని మెరుగుపరుచుకొన్నాను అని నాగ చైతన్య చెప్పారు.

  నాగార్జున గారు సినిమా చూసి ఏమన్నారంటే

  నాగార్జున గారు సినిమా చూసి ఏమన్నారంటే

  లవ్ స్టోరి సినిమాను నేను చూశాను. మా నాన్న గారు కూడా చూశారు. ఆయన సినిమా చూసిన తర్వాత చాలా హ్యపీగా ఫీలయ్యారు. ఈ సినిమా మ్యూజిక్ పరంగా ప్రేక్షకులకు దగ్గర కావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని పాటలు కూడా బాగా పాపులర్ కావడంతో అంచనాలు పెరిగాయి. థియేటర్‌కు వెళ్లి అందరూ చూడాల్సిన సినిమా. నేను ఎప్పుడు సినిమా చూడమని చెప్పలేదు. లవ్ స్టోరి విషయంలో అలాంటి ఫీలింగ్ కలిగింది అని నాగ చైతన్య అన్నారు.

   లవ్ స్టోరి క్లైమాక్స్ ఎలా ఉందంటే..

  లవ్ స్టోరి క్లైమాక్స్ ఎలా ఉందంటే..

  లవ్ స్టోరి సినిమాకు రెండు క్లైమాక్స్‌‌లు చిత్రీకరించారన్న విషయంలో వాస్తవం లేదు. ఒకటే క్లైమాక్స్ షూట్ చేశాం. లాక్‌డౌన్ వల్ల మా సినిమా షూటింగ్ ఆగిపోవడం, అలాగే కొంత బెటర్‌గా చేయాలని క్లైమాక్స్‌ను మళ్లీ షూట్ చేశాం. అంతేగానీ రెండు క్లైమాక్సులు షూట్ చేశామనేది అబద్ధం. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనే విశ్వాసం టీమ్ మొత్తానికి ఉంది అని నాగాచైతన్య తెలిపారు.

  English summary
  Tollywood actor Naga Chaitanya about Love Story movie and Climax. He says Shekhar Kammula made this movie with honest. Love story deals with Cast and Gender issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X