Naga Vamshi interview నేను స్వాతిముత్యం.. ఆణిముత్యాన్ని కాదు.. పెద్ద వెధవను అంటూ షాకింగ్ కామెంట్

భీష్మ, భీమ్లా నాయక్, డీజే టిల్లు లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన సితారా ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ సూర్యదేవర నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ లక్ష్మణ్ కే కృష్ణ రూపొందించిన ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ జంటగా నటించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..

వీర్యదానం కథతో స్వాతిముత్యం

వీర్యదానం కథతో స్వాతిముత్యం


వీర్యదానం అనే కాన్సెప్ట్‌తో స్వాతిముత్యం సినిమా ఉంటుంది. గతంలో సుమంత్ ఇదే కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా మందికి రీచ్ కాలేదు. హిందీలో వికీ డోనర్ అనే సినిమా వచ్చి హిట్ అయింది. తెలుగులో అంతగా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొత్త హీరో, కొత్త డైరెక్టర్‌తో రిస్క్ చేయలేదు. కథ కొత్తగా ఉంది. డైరెక్టర్ చెప్పిన కథకు చిన్న చిన్న మార్పులు చేసి సినిమామ చేశాం. తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. ఇలా చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అని నాగవంశీ తెలిపారు.

చిరంజీవి, నాగార్జున సినిమాలతో

చిరంజీవి, నాగార్జున సినిమాలతో


చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాకు పోటీగా స్వాతిముత్యం సినిమాను రిలీజ్ చేయడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. దసరా పండుగకు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేసినా ప్రేక్షకుల రీచ్ ఉంటుంది. అందుకే కొంత రిస్క్ తీసుకొని పెద్ద సినిమాలతో వస్తున్నాం. చిన్న, పెద్ద సినిమాలను ఆదరించాలని చిరంజీవి చెప్పారు. అందుకే ఆయన ఈ ఇండస్ట్రీకి పెద్ద అని అందరూ భావిస్తారు. అందుకే ఆయన చిరంజీవి అయ్యారు అని నాగవంశీ చెప్పారు.

టైటిల్‌కు తగినట్టే స్వాతిముత్యం కథ

టైటిల్‌కు తగినట్టే స్వాతిముత్యం కథ


తెలుగు సినిమా పరిశ్రమలో కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబినేషన్‌లో వచ్చిన స్వాతిముత్యం కల్ట్ క్లాసిక్. అలాంటి సినిమాను పెట్టడం ద్వారా చర్చ జరుగుతుందని తెలుసు. ఈ కథలో హీరో అమాయకుడు. మంచివాడు. ఈ జనరేషన్‌కు తగినట్టు ఉండే వ్యక్తి కాదు. కాబట్టి ఈ సినిమాకు స్వాతిముత్యం టైటిల్ కరెక్ట్ అనుకొన్నాం. సినిమా చూసిన తర్వాత మాకు ఈ టైటిల్ కరెక్ట్ అని ఫీలయ్యాం. అదే కరెక్ట్ అని ప్రేక్షకులు భావిస్తారనే నమ్మకం ఉంది అని నిర్మాత నాగవంశీ చెప్పారు.

 స్వాతిముత్యం పక్కా ఫ్యామిలీ మూవీ

స్వాతిముత్యం పక్కా ఫ్యామిలీ మూవీ


తెలుగు సినిమా పరిశ్రమలో కోవిడ్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాలేదు. RRR, బింబిసార, సీతారామం, కార్తీకేయ2 లాంటి చిత్రాలు కొంత సీరియస్ చిత్రాలు. వీర్యదానం కథతో ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీశాం. ఈ పాయింట్‌ను థియేటర్‌లో చూపిస్తే థ్రిల్ అవుతారని టీజర్, ట్రైలర్‌లో చూపించలేదు. వీర్యదానం అనే పాయింట్‌లో దాచేందుకు ఏమీలేదు. థియేటర్‌లో సర్‌ప్రైజ్ చేద్దామని విషయాన్ని దాచిపెట్టాం. ఈ పాయింట్ థియేటర్లో మహిళలు చేసినా ఎలాంటి ఇబ్బందు పడరు. అశ్లీల, అసభ్యత ఉండదు అని నాగవంశీ చెప్పారు.

 హ్యాపీగా నవ్వుకొని ప్రేక్షకుడి బయటకు వచ్చే సినిమా

హ్యాపీగా నవ్వుకొని ప్రేక్షకుడి బయటకు వచ్చే సినిమా


నేను నా వ్యక్తిగత జీవితంలో స్వాతిముత్యంను కాదు.. ఆణిముత్యంను కాదు. నా జీవితంలో పెద్ద వెధవను. అందరూ అనుకొనే విధంగా నేను అమాయకుడిని కాదు. మంచివాడిని కాదు. జనాలకు సినిమా వాళ్ల మంచి వాళ్లు కాదు అనే అభిప్రాయం ఉంటుంది. అందుకు తగినట్టుగానే నా బిహేవియర్ ఉంటుంది. ఇక స్వాతిముత్యం చిత్రం వినోదంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. థియేటర్‌లో కూర్చొని నవ్వుతూనే బయటకు వస్తారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో తీశాం. అలాగని నేను ఆణిముత్యం లాంటి సినిమాను అద్బుతంగా తీశానని, చేశానని చెప్పాను అని నాగవంశీ అన్నారు.

 దర్శకుడికి మంచి పేరు వస్తుంది అంటూ

దర్శకుడికి మంచి పేరు వస్తుంది అంటూ


స్వాతిముత్యం సినిమా కథను చెప్పినట్టుగానే దర్శకుడు బాగా డీల్ చేశాడు. మంచి కాన్సెప్ట్ సినిమా తీశాడనే పేరు దర్శకుడికి వస్తుంది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. డీజే టిల్లు నుంచి మా బ్యానర్‌లో ప్రయోగాత్మక చిత్రాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మాణం కొనసాగుతూనే ఉంది. మంచి కథ దొరికితే.. పెద్ద హీరోనా? చిన్నహీరోనా అనే చూడటం లేదు. మా సినిమాలు కమర్షియల్‌గా, ప్రేక్షకులను మెప్పించేలా ఉండటం మాకు సంతృప్తికరంగా ఉంది అని నాగవంశీ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X