ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు బతకడం ఎలా?.. అలా పెంచడం తప్పే.. టికెట్ రేట్ల పెంపుపై నాని ఘాటైన వ్యాఖ్యలు

దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేయడానికి కారణం ఏమిటంటే?.. లీడింగ్, టాప్ డైరెక్టర్లతో కాకుండా యంగ్ డైరెక్టర్లతో ఎందుకు పనిచేస్తారని అందరూ అడుగుతుంటారు. కానీ అల్రెడీ టాప్ డైరెక్టర్లతో కాకుండా ఫ్యూచర్‌లో టాప్ డైరెక్టర్లు అవుతారనే ఉద్దేశంతో పనిచేస్తాను. ఎందుకంటే వారి జర్నీలో నేను ఉంటాననే ఒక స్వార్ధం కూడా నాలో ఉండటంతోనే.. ఒక సినిమా, రెండు సినిమాలు హిట్ ఇచ్చిన డైరెక్టర్లతో పనిచేయాలని అనుకొంటాను. వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే.. కథ చెప్పడంలో అతడిది ప్రత్యేకమైన స్టయిల్ అని నాని అన్నారు. తాజాగా జూన్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న అంటే సుందరానికి సినిమా గురించి నాని మాట్లాడుతూ..

 యువ టాలెంట్‌పై నాకు నమ్మకం

యువ టాలెంట్‌పై నాకు నమ్మకం

కొత్తవాళ్లపై, టాలెంటెడ్ దర్శకులతో పనిచేయడం నాకు ఇష్టం. ఎందుకంటే.. నేను ఎవరో తెలియని సమయంలో నన్ను నమ్మి నాతో సినిమాలు తీసిన వాళ్లు ఉన్నారు కదా.. అందుకే ఒకరిని నమ్మి సినిమాలు తీయడం నాకు చాలా ఇష్టం. నన్ను కొందరు నమ్మడం వల్లనే నేను నిరూపించుకొన్నాను. నేను నమ్మడం వల్ల యువ దర్శకులు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొంటారనే నా బలమైన నమ్మకం అని నాని చెప్పారు.

బ్రహ్మణ యువకుడి పాత్రలో

బ్రహ్మణ యువకుడి పాత్రలో

బ్రహ్మణ యువకుడి పాత్ర కోసం నేను పెద్దగా ట్రైనింగ్ గానీ, ఎక్స్‌ట్రా కసరత్తు చేయలేదు. బ్రహ్మణ క్యారెక్టర్ అంటే.. డైలాగ్ మాడ్యులేషన్ ఓ ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. కానీ అంటే సుందరానికి సినిమా విషయానికి వస్తే.. అలాంటి పెక్యులర్ డైలాగ్స్, మ్యాడ్యులేషన్ ఉండదు. పాత్రల మధ్య ప్రేక్షకుడు ఉండిపోయి.. ఆ పాత్రలను తమ కుటుంబ సభ్యులతో పోల్చుకొంటారు అని నాని చెప్పారు.

 మతాంతర వివాహం నేపథ్యంగా

మతాంతర వివాహం నేపథ్యంగా

మతాంతర వివాహం నేపథ్యంగా కథ సాగుతుంది. అయితే వివాదాస్పద అంశాలు అసలే ఉండవు. సీతాకోక చిలుక, మరో చరిత్ర సినిమాల ప్రభావం ఉండదు. అంటే సుందరానికి మూవీ ఓ డిఫరెంట్ లవ్ స్టోరి. ఫన్, ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. మీరు తెర మీద చూస్తే మీకు స్పష్టంగా మేము చేసిన ప్రయత్నం ఏమిటో కనిపిస్తుంది అని నాని అన్నారు.

హీరోయిన్‌గా నాజ్రియా ఎంపిక గురించి

హీరోయిన్‌గా నాజ్రియా ఎంపిక గురించి

అంటే సుందరానికి సినిమా కోసం నాజ్రియా లాంటి అమ్మాయి కోసం వెతికాం. ప్రతీ సందర్భంలోను నాజ్రియా పేరు చెప్పి ఎవరైతే బాగుంటుందని వెతికాం. ఓ దశలో నాజ్రియానే అయితే బాగుంటుంది కదా అని ఆమెకు కథ చెప్పాం. కథ విన్న వెంటనే ఆమె ఎగిరి గంతేసి సినిమా చేస్తున్నానని చెప్పారు. గతంలో ఎందరో సూపర్ స్టార్స్ ఆఫర్స్ ఇచ్చినా సినిమాలను ఒప్పుకోలేదు. అంటే సుందరానికి కథ, కంటెంట్ నచ్చి ఈ సినిమా చేసింది. ఫాహద్‌తో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు.. డైరెక్టుగా ఆమెతో మాట్లాడమని చెప్పారు అని నాని అన్నారు.

టికెట్ రేట్లు పెంచమని అడిగాం.. కానీ..

టికెట్ రేట్లు పెంచమని అడిగాం.. కానీ..

శ్యామ్ సింగరాయ్ సినిమా సమయంలో టికెట్ రేట్లు పెంచమని అడిగింది నిజమే. కానీ 5, 10 రూపాయలు కాకుండా కొంచెం పెంచమని రిక్వెస్ట్ చేశాం. కానీ 400, 500 టికెట్ రేటు పెట్టమని ఎన్నడూ అడగలేదు. మేము ఎలాంటి సందర్భంలో, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. టికెట్ రేట్లు పెంపు గురించి నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కానీ శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ సమయంలో నేను చెప్పిన విషయం ఒకటి.. ఇప్పుడు దానిని ఆపాదించుకొంటున్న విషయం మరొకటి అని నాని అన్నారు.

 RRR మూవీకి ఒకే.. కానీ ఇతర సినిమాలకే..

RRR మూవీకి ఒకే.. కానీ ఇతర సినిమాలకే..

సోషల్ మీడియాలో చాలా మంది సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. 50, 80, 100 రూపాయల టికెట్ ధర లేకపోతే.. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు బతికే పరిస్థితి లేదు. అందు కోసమే 5, 10, 50 టికెట్ రేట్లను కాస్త పెంచమని చెప్పాను. అలాంటి సందర్భాన్ని చెప్పకుండా.. ఏదేదో సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తగదు. నేను బేసిక్ ప్రైస్ గురించి మాట్లాడాను. RRR సినిమాకు తప్పితే.. మిగితా సినిమాలకు పెంచడం తప్పే అని నాని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X