OG: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలా మారిపోయాడు.. ప్రియాంక అరుళ్ మోహన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG) గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు.
సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ సందర్భంగా ప్రియాంక అరుళ్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ..

ఓజీ మూవీ గురించి అనౌన్స్ మెంట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు నాకు ఈ కథ వినిపించారు. కథ నాకు చాలా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నేను పోషించిన కణ్మని పాత్ర చాలా నచ్చింది. పైగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. సుజీత్ గారు డైరెక్టర్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణం. ఇంతకంటే ఏం కావాలి ఈ సినిమా ఒప్పుకోవడానికి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓజీతో 2 ఏళ్ల ప్రయాణం జరిగింది. నా కెరీర్‌లో మరిచిపోలేనటువంటిది. ఈ సినిమాలో పవన్ సార్‌తో నటించడం ఒక వరం. కణ్మని పాత్రకు నా జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. పవన్ సార్‌తో వర్క్ చేయడం.. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం వల్ల చాలా నేర్చుకొన్నాను. ఓజీకి ముందు నేను ఆయన గురించి చాలా విన్నాను. కానీ ఓజీ షూటింగులో చూసిన తర్వాత పక్కా జెంటిల్మన్ అనే ఫీలింగ్ కలిగింది. సెట్‌లో అందరిని సమానంగా చూడట నాకు బాగా నచ్చింది. ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా హీరోనే అని ప్రియాంక అరుళ్ మోహన్ తెలిపారు.
ఓజీ సినిమా 80 దశకంలో సాగే కథ. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాతో సాగే గ్యాంగ్‌స్టర్ స్టోరీ. ఈ సినిమాలో నేను అమాయకమైన యువతి పాత్రలో కనిపిస్తాను. గంభీర జీవితంలో కీలక పాత్ర. నా పాత్రకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంటుంది. ఈసినిమాలో పాటలు చాలా మాస్, ఎనర్జిటిక్‌తో ఉన్నాయి.
పవన్ కల్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో నాకు బెంగళూరులో ఉండగానే తెలిసింది. తెలుగు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఇంకాస్త తెలిసింది. ఓజీ సినిమా చేసేటప్పుడు సార్‌కు ఇంత క్రేజ్ ఉందా? అని తెలుసుకొన్నాను. షూటింగ్ గ్యాప్‌లో పుస్తకాలు, లిటరేచర్, సినిమాలు, పాలిటిక్స్, ప్రజల గురించి మాట్లాడుతారు. షూటింగ్ బ్రేక్‌లో మాతో కూర్చొని మాట్లాడటం ఆయన డౌన్ టూ ఎర్త్ అనే విషయం తెలిసింది. డిప్యూటీ సీఎం కాకముందు సెట్‌లో ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ బిజీగా ఉండేవారు. కానీ డీసీఎం అయిన తర్వాత చాలా రిలాక్స్‌గా, నవ్వుతూ కనిపించారు అని ప్రియాంక అరుళ్ మోహన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











