మిరాయ్‌లో ప్రభాస్ వాయిస్ ఫేక్.. స్పందించిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.. ఏమన్నారంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మిరాయ్ : సూపర్ యోధా. సైంటిఫిక్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, జపనీస్ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కడం విశేషం. ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మిరాయ్ చిత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది. త్వరలోనే లాభాల భాటలో పయనించే అవకాశమూ ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
థియేట్రికల్, బాక్సాఫీస్ సక్సెస్ ను అందుకుంటూ ఉన్న మిరాయ్ చిత్రంపై చిన్నపాటి తప్పుడు ప్రచారం ఒకటి మొదలైంది. మిరాయ్ చిత్రం ప్రారంభం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ వాయిస్ ఫేక్ అంటూ కొందరు ప్రచారం చేశారు. ప్రభాస్ వాయిస్ కు దగ్గరగా ఉండేలా AIలో క్రియేట్ చేశారంటూ న్యూస్ వైరల్ గా మారింది. తన వాయిస్ ను వాడుకునేందుకు ప్రభాస్ పర్మిషన్ ఇచ్చారంటూ ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై తాజాగా దర్శకుడు గౌతమ్ ఘట్టమనేని స్పందించారు.

మిరాయ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మిరాయ్ లో ప్రభాస్ సారే వాయిస్ చెప్పారు. ఇంట్రో చెప్పిందే ప్రభాస్ ఆయన. ప్రభాస్ సార్ స్వతహాగా చెప్పకుంటే అసలు వాయిస్ పెట్టే అవసరం ఉండదు. నేనే దగ్గరుండి ప్రభాస్ గారితో నీట్ గా డబ్బింగ్ చెప్పించాను. డబ్బింగ్ డిఫరెంట్ గా లేకపోవడానికి కారణం నేరేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. 1:30 నిమిషాయాల్లో లెన్తీ లైన్స్ చెప్పేయాలి. కొంచెం స్పీడ్ గా చెప్పేసరికి అలా అనిపించి ఉండొచ్చు. ప్రభాస్ సార్ తో స్పీడ్ గా డబ్బింగ్ చెప్పించడంతో పాటు అంతే వేగంగా విజువల్స్ కదులుతూ ఉంటాయి.
ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. స్టార్ హీరో అయినా మాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మిరాయ్ చిత్రంలో ప్రభాస్ వాయిస్ ఫేక్, AI జనరేటెడ్ అంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసినట్లైంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అక్టోబర్ మొదటి వారంలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా సంస్థ రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ఈ చిత్రంలో మహావీర్ లామా అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, స్టార్ నటుడు జయరామ్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. యంగ్ హీరోయిన్ రితికా నాయక్ తేజా సజ్జా సరసన నటించింది.


Click it and Unblock the Notifications











