For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. హంట్ మూవీ ఆఫర్ అలా.. ప్రేమిస్తే భరత్

  |

  నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం హంట్. మహేష్‌ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీకాంత్‌తోపాటు తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన మరోసారి హంట్‌తో వస్తున్నారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ..

  హంట్ సినిమాలో ఆఫర్ అలా

  హంట్ సినిమాలో ఆఫర్ అలా

  శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్, ప్రేమ కథా చిత్రం ప్రేమిస్తే, యువ సేన చిత్రాల తర్వాత నాకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. తమిళ సినిమాపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల మిగితా భాషల్లో చేయలేకపోయాను. ఆ తర్వాత తమిళ సినిమాలతోనే బిజీగా మారిపోయాను.

  దర్శకుడు మహేష్ సూరపనేని చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. తమిళంలో నేను నటించిన కాళిదాసు సినిమా చూసి దర్శకుడు మహేష్ నన్ను సంప్రదించారు. అది కాకుండా సుధీర్ బాబు, శ్రీకాంత్ నాకు బాగా తెలుసు. సీసీఎల్‌లో క్రికెట్ ఆడాం. దాంతో మా పరిచయం బాగా ఉంది. వారిద్దరితో సినిమా అనగానే ఒప్పేసుకొన్నాను అని భరత్ అన్నారు.

  హంట్ ఎమోషన్స్‌తో సాగే కథ

  హంట్ ఎమోషన్స్‌తో సాగే కథ


  హంట్ చిత్రం ఎమోషన్స్‌తో సాగే కథ. శ్రీకాంత్, సుధీర్, నా పాత్రల చుట్టూ తిరుగుతుంది. నేను ఈ చిత్రంలో ఆర్యన్ దేవ్ అనే పాత్రల ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించాను. హంట్ చిత్రంలో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. సుధీర్, నా క్యారెక్టర్ల మధ్య ఫ్రెండ్ షిప్, మా పాత్రల మధ్య భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి అని భరత్ తెలిపారు.

  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి

  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి


  సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయింది. నటుడిగా నా కెరీర్ చాలా హ్యాపీగా సాగుతున్నది. తమిళంలో నా కెరీర్ సంతృప్తికరంగా సాగుతుంది. ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. హిట్స్, ఫ్లాఫ్స్ అనే తేడా లేకుండా నా జర్నీ సాగుతున్నది. ప్రతీ మూవీని ఎంజాయ్ చేస్తూ నటుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అని భరత్ చెప్పారు.

  ఖర్చుకు వెనుకాడ కుండా

  ఖర్చుకు వెనుకాడ కుండా


  హంట్ సినిమా కథ మొత్తం హైదరాబాద్‌లో సాగుతుంది. కథ డిమాండ్ చేయడం వల్ల కొంత పార్ట్ పారిస్‌లో షూట్ చేశాం. కథకు తగినట్టుగా స్క్రీన్ ప్లేకు తగినట్టుగా యాక్షన్ సీన్లను దర్శకుడు బాగా డిజైన్ చేశారు. భవ్య క్రియేషన్స్, నిర్మాత ఆనంద ప్రసాద్ గారు ఖర్చుకు వెనుకాడలేదు. సినిమాను చాలా లావిష్‌గా, రిచ్‌గా తీశారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచాలనే తపన ఉన్న నిర్మాత ఆనంద ప్రసాద్ అని హీరో భరత్ చెప్పారు.

  రాజమౌళి దర్శకత్వంలో

  రాజమౌళి దర్శకత్వంలో


  తెలుగు సినిమా పరిశ్రమ మొదటి నుంచి అధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటాను. అవకాశం వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉంది. త్రివిక్రమ్, సుకుమార్.. వీళ్ల డైరెక్షనంటే బాగా ఇష్టం. అల్లు అర్జున్‌తో నటించాలనుంది. గంగోత్రి మూవీని అప్పట్లో రీమేక్‌లో నేను చేయాల్సింది. నటుడిగా ఆయనంటే నాకు చాలా ఇష్టం.

  English summary
  Nitro Star Sudheer Babu is coming with Hunt. Mahesh Surapaneni is the director. Bharath and Srikanth are in lead role. This movie is set to release on January 26th. Here is the Bharath Interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X