Allu Arjun అంటే అలాంటి క్రష్.. విజయ్ దేవరకొండ ఎలాంటి వాడంటే? ప్రియాంక జవాల్కర్ హాట్ కామెంట్స్

టాలీవుడ్‌లో లాక్‌డౌన్ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు ఠక్కున వచ్చే సమాధానం ప్రియాంక జవాల్కర్. తిమ్మరుసు, SR కల్యాణమండపం చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్‌గా మారారు. ఈ రెండు సినిమాలు విజయవంతమైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ గురించి, ఇష్టమైన హీరోల గురించి మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే..

టాక్సీవాలా తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే?

టాక్సీవాలా తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే?

టాక్సీవాలా తర్వాత గ్యాప్ రావడానికి మంచి సినిమా కోసం ఎదురు చూశాను. అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ సమయంలో నేను విన్న 25 కథల్లో నాకు బాగా నచ్చిన చిత్రం గమనం. గమనం సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. నేను నటించిన సినిమాలు బాగా ఆడాలని అనుకొంటున్నాను. నిర్మాతకు ప్రాఫిట్ రావాలని కోరుకొంటాను.

గమనం సినిమా డ్రీమ్ రోల్ అని చెప్పలేను. కానీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా. గమనం సినిమా రిలీజ్ ఎప్పుడని డైరెక్టర్‌ను అడిగితే త్వరలో అంటున్నారు. ఆ త్వరలో ఎప్పడో అర్ధం కావడం లేదు. కానీ థియేటర్లలోనే రిలీజ్ అవుతుంది అని ప్రియాంక జవాల్కర్ అన్నారు.

SR కల్యాణమండపం ప్రమోషన్స్‌లో ఎందుకు కనిపించలేదంటే?

SR కల్యాణమండపం ప్రమోషన్స్‌లో ఎందుకు కనిపించలేదంటే?

SR కల్యాణమండపం సినిమా ప్రమోషన్స్‌లో కనిపించకపోవడానికి కారణం ఏమీ లేదు. తిమ్మరుసు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. ప్రతీ సినిమాకు సంబంధించిన నా ఫెర్పార్మెన్స్ విషయంలో నా స్నేహితులతో కలిసి జెన్యూన్‌గా, ఫ్రాంక్‌గా సమీక్షించుకొంటాను. తిమ్మరుసు సినిమాలో బాగా చేశానని, SR కల్యాణమండపంలో కొంత అల్లరి పిల్లగా చేసి ఉండాలనే అభిప్రాయానికి వచ్చాను అని ప్రియాంక అన్నారు.

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అలా..

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అలా..

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లాంటి హీరోలు తమ ఫెర్ఫార్మెన్స్‌ను మానిటర్‌లో చూసుకొంటారు. వారి అప్పుడే తమ యాక్టింగ్‌పై ఓ అంచనాకు వస్తారు. నాకు అలా అంచనాకు రావడం తెలియదు. నా మాటుకు నేను డైరెక్టర్ చెప్పిన విషయాలే పట్టించుకొంటాను. అయితే నేను చేసిన సినిమాల్లో నా పాత్ర వరకు అన్ని తప్పులే కనిపిస్తాయి అని ప్రియాంక చెప్పారు.

నేను గాసిప్స్ పట్టించుకోను అంటూ..

నేను గాసిప్స్ పట్టించుకోను అంటూ..

నేను గాసిప్స్‌ను అంతగా పట్టించుకోను. కొన్నిసార్లు కామెడీగా తీసుకొంటాను. కొన్ని హర్ట్ చేస్తాయి. కొన్నిసార్లు బాగా గాసిప్స్ రాస్తే బాగుంటుందనే అనుకొంటాను. పెద్ద హీరోతో నటిస్తున్నట్టు రాస్తే అది అందరికీ షేర్ చేసి నవ్వుకుంటాను. అలాగే నెగిటివ్‌గా గాసిప్స్ వస్తే వాటిని చూసి కూడా ఎంజాయ్ చేస్తాను. సోషల్ మీడియాలో పెట్టిన పాస్‌పోర్ట్ ఫోటో బాగా వైరల్ అయింది. తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఫోటో గురించి అడుగుతున్నారు అని ప్రియాంక జవాల్కర్ చెప్పారు.

అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం

అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం

నాకు టాలీవుడ్‌లో అందరి హీరోలతో నటించాలని ఉంది. నాతో పనిచేయాలని ఏ హీరో అనుకొన్నా నేను నటించేందుకు రెడీ. నాకు అల్లు అర్జున్ అంటే క్రష్. నాలోని లోపం డ్యాన్స్ రాకపోవడం, ఒక ఏడాది కష్టపడి డ్యాన్స్‌ నేర్చుకోవాలని అనుకొంటున్నాను. త్వరలోనే మంచి డ్యాన్సర్‌గా కనిపిస్తాను అని ప్రియాంక చెప్పారు.

నా ముగ్గురు హీరోలు ఎలాంటి వారంటే..

నా ముగ్గురు హీరోలు ఎలాంటి వారంటే..

ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం, సత్యదేవ్ నటించాను. ఈ ముగ్గురిలో గొప్పగా చేయాలనే తపన ఉంటుంది. నేను నటించిన ముగ్గురు హీరోల్లో ఎవరికి వారు డిఫరెంట్. విజయ్ దేవరకొండ నా కంటే చిల్. నేను ఎంత చిల్‌గా మాట్లాడుతానో అంతకంటే ఎక్కువ చిల్‌గా ఉంటాడు. ఇక కిరణ్ అబ్బవరం అమాయకంగా ఉంటాడు. మాట్లాడేటప్పు ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు. సత్యదేవ్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అని ప్రియాంక జవాల్కర్ అన్నారు.

Recommended Video

Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
ఖాళీ సమయాల్లో ఏం చేస్తానంటే...

ఖాళీ సమయాల్లో ఏం చేస్తానంటే...

నేను ఖాళీగా ఉన్న సమయాల్లో టీవీ చూస్తాను. చాలా వెబ్ సిరీస్‌లు చూశాను. ఫ్రెండ్స్ అనే వెబ్ సిరీస్ పదిసార్లు చూశాను. అమెరికన్ బ్యూటీ నాకు బాగా నచ్చింది. నాకు కూడా ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని ఆడిషన్స్ చేస్తున్నాను. త్వరలోనే ఓటీటీలో కూడా నటించే అవకాశం ఉంది. నా ప్రయారిటీ తెలుగు సినిమాలే. తమిళంలో కూడా ఓ సినిమా ఒప్పుకొన్నాను. కన్నడ సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X