twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి... ఇంద్ర చూడటానికి వెళ్లి.. రాజా విక్రమార్క నిర్మాత రామారెడ్డి వెల్లడి

    |

    సినిమా రంగం అంటే ఎవరికి వ్యామోహం ఉండదు చెప్పండి.. అలాంటి వ్యామోహం, ఇష్టంతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన వారిలో 88 రామారెడ్డి ఒకరు. టాలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టి ఘనమైన భవిష్యత్తుపై ఓ విజన్ ఏర్పరుచుకొన్నారాయన. RX100 చిత్రంతో యువత హృదయాల్లో గిలిగింతలు పెట్టిన కార్తీకేయ గుమ్మకొండతో రాజా విక్రమార్క సినిమాను నిర్మిస్తున్నారు. తొలి చిత్రానికి తనకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్‌ను పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఆగస్టు 20వ తేదీన ఆయన బర్త్ డే సందర్భంగా మీడియాకు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ..

    మాది తూర్పు గోదావరి జిల్లా

    మాది తూర్పు గోదావరి జిల్లా

    మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలోని కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. వినోద్ రెడ్డిగారు అని ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆయనది మా ఊరు. సుమారు 200 సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాంటి వినోద్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా 'రాజా విక్రమార్క' నా తొలి సినిమా అని రామారెడ్డి చెప్పారు.

    రాజా విక్రమార్క సినిమా అలా..

    రాజా విక్రమార్క సినిమా అలా..


    చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సినిమాలను నిర్మించాలని అనుకొంటున్నప్పుడు వినోద్ రెడ్డి వద్దకు రాజా విక్రమార్క సినిమా కథ వచ్చింది. ఈ కథ గురించి ఆయన చెప్పడం, అది నాకు కూడా నచ్చడంతో సినిమా చేయాలని అనుకొన్నాం. ఆ తర్వాత ఆదిరెడ్డి గారిని కలిసి మూవీ స్టార్ట్ చేశాం అని రామారెడ్డి వెల్లడించారు.

    ఆర్ఎక్స్ 100కు మించి హిట్

    ఆర్ఎక్స్ 100కు మించి హిట్

    రాజా విక్రమార్క చిత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. కార్తీకేయ 90 ఎంఎల్ మూవీ చేస్తున్నప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. చావు కబురు చల్లగా' తర్వాత వస్తే... బావుంటుందని, ఆ సినిమా తర్వాత మా షూటింగ్ స్టార్ట్ చేశాం. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు సరిపల్లి కాంప్రమైజ్ కాకుండా తీశాడు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువపెట్టి మరీ తీశాం. ఆర్ఎక్స్ 100'కు మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే విశ్వాసాన్ని రామారెడ్డి వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులు నియంత్రణలోకి వస్తే... అక్టోబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.

    చిరంజీవిని ఆహ్వానిస్తాం..

    చిరంజీవిని ఆహ్వానిస్తాం..


    మెగాస్టార్ చిరంజీవిగారు అంటే ఇష్టం కాదు పిచ్చి. కాలేజ్ డేస్‌లో చిరంజీవి సినిమాలు చూడటానికి చాలా కష్టపడేవాళ్లం. టికెట్స్ దొరకకపోతే థియేటర్ ముందు పడిగాపులు కాసిన అనుభవం ఉంది. మా సినిమాకు చిరంజీవి మూవీ టైటిల్ పెట్టాలని అనుకున్నాం. మా సినిమా ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి గారిని పిలవాలని అనుకుంటున్నాం అని రామారెడ్డి తెలిపారు.

    Recommended Video

    Gagana Veedhi Movie Launch Event Held In Hyderabad | Filmibeat Telugu
    ఇంద్ర సినిమా చూడటానికి వెళ్లినప్పుడు..

    ఇంద్ర సినిమా చూడటానికి వెళ్లినప్పుడు..


    ఇంద్ర సినిమా చూడాలని కొంకుదురు నుంచి సైకిల్ వేసుకుని మండపేట వెళ్లాను. టికెట్ తీసుకుందామని కౌంటర్లో నిలబడితే నా దగ్గరకు వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేసేశారు. అభిమానుల మధ్య తోపులాటలో నా చెప్పు పోయింది. ఎలాగైనా సినిమా చూడాలని థియేటర్ దగ్గర వెయిట్ చేసి తర్వాత షో చూసి ఊరెళ్లా అని రామారెడ్డి చిరంజీవి సినిమాలతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు.

    English summary
    Producer 88 Rama Reddy celebrated his birthday on August 20th. In this occassion, He shares is personal life and his experience with Chiranjeevi movies as fan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X