ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం కష్టం.. కానీ క్రేజీ ఫెలో మెప్పిస్తుంది.. నిర్మాత కేకే రాధామోహన్
తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించే సినిమాను రూపొందించే నిర్మాతల్లో కేకే రాధామోహన్ ఒకరు. తాజాగా యువ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఫణికృష్ణ సిరికి దర్వకత్వంలో క్రేజీ ఫెలో అనే యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. దిగంగన సూర్యవంశీ, మీర్నా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న సమయంలో నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ..
క్రేజీ ఫెలో సినిమా ఎప్పుడో పూర్తయింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. సెప్టెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ చాలా సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో వేచి చూశాం. అక్టోబర్ 14వ తేదీ మంచిదనిపించింది. క్రేజీ ఫెలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో వైవిధ్యమైన ప్రమోషన్స్ చేస్తున్నాం అని రాధా మోహన్ తెలిపారు.

కోవిడ్ తర్వాత ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్‌కు వెళ్ళాలా? ఓటీటీలో చూడాలా? అని డిసైడ్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆడియెన్స్ థియేటర్స్‌కు రప్పించడం అతిపెద్ద ఛాలెంజ్. అందుకే ప్రమోషన్స్ విభిన్నంగా చేపట్టాం. తెలుగు రాష్ట్రాల్లో రెండు వాహనాల్లో ప్రచారం చేస్తున్నాం. టీవీ కమర్షియల్, పోస్టర్స్, గూగుల్ యాడ్స్ ,అన్ని రకాలుగా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాం. వినోదం పాళ్లు ఉన్న సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వస్తారని నమ్మకం ఉంది అని రాధామోహన్ చెప్పారు.
కొత్త దర్శకుడు ఫణికృష్ణ కథ చెప్పినట్టే సినిమాను తెరకెక్కించారు. ఆది లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ ఇద్దరూ చాలా చక్కగా చేశారు. రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో అన్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బావ ఆయుష్‌శర్మతో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం అని కేకే రాధామోహన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











