హిట్టు కొట్టడానికి స్టార్ హీరోలు అవసరం లేదు.. వాళ్లకు నా సినిమాలే స్టేటస్ తెచ్చాయి.. ఎంఎస్ రాజు సెన్సేషనల్ కామ
మనసంతా నువ్వే, ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన నిర్మాతగా, మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎంఎస్ రాజు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్లీ డైరెక్టర్‌గా మారి తనలోని దర్శకత్వ పటిమతో 'డర్టీ హరి' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా, మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 7 డేస్ 6 నైట్స్ అనే చిత్రాన్ని జూన్ 24న విడుదల చేస్తున్నారు. ఎంఎస్ రాజు తాజా చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ (తొలి పరిచయం) హీరోయిన్ గా నటించగా రోహన్, క్రితికా శెట్టిని మరో జంటగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫిలింబీట్ తెలుగుతో మాట్లాడుతూ...
హీరోలు మిమ్మల్ని వదిలేసారా, మీరు హీరోలని వదిలేసారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
నాకు కథే హీరో, హిట్ కొట్టడానికి పెద్ద హీరోలు అవసరం లేదు. ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది నా సినిమాలే. మంచి కథల వల్లే అది సాధ్యమైంది ఆ యాక్టర్ మార్కెట్ వల్ల కాదు అని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు.

10 ఏళ్ళ గ్యాప్ ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు ఎంఎస్ రాజు సమాధానం ఇస్తూ.. నా కెరీర్‌లో ఫ్లాపులు ఎక్కువగా లేవు. కానీ సక్సెస్ వచ్చినప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి. కానీ ఫ్లాపులు వచ్చినప్పుడు డబ్బులు చాలా ఎక్కువగా పోయాయి. పౌర్ణమి తర్వాత మిగితా విషయాల వల్ల కూడా చాలా కోల్పోయాను. అందుకే నన్ను నేను సరి చేసుకోడానికి, మార్కెట్‌ను అర్ధం చేసుకోవడానికి కొంత గ్యాప్ తీసుకొన్నాను అని అన్నారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ ఎందుకు తీయాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మిగితా కథకుల లాగా ఇప్పుడొచ్చే రొట్ట కమర్షియల్ చిత్రాలు నేను చేయను. నాకు సంతృప్తిని ఇచ్చే కొత్త కథలు, ఎవ్వరూ ప్రయత్నించని జానర్‌లో చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను అని ఎంఎస్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











