కోరిక తీరకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు.. రాజా విక్రమార్క హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ఎమోషనల్

రాజా విక్రమార్క సినిమా ట్రైలర్లు చూసి ఉంటారు. కార్తికేయ ఏజెంట్ రోల్ చేస్తున్నారు. అంతకు మించి చెప్పలేను. నవంబర్ 12న విడుదల అవుతుంది. థియేటర్లలో సినిమా చూడండి. చాలా బావుంటుంది. మా నిర్మాత '88' రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి .టి ఖర్చుకు వెనుకాడకుండా భారీ స్థాయిలో సినిమా తీశారు అని హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ తెలిపారు.

నాకు చిన్నతనం నుంచే యాక్టింగ్‌ చేయాలని అనుకొన్నాను. మా తాత గారు రవిచంద్రన్ ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. అయితే నేను సినిమా రంగంలో ప్రవేశించి నటించే సమయానికి మా తాతగారు చనిపోయారు. ఇప్పుడు అతడు ఉండి ఉంటే నా కెరీర్ చూసి చాలా సంతోషపడి ఉండేవారు. కానీ దురదృష్టం వెంటాడింది అని తాన్యా రవిచంద్రన్ అన్నారు.

Raja Vikramarka fame Tanya Ravichandran emotional about grand father Actor Ravichandran

నా కెరీర్ అనుకోకుండా స్టార్ట్ అయింది. దర్శకుడు మిస్కిన్‌ ఆఫర్ ఇచ్చారు. దాంతో కాదనలేకపోయాను. ఒక సినిమా చేసి నేను చదువుకొందామని అనుకొన్నాను. కానీ వరుసగా ఆఫర్లు రావడంతో నేను మరో రెండు,మూడు సినిమాలు చేశాను. అనంతరం నేను మళ్లీ చదువు కోసం వెళ్లాను. పీజీ పూర్తి చేసిన తర్వాత వచ్చిన ఆఫర్లకు ఓకే చెప్పాను అనని రవిచంద్రన్ తెలిపారు.

రాజా విక్రమార్క నాకు తెలుగులో మొదటి సినిమా. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాలని అనుకొంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. నాకు తెలుగు అర్థం అవుతుంది. కానీ, వెంటనే తిరిగి మాట్లాడలేను. మరికొన్ని రోజుల్లో తెలుగు బాగా నేర్చుకొని మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను అని తాన్యా రవిచంద్రన్ తెలిపారు.

Raja Vikramarka fame Tanya Ravichandran emotional about grand father Actor Ravichandran

సినిమా రంగంలోకి రావడానికి ముందు మోడల్‌గా గానీ, మరో విధంగా నటించలేదు. ఇప్పటికే నేను నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో ఐదు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఒక సినిమా కొద్ది రోజులు షూటింగ్ ఉంది. మరో సినిమా మూడు రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉంది. మిగితావన్నీ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి అని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు.

2016లో భల్లే వెల్లైయతేవా చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బృందావనం, కరుప్పన్, మాయోన్, సామ్ ఆంటోన్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజా విక్రమార్కతోపాటు నెంజుకు నీది అనే చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X