For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raja Vikramarka రిలీజ్‌కు ముందే రికార్డు..ఫ్యాన్సీ రేట్‌కు హిందీ రైట్స్..జోష్‌లో నిర్మాతలు ఆదిరెడ్డి,రామారెడ్డ

  |

  కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయగా అనుహ్యమైన రెస్పాన్స్ వస్తున్నది. కొద్దిగంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత '88' రామారెడ్డి ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

  ఆదిరెడ్డి, రామారెడ్డి వ్యక్తిగత జీవితం గురించి
  ఆదిరెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలంలో గల వెదురుపాక గ్రామం. ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారిది మా ఊరే. డిగ్రీ వరకూ మా ఊరిలో చదువుకున్నాను. తర్వాత వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా వెళ్లాను ఆది రెడ్డి అన్నారు.
  '88' రామారెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. ఎస్వీ కృష్ణారెడ్డిగారు మా ఊరివాసులే.

  Raja Vikramarka hindi Right sold for Fancy rate, Says Aadi Reddy, 88 Rama Reddy

  మీరిద్దరూ ఒకే ప్రాంతం వారు? మీకు ముందు నుంచే పరిచయం ఉందా?

  ఆదిరెడ్డి: వ్యాపారంలో మేమిద్దరం స్నేహితులం. మా గ్రామాలు కూడా పక్కన పక్కనే. సినిమాల్లోకి రాకముందు నుంచి స్నేహం ఉంది.
  '88' రామారెడ్డి: ముందు వ్యాపారంలో కలిశాం. ఆ తర్వాత మా మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని తెలిసింది. పదేళ్లకుగా పైగా మా బంధం కొనసాగుతోంది. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. అందుకని, సినిమా చేశాం. మా ఇద్దరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవిగారు. మా ఇద్దరికీ నిర్మాతల్లో డాక్టర్ రామానాయుడుగారు ఆదర్శం.

  రాజా విక్రమార్క ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?

  '88' రామారెడ్డి: హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉందని చాలా మంది ఫోనులు చేశారు. మా దర్శకుడు శ్రీ సరిపల్లి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేశాడు. టీజర్ విడుదల చేసినప్పుడు రెండు మూడు మిలియన్ వ్యూస్ వస్తాయని అనుకున్నాం. కానీ, ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. వ్యూస్ పక్కన పెడితే... టీజర్ చాలా స్టయిలిష్, రిచ్‌గా ఉందని చెబుతున్నారు.

  ఆదిరెడ్డి: మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయకముందు నుంచి మంచి బజ్ నెలకొంది. హిందీ రైట్స్‌ను 3.25 కోట్లకు కొనుగోలు చేశారు. తమిళ ప్రేక్షకుల నుండి ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత టాప్ క్లాస్ అని చెబుతున్నారంతా.

  Raja Vikramarka hindi Right sold for Fancy rate, Says Aadi Reddy, 88 Rama Reddy

  కార్తికేయ పక్కా ప్రొఫెషనల్‌గా
  ఆదిరెడ్డి, '88' రామారెడ్డి: హీరోగా వందకు 200 శాతం కష్టపడతారు. వ్యక్తిగా అయితే... ఆయన గురించి మాటల్లో చెప్పలేం. అంత మంచి మనిషి. కరోనా రెండు దశలను దాటుకుని మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కార్తికేయ. మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

  ప్రశ్న: కార్తికేయ సినిమాల్లో మీకు నచ్చినది?
  '88' రామారెడ్డి: ఆయన చేసిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. అన్నిటి కంటే 'గ్యాంగ్ లీడర్' చాలా ఇష్టం. అందులో ఆయన నటన చాలా చాలా బావుంటుంది. అంతకు మించి మా 'రాజా విక్రమార్క'లో నటించారు. కార్తికేయ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు... ఈ సినిమా మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

  ఆదిరెడ్డి: రామారెడ్డిగారు చెప్పినట్టు... సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. అంతబాగా నటించారు. ఇక, కార్తికేయగారి సినిమాల్లో 'ఆర్ఎక్స్ 100' ఇష్టం. '90ఎంఎల్' కూడా నచ్చింది. 'గుణ 369' అయితే నాతో పాటు మా కుటుంబ సభ్యులు అందరికీ ఇష్టం.

  ప్రశ్న: రామారెడ్డిగారి పేరు ముందు '88' అని ఉంటుంది. ఎందుకు? అని అడిగితే... నాలుగు సినిమాల తర్వాత చెబుతానని అన్నారు. అదేంటో మీకు తెలుసా?
  ఆదిరెడ్డి: నాలుగు సినిమాల తర్వాత చెప్పరేమో (నవ్వులు). ఆయన కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచుతారు.

  ప్రశ్న: 'రాజా విక్రమార్క' తర్వాత మీరు చేయబోయే సినిమా?
  రామారెడ్డి: రెండు బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. త్వరలో వివరాలు వెల్లడిస్తాం.
  ఆదిరెడ్డి: అన్నీ కుదిరితే... 'రాజా విక్రమార్క' సక్సెస్ మీట్ లో కొత్త సినిమా గురించి ప్రకటిస్తాం.

  English summary
  Raja Vikramarka Producers Aadi Reddy, 88 Rama Reddy more confident on their movie. They said, hindi Right sold for Fancy rate.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X