ఆరెంజ్ ఫ్లాప్‌పై రాంచరణ్ మరోసారి రియాక్షన్.. అవకాశముంటే చిరంజీవి, పవన్ మాదిరిగానే..

ఎప్పుడూ లేని విధంగా వరుసగా రెండు నెలల్లో రెండు సినిమాలు రావడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో మాదిరిగా సంవత్సరం ఆరు, ఏడు సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. RRR నా సినిమా. ఆచార్య విషయానికి వస్తే.. అది నా సినిమా కాదు. చిరంజీవి గారి సినిమా. దాంట్లో నేను ఓ పాత్ర పోషిస్తున్నాను. అంతేగానీ ఆచార్య నా సినిమా అంటే ఒప్పుకోను. ప్రస్తుతం నేను సినిమా వేగం పెంచాను. శంకర్ సినిమా 60 రోజుల షూటింగ్ పూర్తయింది. ఆయనకు కూడా గ్యాప్ రావడంతో వేగంగా సినిమాను కంప్లీట్ చేయాలని అనుకొంటున్నారు. ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా ఉంటుంది అని రాంచరణ్ తెలిపారు. ఆచార్య, RRR, అరెంజ్ సినిమాల గురించి రాంచరణ్ మాట్లాడుతూ..

చిరంజీవి కథల విషయంలో జోక్యం..

చిరంజీవి కథల విషయంలో జోక్యం..

చిరంజీవి గారి కథల విషయంలో నేను జోక్యం చేసుకోవడం లేదు. నేను నిర్మాత అయినప్పటికీ.. చిరంజీవి మాత్రమే కథల విషయంలో ఆయనే జడ్జిమెంట్ ఉంటుంది. నిర్మాతను అయినప్పటికీ.. నేను చేయిపెట్టాను. ఆచార్య సినిమాను ఇతరులతో కలిసి నిర్మించడానికి కారణం RRR. వాస్తవానికి కొణిదెల బ్యానర్‌లో చేయాలని అనుకొన్నాం. కానీ RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం కారణంగా నేను నిరంజన్ రెడ్డితో భాగమయ్యాం అని రాంచరణ్ వెల్లడించారు.

అవకాశం ఉంటే.. పవన్, చిరంజీవి మాదిరిగానే..

అవకాశం ఉంటే.. పవన్, చిరంజీవి మాదిరిగానే..

చిరంజీవి, పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారి మాదిరిగానే అవకాశం ఉంటే.. నేను నాలుగైదు సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను. కొరటాల శివ, రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లతో సినిమా చేస్తే.. రకరకాల అంశాలు ఉంటాయి. దాంతో తదుపరి సినిమాలు త్వరగా చేయడానికి ఛాన్ప్ ఉండదు. అందుకే ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉండదు అని రాంచరణ్ అన్నారు.

బాలీవుడ్ సినిమా చేయాల్సిన అవసరం

బాలీవుడ్ సినిమా చేయాల్సిన అవసరం

బాలీవుడ్ సినిమాలు ప్లాన్ చేయలేదు. మన సినిమాలే అక్కడ ఆడుతున్నాయి. అక్కడ నుంచి మంచి కథ వస్తే.. బాలీవుడ్ సినిమా చేస్తా. లేదంటే ఇక్కడి దర్శకులతో కథలు చేస్తాను. మన సినిమాలకు హిందీలో ఆదరణ పెరుగుతున్నది. కథ, ఎమోషనల్ అంశాలతో బట్టి సినిమా రేంజ్ డిసైడ్ అవుతుంది అని రాంచరణ్ తెలిపారు.

RRR బాధ్యత పెంచిందంటూ

RRR బాధ్యత పెంచిందంటూ


RRR సినిమా విజయాన్ని మంచి బాధ్యతను పెంచింది. రాబోయే సినిమా కథలను ఎంచుకోవడం విషయంలో ఓ ఛాలెంజ్‌గా మార్చింది. దేశవ్యాప్తంగా RRR సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ సినిమా విజయాన్ని పక్కన పెడితే.. RRR మూవీ పూర్తయింది అనే విషయం మాకు సంతృప్తిని, ఆనందాన్ని పెంచింది అని రాంచరణ్ తెలిపారు.

ఆరెంజ్ సినిమా గురించి చెర్రీ రియాక్షన్

ఆరెంజ్ సినిమా గురించి చెర్రీ రియాక్షన్

ఇండస్ట్రీలో హిట్టు సినిమాను డిజైన్ ఎవరు డిజైన్ చేయలేరు. కథలో ఉండే ఎమోషన్స్, ఇతర అంశాలు మాత్రమే సినిమాను హిట్ చేస్తాయి. అయితే మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం నా మనసుకు నచ్చిన చిత్రం. పెద్ద సినిమా తర్వాత చిన్న సినిమా చేయడం వల్ల ఆరెంజ్ ఫ్లాప్ కాలేదు. దర్శకుడు నాలుగైదు కథలతో వచ్చి సినిమా చేద్దామంటే ఒప్పుకోను. దర్శకుడి కన్విక్షన్ బట్టి సినిమా ఉండాలి. అంతేగానీ.. హీరోను బట్టి కథ రాసుకోకూడదు. కథలో హీరో కనిపించాలి. సినిమా చేయాలంటే హీరోకు ఆప్షన్లు ఉండకూడదు. హీరోను ఎలా చూపించాలనే విజన్ దర్శకుడికి ఉండాలి అని రాంచరణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X