twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Konda ప్రతీ హత్యకు జస్టిఫికేషన్ ఉంటుంది.. ‘కొండా’ మురళి బయోపిక్‌పై వర్మ సంచనల వ్యాఖ్యలు..

    |

    వరంగల్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ రాజకీయాలను శాసించిన కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..

    కొండా జీవితాల్లో హెవీ హై డ్రామా

    కొండా జీవితాల్లో హెవీ హై డ్రామా

    నేను విజయవాడలో చదువుకొన్నాను కాబట్టి నాకు అక్కడి రౌడీయిజం గురించి తెలుసు. రక్త చరిత్ర తీసిన తర్వాత రాయలసీమ రాజకీయ ఫ్యాక్షన్ గురించి తెలిసింది. ఒక సందర్భంలో పోలీస్ ఆఫీసర్‌తో మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రాంతంలోని కొండా మురళీ, కొండా సురేఖ గురించి తెలిసింది. నా ఫ్రెండ్ వారి గురించి చెప్పిన విషయాలు నాకు ఆసక్తిని కలిగించాయి.

    కొండా సురేఖ గురించి తెలుసు కానీ.. కొండా మురళీ గురించి నాకు పెద్దగా తెలియదు. పోలీసులు, మాజీ నక్సలైట్లతో మాట్లాడిన తర్వాత వారి జీవితాల్లో హెవీ డ్రామా కనిపించింది. ఆ తర్వాత కొండా దంపతులను కలిసి సినిమా గురించి చెబితే.. వారి కుమార్తె.. మా కథ కాబట్టి.. మేమే ఈ సినిమాను నిర్మిస్తామని చెప్పారు. అలా కొండా సినిమా మొదలైంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    త్రిగుణ్‌లో కొండా మురళిని చూశా

    త్రిగుణ్‌లో కొండా మురళిని చూశా

    కొండా దంపతుల జీవితాల్లో ముఖ్యంగా మురళీ క్యారెక్టర్‌‌లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్ ఉన్నాయనిపించింది. ఆయన మాట్లాడితే తీరు, ఉపయోగించే తిట్లు కొత్తగా అనిపించాయి. సినిమా మేకింగ్‌లో బాగా వర్కువుట్ అవుతాయని భావించాను. అవన్నీ త్రిగుణ్ పోషించిన పాత్రలో నేను చూసుకొన్నాను. ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఆ సమయంలో నెలకొన్న అంశాలు నాకు బాగా నచ్చాయి. కొండా జీవితంలో 1990 నుంచి 2000 వరకు జరిగిన విషయాలను ఈ చిత్రంలో తెరకెక్కించాను అని ఆర్జీవి అన్నారు.

    వాస్తవాలు, నిజాలు ఎంతంటే?

    వాస్తవాలు, నిజాలు ఎంతంటే?

    కొండా చిత్రంలో నాకు తెలిసిన విషయాలు మాత్రమే తెరకెక్కించాను. అందులో వాస్తవాలు, నిజాలు ఎంత అంటే.. నేను కరెక్ట్‌గా చెప్పలేను. ఒకవేళ కొండా దంపతులు ఎదైనా చెబితే.. అందులో ఎంత మేరకు నిజాలు ఉంటాయో చెప్పలేం. అయితే నిజాలను, వాస్తవాలను బేరీజు వేసుకోలేం. కాబట్టి టోటల్‌గా చూసుకొంటే.. కొండా జీవితంలో జరిగిన విషయాలు మాత్రమే చెప్పగలిగాం.

    అయితే కొండా దంపతులు ఒత్తిడి నాపై లేదు. నేను ఏదైతే తీయాలని అనుకొంటున్నానో.. అదే తీశాను. నేను నమ్మిన కథనే నేను తీశాను, కొండా ఫ్యామిలీకి అనుకూలంగా తీయలేదు. కొండా మురళి, సురేఖకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మంచి పనులు చేసినప్పుడు అటువంటి ఫాలోయింగ్ వస్తుంది అని ఆర్జీవి తెలిపారు.

    ఒకరిని చంపారని అనుకొందాం.. కానీ

    ఒకరిని చంపారని అనుకొందాం.. కానీ

    కొండా మురళి పాజిటివ్ పాయింట్స్ చెబుతున్నానా? ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను కూడా సినిమాలో ప్రస్తావిస్తున్నానా అంటే.. క్రైమ్ అనేది క్రైమ్. అయితే, ఆ క్రైమ్ వెనుక కారణం ఏమిటి? అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అలాంటి అంశాలను ఎలా చూపించానుఅనేది 'కొండా'లో చూడాలి. ఒకరిని చంపారు అనుకుందాం. ఎందుకు చంపారు అనేది క్యారెక్టర్ జస్టిఫికేషన్. మనం క్యారెక్టర్‌తో కనెక్ట్ అవడంపై ఉంటుంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

    కొన్ని పేర్లు దాచాను.. కొన్ని పేర్లు చెప్పాను అంటూ

    కొన్ని పేర్లు దాచాను.. కొన్ని పేర్లు చెప్పాను అంటూ

    కొండా చిత్రంలో వారి పేర్లను యధావిధిగా ఉపయోగించాను. కొండామురళి ప్రయాణంలో దయాకర్, ఆర్కే ఉన్నారు. అయితే ఎవరెవరు ఓకే అన్నారో... అడగటానికిఎవరు అయితే లేరో... వాళ్ళ పేర్లు అలాగే ఉంచాను. ఒకవేళ సుస్మిత నిర్మాత కాకపోయియినాఇదే తీస్తా. నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశా రక్త చరిత్ర రెండు భాగాలు తీశా. ఆ సినిమాల్లో పేర్లు దాచలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారనే అని విమర్శ ఉంది. అది పక్కన పెడితే... నేను తీయాలనుకున్నవితీశా అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

    English summary
    Konda Murali, Konda Surekha's biopic Konda is set to release on 23rd. In this occassion, Ram Gopal Varma reveals fact of Konda family and movie making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X