twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెతో కెమిస్ట్రీ.. ఆ వార్తలన్నీ రూమర్లే.. వాస్తవం లేదు.. హీరో రామ్

    |

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో యువ హీరో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రకాశ్ రాజ్ నటించిన చిత్రం హలో గురూ ప్రేమకోసమే. ఈ చిత్రం అక్టోబర్ 18న దసరా కానుకగా రిలీజ్ అవుతున్నది. ఉన్నది ఒకటే జిందగీ చిత్రం తర్వాత ఈ చిత్రంలో రామ్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ..

    అనుపమతో నాకు రెండో సినిమా

    అనుపమతో నాకు రెండో సినిమా

    హలో గురు ప్రేమకోసమే చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పాత్రలో కనిపించాను. సినిమాలో కొద్ది నిమిషాలు పల్లెటూరి అబ్బాయిగా కనిపిస్తాను. పల్లెటూరి అబ్బాయి పాత్ర ఉండేది కొద్దిసేపైనా స్క్రీన్ మీద రచ్చ రచ్చగా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్‌తో ఇది నాది రెండో సినిమా. మా ఇద్దరి మధ్య కొత్తరకమైన కెమిస్ట్రీ ఉంటుంది.

    Recommended Video

    'Hello Guru Prema Kosame' Movie Pre Release Event | Ram Pothineni | Anupama Parameswaran | Filmibeat
    డైరెక్టర్ త్రినాథరావు చిత్రాలకు భిన్నంగా

    డైరెక్టర్ త్రినాథరావు చిత్రాలకు భిన్నంగా

    మాట రచయిత కథ చెప్పినప్పుడు నేను పడిపడీ నవ్వాను. త్రినాథ రావు సినిమాలకు భిన్నంగా హలో గురూ ప్రేమకోసమే ఉంటుంది. మామ, అల్లుళ్ల మధ్య ఛాలెంజ్‌లు ఉండవు. డైరెక్టర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలా మాస్‌గా ఉంటాయి. ఈ కథలో ఉండే ఎమోషన్‌ను విన్నప్పుడు నేను ఏదైతే థియేటర్లలో సినిమా చూడాలనుకొంటానో అలానే ఉంది. దాంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాను అని రామ్ తెలిపారు.

    సున్నితమైన పాయింట్‌తో

    సున్నితమైన పాయింట్‌తో

    హలో గురూ ప్రేమ కోసమే సినిమా కథ అంతా ప్రకాశ్ రాజ్, అనుపమ పరమేశ్వరన్, నాపై సాగుతుంటుంది. కథలో భాగంగానే కామెడీ ఉంటుంది. అంతేకానీ ప్రత్యేకంగా ట్రాక్ అంటూ ఏదీ లేదు. ప్రణిత క్యారెక్టర్ కథలో కీలకమైంది. ఈ కథలోని సున్నితమైన పాయింట్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటుంది. అందరికీ కనెక్ట్ కూడా అవుతుంది.

    ప్రసన్న కథ సానుకూలంగా

    ప్రసన్న కథ సానుకూలంగా

    షూటింగ్ సమయంలో మాటల రచయిత ప్రసన్న ఎఫర్ట్స్ సినిమా అవుట్‌పుట్ రావడానికి ప్లస్ అయ్యాయి. అతను సీన్‌ను వివరించే తీరు అందరికీ సులభంగా అర్ధమవుతుంది. దాంతో పాత్ర, సీన్‌పై అవగాహన పెరుగుతుంది. పాత్ర గురించి రాసేటప్పుడు తాను ఏమన్నుకొన్నాడో దానిని చక్కగా వివరిస్తాడు. ఓవరాల్‌గా హలో గురూ ప్రేమ కోసమే ఓ కుటుంబ కథా చిత్రమని చెబుతాను.

    విభేదాలు తలెత్తాయని చెప్పడం

    విభేదాలు తలెత్తాయని చెప్పడం

    ప్రసన్న కారణంగా సినిమాటోగ్రాఫర్ అప్‌సెట్ అయ్యారనే విషయం వాస్తవం కాదు. ప్రసన్నకు, ప్రకాశ్ రాజ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలు నిజం కాదు. ఆ వార్తలన్నీ రూమర్లే. ప్రసన్న వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగలేదు. అనుపమ పరమేశ్వరన్‌కు డైలాగ్స్ వివరించడంలో ప్రసన్న సహకారం మరింత హెల్ప్ అయింది.

    మరిన్ని సినిమాలు చేస్తాను

    మరిన్ని సినిమాలు చేస్తాను

    ప్రస్తుతం నేను సినిమాలు చేస్తున్న తీరు, సంఖ్యపై నాకు పూర్తిగా సంతృప్తి లేదు. ఇంకా మంచి సినిమాలు, ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. ఒక్కొ సమయంలో ఒకే ఏడాదిలో మూడు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు చేయాలని ఉన్నా.. నన్ను ఎక్సైటింగ్‌కు గురిచేసే కథలు రావడం లేదు.

    English summary
    Hello Guru Prema Kosame is set to release this Dussehra. Ram and Anupama Parameshwaran are the lead pair. The film is directed by Trinadha Rao Nakkina of Cinema Choopistha Mama and Nenu Local. The film also has Pranitha as another female actress. Prakash Raj appears in a key role. Music is by Devi Sri Prasad and songs are pretty ordinary. Dil Raju is producing this romantic drama that releases on October 18.The film has been cleared by Censor Board with no cuts and has obtained U Certificate. In this occasssion, Ram speaks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X