»   » అప్పుడే.. అతడితో లవ్‌లో పడ్డాను.. ఆ విషయం గురించి చెప్పను.. రాశీఖన్నా

అప్పుడే.. అతడితో లవ్‌లో పడ్డాను.. ఆ విషయం గురించి చెప్పను.. రాశీఖన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాశీఖన్నా అందం, అభినయంతో ఆకట్టుకొంటున్నది. తెలుగు చక్కగా మాట్లాడే అందాల భామ పాటలు కూడా పాడుతున్నది. తాజాగా వరుణ్ తేజ్‌తో రాశీ ఖన్నా నటించిన చిత్రం తొలిప్రేమ ఫిబ్రవరి 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో మీడియాతో రాశీఖన్నా మాట్లాడింది.. రాశీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ట్రైలర్
పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ గురించి

పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ గురించి

పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ గురించి నాకు తెలుసు. ఎనిమిది నెలల క్రితం ఆ సినిమాను చూశా. ఆ సినిమాలో కీర్తీరెడ్డి ఎంట్రీ చాలా బాగుంది. ఆ తొలిప్రేమకు దీనికి పోలీకలేదు. ఈ జనరేషన్‌లో తొలి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పే సినిమా ఇది.

నా మనసుకు నచ్చిన ప్రేమకథ

నా మనసుకు నచ్చిన ప్రేమకథ


ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత నా మనసుకు నచ్చిన ప్రేమకథ ఇది. నా కెరీర్‌లో ఓ మంచి లవ్‌స్టోరీ. నాకు లవ్‌స్టోరీస్ చేయడం మంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్లకు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. అదే మ్యాజిక్ సినిమాకు కూడా వర్కవుట్ అవుతుంది అని అనుకొంటున్నాను.

తొలిప్రేమలో నా ఎంట్రీ బాగానే

తొలిప్రేమలో నా ఎంట్రీ బాగానే

వరుణ్, నేను నటించిన తొలిప్రేమలో నా ఎంట్రీ బాగానే ఉంటుంది. కానీ కీర్తీరెడ్డి అంత గొప్పగా ఉండదు. నేను, వరుణ్‌కు మూడు రకాల డిఫరెంట్ లుక్స్, వేరియన్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో జిల్ సినిమాలో ఎంట్రీ బాగా నచ్చింది. నేను కళ్లజోడుతో కనిపిస్తాను. అందరూ హారీపోటర్ అమ్మాయి అని అంటున్నారు.

తొలిప్రేమ సినిమా కోసం

తొలిప్రేమ సినిమా కోసం

తొలిప్రేమ సినిమా కోసం బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డాను. రోజు రెండు గంటలపాటు జిమ్‌లో గడిపాను. నేను మొత్తంగా 10 కేజీలు తగ్గాను. తొలిప్రేమ కోసం 5 కేజీలు తగ్గాను. మూడు క్యారెక్టర్లలో వేరియేషన్ కనిపిస్తాయి. వెంకీ అట్లూరి బాగా తీశాడు. అతను కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది.

17 ఏళ్ల వయసులో

17 ఏళ్ల వయసులో

నా లైఫ్‌లో నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలో పడ్డాను. స్కూల్‌లో నా సీనియర్‌తో లవ్ పడ్డాను. అతనే ప్రపోజ్ చేశాడు. ఈ సినిమాలో నటించేటప్పుడు క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారా అని భావిస్తున్నా. అవన్నీ ఈ షూటింగ్‌లో గుర్తుకు వచ్చాయి. బ్రేకప్ ఎందుకయ్యిందో నేను చెప్పలేను.

ఫస్ట్ లవ్ (తొలిప్రేమ) ఎప్పటికీ

ఫస్ట్ లవ్ (తొలిప్రేమ) ఎప్పటికీ

ఫస్ట్ లవ్ (తొలిప్రేమ) ఎప్పటికీ ఫస్ట్ లవే. సినిమాలో ఎమోషనల్ సీన్లు చేసేటప్పుడు నా ఫస్ట్ లవ్ గుర్తొచ్చింది. ఆ మెమొరీస్ నుంచి బయటకు రావడానికి కొంత సమయం పట్టేంది. కారులో ఓ రొమాంటిక్ సీన్ ఉంటుంది. ఆ సీన్ నాకు బాగా నచ్చింది.

గుంటూరులో తొలి ప్రేమ ప్రీరిలీజ్

గుంటూరులో తొలి ప్రేమ ప్రీరిలీజ్

గుంటూరులో తొలి ప్రేమ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ బాగా ఉంది.

తమిళంలో మూడు సినిమాలు

తమిళంలో మూడు సినిమాలు

తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను. అధర్వతో ఒకటి, సిద్దార్థ్‌తో ఒకటి, జయం రవితో మరొకటి చేస్తున్నాను. సిద్ధార్థ్‌తో సినిమా ఫినిష్ అయింది. ఓ సినిమాలో రమ్యకృష్ణతో పనిచేశాను. ఆమె చాలా డౌన్ టూ ఎర్త్.

తెలుగు సినిమాలో డబ్బింగ్

తెలుగు సినిమాలో డబ్బింగ్

తెలుగు సినిమాలో డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తొలిప్రేమ విషయంలో గొడవ కూడా పడ్డాను. తెలుగులో పాటలు పడాను. మలయాళంలో కూడా ఓ పాట పాడాను. మలయాళం భాష చాలా కష్టం. తెలుగులో ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నించాను. షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన వీలు కాలేదు.

English summary
Varun Tej's film Toliprema produced by BVSN Prasad. The film marks the debut of Venky Atluri. Heroine is Raashi Khanna.This film set to release on feb 10. In this occassion, Rashi Khanna spokes to media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu